మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అరెస్టు | MLA ahmed balala arrested in GHMC elections case | Sakshi
Sakshi News home page

మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అరెస్టు

Published Sun, Apr 10 2016 6:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అరెస్టు

మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అరెస్టు

ఎంబీటీ నాయకుడిపై దాడి కేసులో..
హైదరాబాద్: ఎంబీటీ నాయకుడిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాలను మలక్‌పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజైన ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం అక్బర్‌బాగ్ డివిజన్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్‌పై ఎమ్మెల్యే బలాల, కార్పొరేటర్ మినాజుద్దీన్‌లు 40 మంది కార్యకర్తలతో కలసి దాడి చేశారు. దీంతో గాయపడిన అంజదుల్లాఖాన్‌ను యశోదా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

బాధితుడు అంజదుల్లాఖాన్ ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన ఎంఐఎం నాయకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా పోలీసులు అదే కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాల తోపాటు కార్పొరేటర్ మినాజుద్దీన్‌లను శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement