‘సరోజిని’ బాధితులను ఆదుకుంటాం | Minister Lakshma Reddy comments on Sarojinidevi eye hospital | Sakshi
Sakshi News home page

‘సరోజిని’ బాధితులను ఆదుకుంటాం

Published Wed, Dec 28 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

‘సరోజిని’ బాధితులను ఆదుకుంటాం

‘సరోజిని’ బాధితులను ఆదుకుంటాం

సాక్షి, హైదరాబాద్‌: సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్‌ కోసం వెళ్లి పాక్షికంగా చూపు కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. వారికి అన్ని రకాలుగా చికిత్స అందిస్తున్నామని, ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు.

ఈ అంశంపై కాంగ్రెస్‌ సభ్యులు చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. ఆపరేషన్‌కు వినియోగించిన కలుషిత రింగర్‌ లాక్టేట్‌ ద్రావకం వల్ల ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని, అందుకే 8 మంది పాక్షికంగా కంటిచూపు కోల్పోయారని తెలిపారు. ఇందుకు కారణమైన నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని మంత్రి తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement