మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడి హత్య
నల్గొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు రాములును దారుణంగా హత్య చేశారు. ఆదివారం పట్టపగలే నల్గొండలో రాములును కాల్చిచంపారు. దుండగులు ఆయన ముఖంపై కారంపొడి చల్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుతురు వివాహానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఫంక్షన్ హాల్లో అందరూ చూస్తుండగానే రాములుపై దాడి చేశారు. రాములు గన్మెన్ ప్రతిఘటించడంతో దుండుగులు పారిపోయారు. రాములును వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రాములు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆయనపై దాడి జరిగింది. నల్గొండకు వచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాసేపట్లో ప్రభుత్వాసుపత్రికి వెళ్లనున్నారు.