ఏపీ కొత్త డీజీపీగా మాలకొండయ్య! | ap new dgp malakondaiah | Sakshi
Sakshi News home page

ఏపీ కొత్త డీజీపీగా మాలకొండయ్య!

Published Wed, Dec 27 2017 9:50 AM | Last Updated on Sat, Aug 18 2018 6:24 PM

ap new dgp malakondaiah

అమారావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ఎం.మాలకొండయ్య నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈయన నియామకంపై గురువారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం కల్పిస్తూ ఏపీ పోలీస్‌ యాక్టును సవరిస్తూ మంగళవారం ఆర్డినెన్స్‌‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ​ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement