
లెస్ టెండర్లతో గోదాముల నిర్మాణంలో రూ.150కోట్ల ఆదా
మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆహారధాన్యాల నిల్వకోసం 330 ప్రాంతాల్లో గోదా ములను మంజూరు చేశామని, ఇందులో 321 ప్రాంతాల్లో గోదాముల నిర్మాణ పనులను ప్రారంభించామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రూ.1024.50 కోట్ల నాబార్డు రుణంతో మొత్తంగా 17.07లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వీటిని చేపట్టామని వెల్లడించారు. గోదాములకోసం ఖర్చు చేస్తున్న ప్రతీ పైసాకు ఆన్‌లైన్ టెండర్‌లు పిలిచామని, అత్యంత పారదర్శకంగా ఈ జరిగిన టెండర్ల కారణంగా 11.5 లెస్‌తో మొత్తంగా రూ.150 కోట్ల మేర ఆదా అయిందని తెలిపారు. సోమవారం సభ్యులు మర్రి జనార్దన్‌రెడ్డి, బాజిరెడ్డి, కోమటిరెడ్డి, రేవంత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
నిమ్స్‌లో అవినీతిపై చర్యలు: మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్స్‌లో అవినీతి జరగలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, రామ్మోమన్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కోర్టు తదుపరి ఉత్తర్వులను అనుసరించి వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా,అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.