బీజేపీ ఖైదీగా శ్రీరాముడు | CPI Secretary Koonanne comment in Meet the Press | Sakshi
Sakshi News home page

బీజేపీ ఖైదీగా శ్రీరాముడు

Published Wed, May 8 2024 5:42 AM | Last Updated on Wed, May 8 2024 5:42 AM

CPI Secretary Koonanne comment in Meet the Press

మీట్‌ ది ప్రెస్‌లో సీపీఐ కార్యదర్శి కూనంనేని వ్యాఖ్య 

పేద హిందువులకు మోదీ ఏం చేశారని ప్రశ్న 

దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మోదీ అని విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: శ్రీ రాముడు బీజేపీ ఖైదీగా ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరు విముక్తి చేస్తారా అని ఆ రాముడు ఎదు రుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ (టీయూడబ్య్లూజే) మంగళవారం  కూనంనేని సాంబశివరావుతో మీట్‌ ది ప్రెస్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీయూ డబ్య్లూజే  ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ అధ్యక్షత వహించగా, సీనియర్‌ జర్నలిస్టు మల్లయ్య మోడరేటర్‌గా వ్యవహరించారు.

కూనంనేని మాట్లా డుతూ పేద హిందువులకు మోదీ ఏం చేశారని నిలదీశారు. మతం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేస్తు న్నారని, రాజ్యాంగాన్ని మార్చబోనని చెబుతున్న బీజేపీ, ముస్లిం రిజర్వేషన్లను ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిని ముందు జైలులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. నీతిమంతుల పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చుపెడుతు న్న డబ్బులు ఎక్కడి నుంచి వ స్తున్నాయని ప్రశ్నించారు. ప్రధా ని మోదీ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, అధి కారం కోసం ఆయన ఏమైనా చేస్తా రని కూనంనేని విమర్శించారు. 

ఇక దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ  బీజేపీయేనని, అందుకే ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధిక స్థానాల్లో గెలుస్తుందని, బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని ఆయన అంచనా వేశారు. కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని, ఉద్య మకారుల గొంతు నొక్కారని, ఢిల్లీలో మోదీ కూడా అలాగే వ్యవహారిస్తున్నారని విమర్శించారు.

మా మద్దతు లేకుండా కాంగ్రెస్‌ గెలవదు...
లోక్‌ సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్‌  నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్‌ గెలిచే పరిస్థితి లేదని కూనంనేని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలు తమకిస్తేనే పొత్తు ఉంటుందని, లేదంటే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement