
ఘటన జరిగిన నివాసంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు మహిళలు దోపిడీకి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తితో బెదిరించి రూ.6 లక్షల నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువతుల దాడిలో వృద్ధురాలు గాయపడింది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే వచ్చి పరామర్శించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‌పురాలో ఇద్దరు మహిళలు బురఖాలో వచ్చి వృద్ధురాలి (85)ని గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. నగదు, నగలు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ప్రాణభయంతో గజగజ వణికింది. అనంతరం ఆ యువతులు బెదిరించి ఆమె నుంచి రూ.6 లక్షల నగదుతో పాటు ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాల వృద్ధ దంపతులను పరామర్శించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లింట విషాదం.. తమ్ముడి పెళ్లికొచ్చి ఎన్నారై కరోనాకు బలి
చదవండి: 577 మంది టీచర్లు కరోనాకు బలి
ఈ వృద్ధ దంపతులను బెదిరించిన యువతులు
Comments
Please login to add a commentAdd a comment