Yashoda hospital doctors
-
ఎడమ చేయి లాగుతున్నట్టుగా ఉందని కేసీఆర్ చెప్పారు: వైద్యులు
-
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రెండు రోజులుగా సీఎం కేసీఆర్ నీరసంగా ఉన్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎడమ చేయి లాగుతున్నట్లుగా ఉందని కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. ఈ ఉదయం కేసీఆర్ కాల్ చేసి సమస్య వివరించారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని సూచించగా సీఎం ఒప్పుకున్నారన్నారు. ఆయనకు తొలుత ఈసీజీ, ఆ తర్వాత 2డి ఎకో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. చదవండి: CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత! ఈసీజీ, 2డి ఎకో పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. ఎందుకైనా మంచిదని యాంజియోగ్రామ్ చేశామన్నారు. ఆ పరీక్షల్లో ఎలాంటి బ్లాక్ లేదని తేలిందన్నారు. ఎడమ చేయి ఎందుకు లాగుతుందన్న కారణంగా ఎంఆర్ఐ చేశామన్నారు. మెడకు సంబంధించి ఎంఆర్ఐ, అలాగే బ్రెయిన్ ఎంఆర్ఐ కూడా చేశామని యశోద వైద్యులు వెల్లడించారు. ‘‘షుగర్, బీపీ పరీక్షలు కూడా చేశాం. కంట్రోల్లో ఉండడానికి సూచనలిచ్చాం. ప్రస్తుతానికి పెద్ద సమస్య ఏం లేదు. వారం పాటు విశ్రాంతి సూచించాం. సర్వికల్ స్పెన్ ఎంఆర్ఐలో కొంత రూట్ నర్వ్ పెయిన్ ఉన్నట్లు గమనించామన్నారు. వారం రోజుల విశ్రాంతితో సీఎం కేసీఆర్ నార్మల్ అవుతారని’’ వైద్యులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ డిశ్చార్జి యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. ఆయన ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్‌కు వైద్యులు సూచించారు. -
యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు యశోదా ఆసుపత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు చేపట్టారు. 20కి పైగా ఐటీ శాఖ బృందాలు.. మూడు బ్రాంచ్‌లకు చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఇళ్లల్లోపాటు(సురేందర్ రావు-సోమాజిగూడ, రవీందర్ రావు-సికింద్రాబాద్, దేవేందర్ రావు-మలక్‌పేట), నాగార్జున హిల్స్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం. వీరి నుంచి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఆదాయపు పన్నుశాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ? -
పునర్జన్మనిచ్చారు
‘అందరి దృష్టిలో ఈ నవంబర్ 14 బాలల దినోత్సవం. కానీ నాకు మాత్రం పునర్జన్మను పొందిన రోజు. ఆస్పత్రికి, వైద్య సిబ్బందికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది’ – నాగ శ్రీకాంత్ సాక్షి, హైదరాబాద్: గుండె పూర్తిగా దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. గుండెమార్పిడి చికిత్సతో మళ్లీ జీవితాన్ని ప్రసాదించారు. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్‌రావు, గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు, కార్డియాలజిస్ట్ పవన్ పోద్దర్ శుక్రవారం ఆస్పత్రిలో మీడియాకు ఈ చికిత్స వివరాలు వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి చికిత్సలకు రూ.20 లక్షలకుపైగా ఖర్చవుతుంది. కానీ ఆరోగ్యశ్రీ పథకం కింద బాధితునికి ఈ చికిత్సను ఉచితంగా చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ శ్రీకాంత్(48) ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. రెండేళ్లుగా హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉంటున్నారు. కొంత కాలంగా ఛాతీలో తీవ్ర అసౌకర్యం, గుండె దడ సమస్యలతో బాధపడుతున్నారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. రక్త ప్రసరణలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయినా ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. దీంతో మలక్‌పేట యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావును ఆశ్రయించారు. పలు వైద్య పరీక్షలు చేసిన తరువాత గుండె ఎడమ జఠరిక సిస్టోలిక్ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించి, గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమని సూచించారు. చికిత్సకు అంగీకరించడంతో గుండె దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఆర్థిక సహకారం కోసం ఆరోగ్యశ్రీలో దరఖాస్తు చేశారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు నవంబర్ 13న ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు అతన్ని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. తలకు బలమైన గాయాలు తగలడం, అప్పటికే అపస్మారకస్థితిలోకి చేరుకోవడం తో వైద్యులు బ్రెయిన్‌డెడ్ డిక్లేర్ చేశారు. అవయ వాలను దానం చేసేందుకు యువకుని తరఫు బంధువులు అంగీకరించడంతో వెంటనే జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అప్పటికే దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకుని చికిత్స కోసం ఎదురు చూస్తున్న శ్రీకాంత్‌తో పాటు ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందజేశారు. రెండు బృందాలుగా ఏర్పడి.. విషయం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రెండు బృందాలుగా విడిపోయారు. దాత నుంచి గుండెను సేకరించేందుకు ఓ బృందం సిద్ధం కాగా, గుండెను తరలించే లోపు స్వీకర్త ఛాతీ తెరచి ఉంచేందుకు మరో బృందం సిద్ధమైంది. నవంబర్ 13న రాత్రి ప్రత్యేక గ్రీన్‌చానల్ ద్వారా ఏడు నిమిషాల్లో సోమాజిగూడ నుంచి మలక్‌పేట ఆస్పత్రికి గుండెను తరలించారు. రాత్రి 3.30 గంటలకు గుండె మార్పిడి చికిత్స ప్రారంభమైంది. సర్జరీ సమయంలో తలెత్తిన అధిక రక్తస్రావం సమస్యను నిరోధించడం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారింది. నవంబర్ 14 ఉదయం 9.30 గంటలకు సర్జరీ ముగిసింది. 24 గంటల పాటు వెంటిలేటర్‌పై ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ తర్వాత వెంటిలేటర్ తొలగించి... రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉంచారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ జీఎస్‌రావు ప్రకటించారు. -
గుండెను మార్చి.. పునర్జన్మను ప్రసాదించి..
47 ఏళ్ల బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి గుండె సేకరణ 24 ఏళ్ల మాతృమూర్తికి విజయవంతంగా మార్పిడి కాకినాడకు చెందిన మహిళకు ‘యశోద’లో చికిత్స హైదరాబాద్: తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు యశోద ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 47 ఏళ్ల బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్‌రావు, గుండె మార్పిడి నిపుణులు డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్, జీవన్‌దాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలతలు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన అరుణ (24)తన భర్త గోపాలకృష్ణ, కుమారుడు కార్తిక్‌తో కలసి పుణేలో స్థిరపడింది. ఏడాది క్రితం కుటుంబంతో కలిసి పుట్టింటికి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురైంది. స్థానిక వైద్యులకు చూపించగా బ్రెయిన్లో క్లాట్ అయింది. మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. ‘కార్డియోమయోపతి’గా గుర్తింపు తొమ్మిది నెలల తర్వాత అరుణ మార్చి 20న మళ్లీ అనారోగ్యానికి గురైంది. పుణేలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా పది రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. పలు పరీక్షలు చేసి ‘డలేటెట్ కార్డియోమయోపతి’అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీలైన ంత త్వరలో గుండె మార్పిడి చేయించుకోవాలన్నారు. ఏప్రిల్ 20న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి చెందిన సీనియర్ కార్డి యో థొరాసిక్ సర్జన్ డాక్టర్ నరే శ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్లను సంప్రదించగా.. గుండె దానం కోసం జీవ న్దాన్లో ఆమె పేరు నమోదు చేయించారు. 47 ఏళ్ల వ్యక్తి నుంచి గుండెను సేకరించి.. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలాజీ (47) బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథ్ విజ్ఞప్తి మేరకు ఆయన అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అప్పటికే ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అరుణకు గుండె మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జూన్ 15న డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్, డాక్టర్ రాజశేఖర్ల నేతృత్వంలోని వైద్య బృందం దాత నుంచి గుండెను సేకరించారు. సోమాజిగూడ నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. సుమారు 20 మందితో కూడిన వైద్య బృందం తొమ్మిది గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండెను అమర్చారు. అనంతరం ఆమె కోలుకోవడంతో జూన్ 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్లు స్పష్టం చేశారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ఎవరో ఒకరికి ప్రసవానికి ముందు కానీ, తర్వాత కానీ ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తుంటాయని, అయితే కొంతమందిలో దానంతట అదే నయమవుతుందన్నారు. ఇతర ఆస్పత్రులతో ఎంవోయూ రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు యశోద ఆస్పత్రి వైద్యులు బెంగళూరు, మధ్యప్రదేశ్, కోల్‌కతా, ఏపీలోని పలు ఆస్పత్రులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ జీఎస్‌రావు చెప్పారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేయవచ్చన్నారు. జీవన్‌దాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ ఇప్పటి వరకు 233 కాలేయ, 400కి పైగా మూత్రపిండాలు, 26 గుండె, 5 ఊపిరితిత్తులు, ఐదు పాంక్రియాస్‌లను సేకరించి ఆయా జబ్బులతో బాధపడుతున్న వారికి పునర్జన్మను ప్రసాదించినట్లు తెలిపారు. -
ఎన్ఎఫ్సీలో స్లాబ్ కూలి ఇద్దరి దుర్మరణం
♦ 11 మందికి గాయాలు ♦ భర్త శవం చూడటానికి అనుమతించని భద్రతా సిబ్బంది ♦ కార్మిక సంఘాల ఆందోళన హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ)లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎన్ఎఫ్సీలో మూడు నెలలుగా జరుగుతున్న భవన నిర్మాణంలో భాగంగా కూలీలు సోమవారం స్లాబ్ వేస్తున్నారు. ప్రమాదవశాత్తు సెంట్రింగ్ కుంగిపోవడంతో స్లాబ్ కూలిపోయింది. 10 మీటర్ల ఎత్తున ఉన్న స్లాబ్‌పైన పనిలో నిమగ్నమైన కూలీలు కింద పడిపోయారు. ఈ ఘటనలో అల్వాల నర్సింహగౌడ్(35), సాండ్రిక్(32) అనే ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా రాందాసు, భీంసేన్, నర్సింహులు, రసూల్, రాములు, శ్యామూల్, యాదగిరిరెడ్డి, బాలయ్య, భసంత్కుమార్, అన్సారీ, సతీష్ అనేక కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు దాదాపుగా 44 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను జేసీబీ సహాయంతో వెలికితీసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నర్సింహగౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా, బూత్పూర్ మండలం, పోతలమడుగు గ్రామానికి చెందినవాడు. బతుకుదెరువు కోసం చాలా కాలం క్రితమే నగరానికి వచ్చి మేస్త్రీ పనిచేసుకుంటూ అశోక్‌నగర్ కేబుల్ చౌరస్తా సమీపంలో భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలసి ఉంటున్నాడు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన మరో మృతుడు సాండ్రిక్ దమ్మాయిగూడలో నివాసం ఉంటూ మేస్త్రీ పనిచేస్తున్నాడు. క్షతగాత్రుల్లో అధికులు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారేనని పోలీసులు పేర్కొన్నారు. పడిగాపులు కాసిన కుటుంబ సభ్యులు.. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కూలీల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున ఎన్ఎఫ్సీ వద్దకు చేరుకున్నారు. తమవారిని చూసుకోవడానికి వచ్చిన వారిని భద్రతా సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో గంటల తరబడి బయట పడిగాపులు కాసారు. నాలుగు గంటల తరువాత మృతుడు నర్సింహ్మగౌడ్ భార్య విజయలక్ష్మిని లోనికి అనుమతించారు. కంపెనీ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాల నాయకులు కంపెనీ వద్ద ఆందోళనకు దిగాయి. కొంత మందికి చిన్న, చిన్న గాయాలయ్యాయని, వారికి చికిత్స అందించి పంపిస్తామని యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మిగతావారి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.