sambashivarao
-
కార్మికుల సమస్యలు పరిష్కరించేవరకు దిక్ష కొనసాగిస్తా
-
చనిపోయిన మావోయిస్టులను గుర్తించాల్సివుంది
విశాఖపట్నం: ఏవోబీ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సివుందని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. మల్కాన్గిరిలోనే మావోయిస్టులకు పోస్టుమార్టం నిర్వహిస్తారని తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడి, సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సతీష్‌ను డీజీపీ పరామర్శించారు. సతీష్ కాలిలో ఇంకా బుల్లెట్ ఉందని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అజీజ్ బాషా కుటుంబానికి 40 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అజీజ్ స్వస్థలం విశాఖపట్నం గాజువాక అని డీజీపీ సాంబశివరావు తెలిపారు. -
టీటీడీ ఈవోగా సాంబశివరావు
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావును ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి పేషీలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఎ.గిరిధర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు టీటీడీ ఈవోగా ఉన్న ఎంజీ గోపాల్‌ను బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న అజయ్ జైన్‌ను ఇంధన, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. కళాశాల విద్యా కమిషనర్ కె.సునీతకు సాంకేతిక విద్య ఇన్చార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అజయ్ జైన్‌కు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఇన్‌క్యాప్) వైస్ చైర్మన్ కం మేనేజింగ్ డెరైక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. ఈ స్థానంలో పనిచేస్తున్న ఎన్.గుల్జార్‌ను బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం.. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఐఏఎస్‌ల విభజన ప్రాథమిక జాబితాలో గోపాల్ పేరును తెలంగాణ కోటాలో చేర్చింది. వారంలో ఐఏఎస్‌ల విభజన పూర్తయ్యే అవకాశం ఉన్నందునే పోస్టింగ్ ఇవ్వలేదని తెలిసింది. -
మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడి హత్య
నల్గొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు రాములును దారుణంగా హత్య చేశారు. ఆదివారం పట్టపగలే నల్గొండలో రాములును కాల్చిచంపారు. దుండగులు ఆయన ముఖంపై కారంపొడి చల్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుతురు వివాహానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఫంక్షన్ హాల్లో అందరూ చూస్తుండగానే రాములుపై దాడి చేశారు. రాములు గన్‌మెన్ ప్రతిఘటించడంతో దుండుగులు పారిపోయారు. రాములును వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాములు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆయనపై దాడి జరిగింది. నల్గొండకు వచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాసేపట్లో ప్రభుత్వాసుపత్రికి వెళ్లనున్నారు.