- పీహెచ్‌సీలను కార్పొరేట్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతాం
- విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులపై చర్యలు
- మెదక్ ఏరియా అస్పత్రిని 200 పడకలుగా మారుస్తాం
- డిప్యూటీ సీఎం రాజయ్య
మెదక్: ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌లకు దీటుగా తీర్చి దిద్దుతామని డిప్యూటీ సీఎం రాజయ్య పేర్కొన్నారు. శనివారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు రూ.113 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సిఫారసుల మేరకు కావల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాళోజీ మెడికల్ పీజీ యూనివర్సిటీ తెలంగాణకు ఒక వరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారన్న విషయాన్ని గ్రామీణులు తెలుసుకోవాలన్నారు.
అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష ్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇటీవలే 1,273 వైద్యుల పోస్టులకు నోటిఫికేషన్ జారీచేశామన్నారు. దంత వైద్యులు, పారామెడికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రులలో మెస్ చార్జీలు, శానిటేషన్ చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రతి పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా, నియోజకవర్గ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు.
మెదక్ ఏరియా ఆస్పత్రిని 200 పడకల స్థాయికి పెంచుతామన్నారు. దీంతోపాటు బ్లడ్‌బ్యాంకును ఏర్పాటుచేసి, అవసరమైన పోస్టులను మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యుల బృందం సమస్యలపై డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించారు. 104 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నుస్రత్, సంతోష్‌ప్రసాద్‌లు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వైద్యులు, కౌన్సిలర్లు డిప్యూటీ సీఎం రాజయ్యను సన్మానించారు.
వైద్య సౌకర్యాల కోసం రూ.113 కోట్లు
Published Sun, Sep 28 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement