ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు.
విశాఖపట్టణం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏవోబీలోకి మావోయిస్టులు ప్రవేశిస్తున్నారని తెలపారు. మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్, యాక‌్షన్ టీంల సంచారంపై నిఘా ఉంచినట్లు ఆయన తెలిపారు. ఏవోబీలో మావోయిస్టుల కార్యకలాపాలపై విశాఖలో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇందులో ఉత్తర కోస్తా ఐజీ, రేంజ్ డీఐజీ, ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, ఓఎస్డీలతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. మావోయిస్టులను కట్టడి చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.