
ఆర్కే ఎక్కడున్నాడో చెప్పాలి: ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి: మావోయిస్టు నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) పోలీసుల అదుపులోనే ఉన్నాడంటూ ప్రజాసంఘాలు మైండ్ గేమ్ ఆడిన విషయం మరోసారి బయటపడిందని ఏపీ డీజీపీ ఎన్.సాంబశివరావు గురువారం వ్యాఖ్యానించారు. ఆర్కే క్షేమంగా ఉన్నాడంటూ విరసం నేత వరవరరావు ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో డీజీపీ పైవిధంగా స్పందించారు.
తాము ముందునుంచీ ఊహిస్తున్నదే నిజమయ్యిందని, గత ఇరవై ఏళ్లుగా మావోయిస్టులు ఇదే విధమైన మైండ్‌గేమ్‌ను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆర్‌కే మా(పోలీసుల) వద్దే ఉన్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినవారు ఇప్పుడేం చెపుతారని డీజీపీ ప్రశ్నించారు. రాజ్యాంగంపై నమ్మకం ఉండి కోర్టును ఆశ్రయించిన వారు ఇప్పటికైనా ఆర్‌కే ఎక్కడున్నాడో చెప్పాలన్నారు.