Andhra Pradesh DGP
-
తప్పు చేసిన పోలీసులను సప్తసముద్రాల అవతల ఉన్నా వదలం: వైఎస్ జగన్ వార్నింగ్
గుంటూరు, సాక్షి: సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. నిబంధనలు పాటించకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వాళ్లు ఒకసారి తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీపై, కూటమి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న పోలీస్ అధికారులకు హితబోధ చేశారు.‘‘పోలీసులు సెల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు. ఇల్లీగల్‌గా అరెస్టులు చేయడమేంటి?. రాజకీయ నాయకులు చెప్తున్నారని.. తప్పు చేస్తూ పోతే బాధితుల ఉసురు తగులుతుంది. పోలీసులు ఇప్పటికైనా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మీరు చేసే పనుల వల్ల పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటోంది.పోలీస్ అధికారిలా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా డీజీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వన్‌సైడెడ్‌గా ఉండకండి. వ్యవస్థపై గౌరవంతో ఉండండి. మేం చూస్తూ ఊరుకోం. తప్పు చేసే పోలీసుల మీద ఫిర్యాదు (ప్రైవేట్ కంప్లయింట్) చేస్తాం. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుకు న్యాయసహాయం అందిస్తుంది. జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో... ట్రాన్స్ఫర్ అయినవాళ్లనే కాదు.. రిటైర్ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం. చూస్తూ ఊరుకోం. చట్టం ముందు దోషులుగా నిలబెతాం. రెడ్ బుక్ ఇప్పుడు ఉన్నవాళ్లే కాదు. బాధితులు కూడా రెడ్‌బుక్‌లు పెట్టుకుంటారు. వాటి ఆధారంగా అలాంటి పోలీసులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాం అని జగన్ హెచ్చరించారు. -
తిరుమల ఏఎస్పీ ముని రామయ్యపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల శాంతిభద్రతల విభాగం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (ఏఎస్పీ) ఉన్న ఎం.మునిరామయ్యపై వేటు పడింది. ఆయన్న బదిలీ చేస్తూ, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముని రామయ్య హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) నమోదైన చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన వ్యవహారంలో ముని రామయ్య పాత్రపై ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సవాంగ్ ఆయనపై బదిలీ వేటు వేశారు. మరోపక్క సీసీఎస్ పోలీసులు సైతం దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యాపారి చుండూరు సునీల్‌కుమార్‌ను డబ్బు కాజేయడానికి రంగంలోకి దింపిన నకిలీ డీఎస్పీ కేపీ రాజు కోసం గాలింపు ముమ్మరం చేశారు . చదవండి: చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. ఆరా తీయగా అసలు విషయం తెలిసి... -
పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..
పోలీసు కుటుంబంలో జన్మించారు సుప్రజ. విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎదుర్కొన్న కష్టాలను చూసి కూడా భయపడలేదు. ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్–1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్ అవార్డు విజేత అయ్యారు. కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ► మీ విధి నిర్వహణలోని సవాళ్లు, ఒత్తిళ్లు ఎలాంటివి? రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకు బడితో అధికారులు, నాయకులు నాపై వత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్‌మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక వత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ► ట్రైనింగ్ సమయంలోని ఫిజికల్ ట్రైనింగ్ విధి నిర్వహణలో ఉపయోగపడిందంటారా? అవును. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్ డంప్‌లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది. ► మహిళగా మహిళలకు జరిగే అన్యాయాలపై మీ స్పందన ఎలా ఉంటుంది? జాప్యం అయితే జరగదు. నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్ చేస్తాను). వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్ చే యడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి. ► లాక్డౌన్ సమయంలో గర్భిణి అయి ఉండీ మీరు విధులు నిర్వహించిన విషయాన్ని డిపార్ట్మెంట్లో గొప్పగా చెబుతుంటారు! (నవ్వుతూ..) ఆ సమయంలో గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులు, అనాథల షెల్టర్ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్ఎస్ ప్రేమ్‌కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం. డీజీపి గౌతమ్ సవాంగ్ నుండి పిసిఆర్ అవార్డు అందుకుంటున్న డిఎస్పీ సుప్రజ తల్లి , తండ్రి, భర్తతో సుప్రజ – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
సేఫ్టీ టన్నెల్ నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, గుంటూరు: మహమ్మారి కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పలు చోట్ల ఎస్3 వీ సేఫ్టీ టన్నెళ్లను ప్రవేశ పెట్టింది. తాజాగా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టి సారించారు. సూక్ష్మ క్రిములను నివారించే ఎస్3వీ సేఫ్ టన్నెల్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి. ఈ టన్నెల్లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్‌ను అభివృద్ధి చేసిన కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇకపై డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్ నుంచే రావాల్సి ఉంటుంది. (చదవండి: కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్) (చదవండి: ‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’) -
ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించి.. "0" (జీరో) ఎఫ్ఐఆర్ అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, ముంబై తరహాలో రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలు చేయాలని సూచించారు. జీరో ఎఫ్ఐఆర్ అమల్లో ఉంటే.. పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్ఐఆర్లో అవకాశముండదు. జీరో ఎఫ్ఐఆర్ పేరిట బాధితులు ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేస్తే.. దానిని స్వీకరించి.. విచారణ జరిపి.. సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. అంతకుముందు మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ను ప్రారంభోత్సవంలోనే డీజీపీ గౌతం సవాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నామని, జీరో ఎఫ్ఐఆర్ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని ఆయన వెల్లడించారు. చదవండి: జీరో ఎఫైఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలి ‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు! పరిధి పరేషాన్ -
పోలీసులు ప్రజా సేవ కోసమే
-
ఏపీ డీజీపీ అత్యవసర సమావేశం
సాక్షి, విజయవాడ : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా సీపీ, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి భద్రతకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఇస్లామిక్, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతను పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయాలని.. వాహనాలు, హోటళ్లలో తనిఖీలు పెంచాలని సూచించారు. శ్రీలంకలో ఉగ్రదాడుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ఎక్కడైనా భద్రతా లోపాలుంటే నెల రోజుల్లో సరిచేయాలని.. నెల రోజుల తర్వాత మళ్లీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు ఎన్నికల కౌటింగ్ పై కూడా జిల్లా ఎస్పీలతో డీజీపీ మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత.. కౌంటింగ్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. -
ఏపీ డీజీపీని బదిలీ చేయండి!
-
టీడీపీ పక్షపాతి.. ఏపీ డీజీపీని బదిలీ చేయండి!
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోని రాష్ట్రంలోని పోలీసు విభాగాన్ని చంద్రబాబునాయుడు సర్కారు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తుండటం.. టీడీపీకి అనుకూలంగా పోలీసు బాస్ ఆర్పీ ఠాకూర్ సహా బదిలీ అయిన ఇంటెలిజెన్స్ డీజీ, ఇతర ఉన్నతాధికారులు కొమ్ముకాస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేందుకే కేంద్ర ఎన్నికల సంఘం సత్వరమే చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం టీడీపీకి కొమ్ముకాస్తూ.. అత్యంత పక్షపాతపూరితంగా, అసమర్థంగా వ్యవహరిస్తున్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేయాలని, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తూ.. వైఎస్సార్సీపీ సహా ఇతర ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవ్‌రావులను ఇంటెలిజెన్స్ విభాగం ఓఎస్డీలుగా తొలగించాలని, అదేవిధంగా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ కార్యాలయం సమన్వయ అధికారిగా పనిచేస్తున్న డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించి.. వేరేచోటకు పంపాలని వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్రావును గతంలోనే బదిలీ చేసినప్పటికీ.. ఆయన ఇప్పటికీ పోలీసు విభాగంలో జోక్యం చేసుకుంటూ.. డీజీపీ ఠాకూర్ మద్దతుతో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను టీడీపీకి అనుకూలంగా వాడుకుంటూ.. ఆ నివేదికలను రహస్యంగా సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఏబీ వెంకటేశ్వర్రావు పోలీసు వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా వెంటనే నిలువరించాలని, కుట్రపూరిత వ్యవహారాలు చేపట్టకుండా.. సెక్రటేరియట్లో రిపోర్ట్ చేయాలని ఆయనను ఆదేశించాలని ఈసీని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ కులానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్‌లు టీ యోగానంద్, మాధవరావులను రాజకీయ కార్యకలాపాల కోసమే గతంలో వెంకటేశ్వర్రావు ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించారని, టీడీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన వారు.. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి.. వేధిస్తున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు జరగవేమోనన్న నిస్సహాయ పరిస్థితి తమకు కలుగుతోందని అన్నారు. ఇక, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్‌ను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీఐజీ కో ఆర్డినేషన్, లా అండ్ ఆర్డర్‌గా నియమించారని, గతంలో రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు ఎస్పీగా, కర్నూల్ రేంజ్ డీఐజీగా, అనంతపురం రేంజ్ ఇన్చార్జ్గా పనిచేసిన ఆయన టీడీపీ అనుకూల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లను ఆ ప్రాంతంలో నియమించారని, పోలీసు వ్యవస్థను టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా మలిచినందుకే ఆయనకు ముఖ్యమంత్రి ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు ఆయన పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను బదిలీ చేయాలని, ఇంటెలిజెన్స్ ఓస్డీలుగా ఉన్న ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు టీ యోగానంద్, మాధవరావులను ఆ పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థనలు, ఎమర్జెన్సీ ఫిర్యాదులు స్వీకరించి.. సత్వర్వమే తగిన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి కార్యాలయంలో, డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలోనూ ఎన్నికల అధికారులు, (కలెక్టర్లు), ఎస్పీల సంయుక్త నేృతృత్వంలో ఇదేవిధంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్‌కు మిగిలిన ఉన్న రెండురోజులు.. పోలింగ్ తేదీ నాడు ఎలక్షన్ కంట్రోల్ రూమ్, పోలీసు వ్యవస్థను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నియమించాలని కోరారు. -
డేటా చోరీ కేసుపై స్పందించిన ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం స్పందించారు. ఈ కేసులో తెలంగాణ పోలీసుల నుంచి తమకెలాంటి సమాచారం లేదని, ఇప్పటివరకు తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఏపీకి చెందిన మూడున్నర కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను అపహరించినట్లు తాజాగా వెలుగులోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద రహస్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందించడం గమనార్హం. టీడీపీ యాప్‌లోకి ఓటర్ల మాస్టర్ డేటా.. ఓటర్ల మాస్టర్ డేటా ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉండదు. కేవలం ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు మాత్రమే ఉంటాయి. ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను బయటకు వెల్లడించరు. అలాంటిది ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటా టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరిపోవడంపై నివ్వెరపోతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో ఈసీ అందుబాటులో ఉంచుతుంది. కలర్ ఫొటోలతో కూడిన మాస్టర్ డేటాను ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టదు. గతంలో ఓటర్ల జాబితాకు 90 శాతం మేర ఆధార్‌ను అనుసంధానం చేశారు. ఆ తరువాత సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ అనుసంధానాన్ని నిలుపుదల చేయడంతో ఎన్నికల సంఘం వెబ్సైట్లో కూడా ఆధార్ వివరాలు అందుబాటులో ఉండవు. కేవలం మాస్టర్ డేటాలోనే ఆధార్ వివరాలు ఉంటాయి. ఇప్పుడు టీడీపీ సేవా మిత్ర యాప్‌లో ఆధార్ వివరాలతో కూడిన ఓటర్ల జాబితా ఉండటాన్ని బట్టి ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను కచ్చితంగా చోరీ చేసినట్లేనని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. చదవండి: డేటా చోర్.. బాబు సర్కార్ -
ఏపీ డీజీపీకి ఈసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు జగిత్యాల జిల్లా ధర్మవురిలో సర్వే చేస్తూ ఆరుగురు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కానిస్టేబుళ్లు పట్టుబడిన ఉదంతంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఏపీ, తెలంగాణ డీజీపీలకు నోటీసులు జారీ చేశారు. ఏపీ డీజీపీ నుంచి సమాధానం వచ్చాక దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ పదేళ్లపాటు ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని కావడంతో ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది పని చేయడంలో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ల వినియోగంపై విపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మహిళా శక్తికి ప్రతీక అయిన గులాబీ రంగులో మహిళలకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలనేది ఎన్నికల సంఘం ఆలోచన అని, ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో టీఆర్ఎస్ జెండా రంగు సైతం గులాబీ అన్న విషయం వారి దృష్టికి రాలేదన్నారు. సాధారణంగా బ్యాలెట్ పేపర్లు గులాబీ రంగులోనే ఉంటాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న గుర్తింపు పొందని 22 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులు కేటాయించిందన్నారు. నవంబర్ 9 వరకు ఓటర్ల నమోదు! ఓటర్ల తుది జాబితా ప్రచురించిన అనంతర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదుకు దాదాపు 3 లక్షల దరఖాస్తులొచ్చాయని రజత్ కుమార్ వెల్లడించారు. ఓటర్ల నమోదుకు నవంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అదే నెల 19 వరకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదు తెలుసుకోవడానికి ప్రజలంతా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 970 మంది మహిళా ఓటర్లు ఉండేవారని, ఇటీవల ప్రచురించిన తుది జాబితా అనంతరం ఈ నిష్పత్తి 1000:981కు పెరిగిందన్నారు. 18, 19 ఏళ్ల వయసుగల యువతతోపాటు మహిళా ఓటర్ల నమోదు పుంజుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని 16 అసెంబ్లీ స్థానల్లో ఓటర్ల జాబితాలను ఉర్దూలో, జుక్కల్, ముథోల్ అసెంబ్లీల జాబితాలను మరాఠీ భాషలో ప్రచురించే కార్యక్రమం పూర్తయిందని, ఆసక్తిగల వారు స్థానిక అధికారుల నుంచి ఈ జాబితాలను పొందవచ్చని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ రోజున వికలాంగులకు కల్పించనున్న సదుపాయాలను పరిశీలించేందుకు నవంబర్ 24 నుంచి 26 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు రాష్ట్రానికి రానున్నారన్నారు. 307 కంపెనీల కేంద్ర బలగాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున మద్యం, డబ్బుల పంపిణీ జరుగుతోందని అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులొచ్చాయని రజత్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రూ. 31.14 కోట్ల నగదును, 65,364 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పోలీసు సిబ్బంది సరిపోతారని, పోలింగ్ నిర్వహణ కోసం 307 కంపెనీల కేంద్ర బలగాలను కోరామన్నారు. కేంద్ర బలగాల సంఖ్యపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. లైసెన్స్‌లేని 6 ఆయుధాలు, లైసెన్స్‌గల 7,411 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, 8,622 ముందుజాగ్రత్త కేసులు నమోదు చేశామని, 43,101 మంది పాత నిందితులను బైండోవర్ చేశామని, 3,765 కేసుల్లో వారెంట్లు జారీ చేశామని ఆయన చెప్పారు. వివరణ అందాక కోడ్ ఉల్లంఘనలపై చర్యలు... ప్రగతి భవన్, మినిస్టర్ల క్వార్టర్లలో టీఆర్ఎస్ కార్యకలాపాల నిర్వహణ విషయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరామని, వివరణ అందాక నిర్ణయం తీసుకుంటామని రజత్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోడ్ ఉల్లంఘన పరిధిలోకే వస్తుందన్నారు. ప్రతిపక్షాల ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలపై డీజీపీ వివరణ కోరామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 59 ఫిర్యాదులు రాగా అందులో 11 ఫిర్యాదులను పరిష్కరించామని, 48 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
‘పోలీసులైనా, ప్రజలైనా చర్యలు తప్పవు’
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. అదే సమయంలో చింతలపూడి వసతి గృహం బాలిక అత్యాచారం కేసులో కూడా విచారణ చేపడతామన్నారు. ఈ కేసుల్లో పోలీసుల తప్పు ఉందని తేలితే ఎలాంటివారినైనా ఉపేక్షించమని ఠాకూర్ తెలిపారు. అసలు పోలీసులు పని చేసేది ప్రజల కోసమేనని, రౌడీయిజం, రోడ్డు ప్రమాదాలు, నేర నిరోధకంపై జిల్లా యంత్రాంగానికి సూచనలిచ్చామన్నారు. శుక్రవారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీజీపీ.. పశ్చిమలో జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ పనితీరు బాగానే ఉందని కితాబిచ్చారు. నూతన టెక్నాలజీతో మరింత వేగంగా ప్రజలకు సేవలందించాలని ఆయన సూచించారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్, ఫోరెన్సిక్ యూనివర్శిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్న డీజీపీ.. పెరుగుతున్న సైబర్ క్రైమ్‌లు నిరోధించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బంది సంతృప్తిగా ఉంటేనే పోలీసు శాఖలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లా రావూరుపాడు పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటన చాలా విచారకరమన్న డీజీపీ ఠాకూర్.. తప్పు ఎవరిదైనా లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని, అది ప్రజలైనా, పోలీసులైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
‘కేసుల పరిష్కారంతో వెయ్యికోట్ల ఆదాయం’
సాక్షి, అమరావతి: ఏసీబీలో నమోదైన కేసులన్నీ పరిష్కరించగల్గితే ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ అన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏసీబీ అర్ధవార్షిక సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్పషల్ కోర్టు యాక్ట్ అందుబాటులోకి తెచ్చామనీ, 2016 అనంతరం నమోదైన కేసులు దీని పరిగణలోకి వస్తాయని వెల్లడించారు. అవినీతిని నిర్మూలించేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సిబ్బంది నియామకానికి కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టనున్నామని అన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ నిందితులు తప్పించుకోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని ఏసీబీ కార్యాలయాలను చక్కటి వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని వెల్లడించారు. -
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపవద్దు..!
సాక్షి, అమరావతి : తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపేసిన పోలీసులపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి తాను ఎక్కడికి వెళ్లినా.. తనకోసం ట్రాఫిక్ నిలిపేసి.. వాహనదారులను ఇబ్బందిపెట్టకూడదని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు డీజీపీ కాన్వాయ్ వస్తున్న సమయంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి విజయవాడ తిరిగి వెళుతున్న సమయంలో తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపేసిన విషయాన్ని డీజీపీ గమనించారు. దీంతో ఇకపై తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిమిషం కూడా ఆపవద్దని డీజీపీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీచేశారు. వీఐపీలు ప్రయాణిస్తున్న వేళ కూడా సాధ్యమైనంత తక్కువగా ట్రాఫిక్ ను ఆపాలని ఆయన సూచించారు. -
ఏపీ డీజీపీ నియామకంలో లోకేష్ హస్తం!
-
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా రామ్ ప్రవేశ్ ఠాకూర్
-
రాష్ట్రం చాలా మారింది : మాలకొండయ్య
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎం.మాలకొండయ్య పదవీ విరమణ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం మంగళగిరి బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వబెటాలియన్ పోలీసుల నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. శాంతి భద్రతల విషయంలో అందరూ బాగా పనిచేశారని కితాబిచ్చారు. ఏపీకి నూతనంగా 6వేల మంది పోలీసు సిబ్బంది వచ్చారని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా నెరవేర్చామని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్, క్రైం ఎక్కువగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని, క్రైం రేటు కూడా తగ్గిందని పేర్కొన్నారు. అనంతరం విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. డీజీపీగా మాలకొండయ్య మంచి సేవలు అందించారని చెప్పారు. ఆయన నాయకత్వంలో అందరూ బాగా పనిచేశారని అన్నారు. నూతన రాష్ట్రంలో శాంతి భద్రతలను మాలకొండయ్య ఆధ్వర్యంలో చక్కగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ఆయన పదవీ విరమణ చేసినా వారి మనస్సులో ఉంటారని అన్నారు. మాలకొండయ్య 1985బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీ నేడు ఆదేశాలు
-
ఏపీ డీజీపీ రేసులో ఆ ఐదుగురు..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపికపై సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ ఐదుమంది అధికారుల పేర్లను డీజీపీ పోస్టు కోసం ఎంపిక చేసింది. ఈ జాబితాలో గౌతమ్ సవాంగ్, ఠాకూర్, కౌముది, అనురాధ, సురేంద్రబాబుల పేర్లు ఉన్నాయి. అంతేకాక అధికారుల ట్రాక్ రికార్డు, సర్వీస్ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, అవినీతి నిరోధక శాఖ డీజీ ఠాకూర్ల మధ్య డీజీపీ పదవి కోసం పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సవాంగ్, ఠాకూర్లలో ఒకరికి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ అధికారుల మధ్య విపరీత పోటీ నెలకున్న విషయం తెలిసిందే. ఇన్చార్జ్ చీఫ్ సెక్రటరీ ఏసీ పునేఠా నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, సాంబశివరావులతో పాటు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌లు సెర్చ్ కమిటీలో ఉన్నారు. ఈ నెల(జూన్) 30న ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. -
ఏపీ డీజీపీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడ్డుతున్నారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలిమేలును అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను డీఎస్పీ మాధవరెడ్డి మీడియా ముందు హాజరుపర్చారు. అయితే తన తల్లిని మీడియా ముందుకు తీసుకురావడం సరికాదంటూ అలిమేలు కుమారుడు కావటి సాగర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుల్ని, అనుమానితుల్ని మీడియా ముందు చూపించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధనలుంటే ఏ నిబంధన అనుగుణంగా ఉందో చెప్పాలని తెలిపింది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేయాలని పోలీస్‌శాఖను ఆదేశిస్తూ.. కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. -
శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: డీజీపీ
సాక్షి, కడప : కడప జిల్లాలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య తెలిపారు. జిల్లాలో మంగళవారం డీజీపీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయని.. నేరాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. రెండు మూడు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు త్వరలో షీటీమ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయేది ఎన్నికల సమయం కనుక ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్ ఓటీపీల కారణంగా సైబర్ నేరాలు అధికం అవుతున్నాయని. బ్యాంక్‌ల ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచితులకు తెలపొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పార్థిగ్యాంగ్ ఆనవాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చారని, కానీ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అమాయకులపై పార్థిగ్యాంగ్ అంటూ ప్రజలు దాడులు చేయడం సరికాదన్నారు. ఎర్రచందనం డాన్ సాహుల్ భాయ్‌ను త్వరలోనే రాష్ట్రానికి తీసుకుని వస్తామన్నారు. -
‘ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి’
సాక్షి, విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాళ్ల దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. శనివారం డీజీపీకి కలిసిన నేతలు..తిరుపతిలో పరిస్థితులను అదుపుచేయని ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై టీడీపీ భౌతిక దాడులు చేస్తోందని ఆరోపించారు. తమ కార్యకర్తలను రక్షించండి అని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. మీడియాకు చెప్పి మరీ టీడీపీ సభ్యులు అమిత్ షాపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మోదీ దిష్టిబొమ్మలు దగ్థం చేసినా కేసులు పెట్టడంలేదని వాపోయారు. తిరుపతి ఘటనపై డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ.. అమిత్ షా మీద రాళ్ల దాడి జరిగిందని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. కానీ అక్కడ రాళ్ల దాడి జరుగలేదని, కాన్వాయ్‌లో ఏడో వాహనం స్లోగా ఉన్నప్పుడు కర్రలతో మాత్రమే దాడి చేశారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు పెట్టామని, ఒకరిని అరెస్ట్ కూడా చేశామని డీజీపీ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, సిబ్బంది తప్పుంటే చర్యలు తీసుకుంటామని డీజీపీ మాలకొండయ్య పేర్కొన్నారు. -
దాచేపల్లి ఘటన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం
-
సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లాడు
సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య(55)ను పట్టుకునేందుకు 17 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన దారుణమన్నారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. రిక్షావాలా అయిన సుబ్బయ్యకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని, ఇద్దరు భార్యలు అతడిని వదిలేశారని వెల్లడించారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అతడు మానసిక వైఫల్యంతోనే ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందన్నారు. చనిపోవడానికి వెళ్తున్నట్టు దారిలో కనిపించిన వ్యక్తికి చెప్పినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో 7 అత్యాచార ఘటనలు జరగడం దురదృష్టకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. ఈ ఏడు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దాచేపల్లి కేసులో ఈ కేసులో పోలీసులు సమన్వయంతో వ్యహరిస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ఆందోళనకారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. -
నాకు గన్మెన్లు వద్దు: పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన గన్మెన్లను వెనక్కి పంపారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ గతనెలలో డీజీపీ మాలకొండయ్యకు పవన్ లేఖ రాశారు. ఈ క్రమంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం పవన్‌కు నలుగురు గన్మెన్లను కేటాయించింది. రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు. అయితే మంగళవారం రాత్రి పవన్ తన గన్మెన్లను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అదే విధంగా తనకు కేటాయించిన గన్మెన్లు వద్దని ఆయన డీజీపీకి లేఖ ద్వారా తెలిపారు. గన్మెన్లను వెనక్కి పంపడంపై పవన్ కల్యాణ్ కారణాలను వెల్లడించలేదు. కానీ జనసేనకు సంబంధించిన వ్యవహారాలను గన్మెన్ల ద్వారా ప్రభుత్వం తెలసుకుంటోందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నట్టుగా సమాచారం. అందుకోసమే వారిని వెనక్కు పంపినట్లు తెలుస్తోంది.