తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు, రైతులకు ప్రసాదంగా శ్రీగంధం (ఎర్రచందనం) మొక్కలు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. బుధవారం ఆయన తిరుమలలోని శ్రీగంధం వనాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శేషాచలంలో 7,500 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉందని, అందులో 250 ఎకరాల్లో శ్రీగంధం, మరో 250 ఎకరాల్లో ఎర్రచందనం పెంచుతామన్నారు. ఇప్పటికే 10 లక్షల ఎర్రచందనం మొక్కల పెంచామని, వచ్చే ఏడాదికి మొత్తం 25 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచనున్నట్లు వెల్లడించారు.