mla Ahmed Balala
-
కి‘లేడీ’ల హల్చల్: వృద్ధులను కత్తితో బెదిరించి భారీ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు మహిళలు దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తితో బెదిరించి రూ.6 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువతుల దాడిలో వృద్ధురాలు గాయపడింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‌పురాలో ఇద్దరు మహిళలు బురఖాలో వచ్చి వృద్ధురాలి (85)ని గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. నగదు, నగలు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ప్రాణభయంతో గజగజ వణికింది. అనంతరం ఆ యువతులు బెదిరించి ఆమె నుంచి రూ.6 లక్షల నగదుతో పాటు ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాల వృద్ధ దంపతులను పరామర్శించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లింట విషాదం.. తమ్ముడి పెళ్లికొచ్చి ఎన్నారై కరోనాకు బలి చదవండి: 577 మంది టీచర్లు కరోనాకు బలి ఈ వృద్ధ దంపతులను బెదిరించిన యువతులు -
మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అరెస్టు
ఎంబీటీ నాయకుడిపై దాడి కేసులో.. హైదరాబాద్: ఎంబీటీ నాయకుడిపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాలను మలక్‌పేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజైన ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం అక్బర్‌బాగ్ డివిజన్ ప్రభుత్వ పాఠశాల వద్ద ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్‌పై ఎమ్మెల్యే బలాల, కార్పొరేటర్ మినాజుద్దీన్లు 40 మంది కార్యకర్తలతో కలసి దాడి చేశారు. దీంతో గాయపడిన అంజదుల్లాఖాన్‌ను యశోదా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుడు అంజదుల్లాఖాన్ ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన ఎంఐఎం నాయకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా పోలీసులు అదే కేసులో ఎమ్మెల్యే అహ్మద్ బలాల తోపాటు కార్పొరేటర్ మినాజుద్దీన్లను శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
డిప్యూటీ సీఎం తనయుడిపై ఎంఐఎం దాడి!
హైదరాబాద్: అజంపురలోని తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ నివాసం వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగారు. నివాసం వద్ద ఉన్న ఆయన తనయుడు అజం అలీపై ఎమ్మెల్యే బలాల దాడికి యత్నించారు. దీంతో బలాల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి యత్నించిన ఎమ్మెల్యే బలాలను చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు మహముద్ అలీ కుటుంబాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరామర్శించారు. టీఆర్ఎస్ను చూసి ఎంఐఎం భయపడుతోందని, అందుకే దాడికి ప్రయత్నించిందని డిప్యూటీ సీఎం తనయుడు అజం అలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
25 లక్షలు పరిహారం చెల్లించాలి: ఎమ్మెల్యే బలాలా
హైదరాబాద్ : మెట్రో రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని మలక్‌పేట మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారాన్ని ఎల్అండ్టీ కంపెనీ చెల్లించాలని, ఈ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మలక్‌పేట వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల్లో గురువారం తెల్లవారుజామున సిమెంటు లారీ బోల్తాపడి ఇద్దరు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. పిల్లర్ల కోసం తీసిన గుంతల్లో ప్రమాదవశాత్తు సిమెంట్ లారీ బోల్తాపడగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.