
'వాళ్లు కాల్పులు జరిపాకే మేం జరిపాం'
ప్రకాశం: ఏవోబీ ఎన్కౌంటర్పై వస్తున్న వదంతులు వాస్తవం కాదని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. మావోయిస్టులు కాల్పులు జరిపిన తర్వాతే తాము కాల్పులు జరిపామని చెప్పారు. ఏపీ పోలీసుల అదుపులో గిరిజనులు లేరని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో 100 ఆదర్శ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం త్వరలో యాక్సిడెంటల్ జోన్ అలర్ట్ యాప్ను రూపొందించబోతున్నట్లు తెలిపారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడమే కాదని, పోలీసులు కూడా ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించాలని సాంబశివరావు కోరారు.