మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రికి మెరుగైన పరికరాల కోసం రూ.16కోట్లు విడుదల చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. అనంతరం ఆయన జడ్చర్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.