
25 లక్షలు పరిహారం చెల్లించాలి: ఎమ్మెల్యే బలాలా
హైదరాబాద్ : మెట్రో రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని మలక్పేట మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారాన్ని ఎల్అండ్టీ కంపెనీ చెల్లించాలని, ఈ ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా మలక్పేట వద్ద జరుగుతున్న మెట్రో రైలు పనుల్లో గురువారం తెల్లవారుజామున సిమెంటు లారీ బోల్తాపడి ఇద్దరు కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. పిల్లర్ల కోసం తీసిన గుంతల్లో ప్రమాదవశాత్తు సిమెంట్ లారీ బోల్తాపడగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.