
సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలంటూ ఆయన పర్సనల్ సెక్రటరీ గురువారం ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ జెడ్ కేటగిరి భద్రత పరిధిలో ఉన్న విషయం మీకు విదితమేనని, దానికి అనుగుణంగా భద్రత కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
సుమారు ఏడు నెలల పాటు జరిగే వైఎస్ జగన్ పాదయాత్రకు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ 13 జిల్లాల్లో సుమారు 3వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుందని, త్వరలోనే రూట్‌మ్యాప్‌ను పోలీసులకు జిల్లాల వారీగా ఆ పార్టీ ఇన్‌ఛార్జ్‌లు అందచేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా వైఎస్ జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు,పార్టీ నేతలు, అభిమానులు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.
పాదయాత్ర పై డీజీపీకి YSRCP లేఖ#PrajaSankalpaYatra pic.twitter.com/3DQdcgsSM3
— YSR Congress Party (@YSRCParty) 2 November 2017
Comments
Please login to add a commentAdd a comment