ఏవోబీ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సివుందని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు.
విశాఖపట్నం: ఏవోబీ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సివుందని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. మల్కాన్గిరిలోనే మావోయిస్టులకు పోస్టుమార్టం నిర్వహిస్తారని తెలిపారు.
ఎన్కౌంటర్లో గాయపడి, సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సతీష్ను డీజీపీ పరామర్శించారు. సతీష్ కాలిలో ఇంకా బుల్లెట్ ఉందని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అజీజ్ బాషా కుటుంబానికి 40 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అజీజ్ స్వస్థలం విశాఖపట్నం గాజువాక అని డీజీపీ సాంబశివరావు తెలిపారు.