నీళ్లు, నిధులపై దృష్టి
తెలంగాణ సర్కారు నీళ్లు, నిధులు, నియూమకాలపై ప్రధానంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. ఆదివారం హన్మకొండలోని హరిత హోటల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎమ్మెల్సీ ఎన్నికను సవాల్‌గా తీసుకోవాలని అన్నారు.
నయీంనగర్ : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీర ని నష్టం జరిగిందని.. ఆ లోటు భర్తీ చేయడం పై టీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తెలి పారు. హన్మకొండ హరిత హోటల్‌లో టీఆర్‌ఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివా రం జరిగింది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, అభివృద్ధి విషయం లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్‌కే ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. దీనిలో భాగంగానే రాష్టంలో ఏ జిల్లాకు కేటాయించని విధంగా జిల్లాకు సీఎం నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. అలాగే, ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో తొలి సారిగా ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నా మని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభు త్వాలు 29 లక్షల పింఛన్లు మాత్రమే ఇవ్వగా.. ప్రస్తుతం అర్హులైన వారందరికీ, గతంలో కంటే ఎక్కువ మందికి పింఛన్లు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
పద్నాలుగేళ్ల తర్వాత రోడ్ల అభివృద్ధి
శిథిలావస్థకు చేరిన పీఆర్ రోడ్ల అభివృద్ధికి 14ఏళ్ల తర్వాత నిధులు కేటాయించడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పని చేయాలని కోరారు. కాగా, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానాన్ని సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, పట్టభద్రుల స్థానానికి జరగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి ఐక్యంగా కృషి చేయాలని సూచిం చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఆవిర్భా వం నుంచి పనిచేస్తున్న మర్రి యాదవరెడ్డికి గతంలో అన్యాయం జరిగిందని.. ఈసారి ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు కొండా సురేఖ, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకం గా తీసుకోవాలన్నారు.
పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సం క్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రా వు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయిం చాలని శ్రేణులను కోరారు. కాగా, ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి డిప్యూటీ సీఎం గులాబీ కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ప్రవేశపెట్టడంపై పలువురు డిప్యూటీ సీఎంను సన్మానించారు. సమావేశంలో నాయకులు గుడిమల్ల రవికుమార్, ముద్దసాని సహోదర్‌రెడ్డి, బూజు గుండ్ల రాజేంద్రకుమార్, మర్రి యాదవరెడ్డి, దోనెపూడి రమేష్‌బాబు, ఇండ్ల నాగేశ్వర్‌రావు, మొలుగూరి బిక్షపతి, కవిత, వరదారెడ్డి, వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.