రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద కెమెరాలు | CCTV cameras setup in State border checkpost, says AP DGP JV Ramudu | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద కెమెరాలు

Published Fri, Dec 26 2014 1:34 PM | Last Updated on Sat, Aug 18 2018 6:24 PM

రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద కెమెరాలు - Sakshi

రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద కెమెరాలు

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. శుక్రవారం తిరుపతి నగరంలోని తూర్పు పోలీసు స్టేషన్లో కమాండింగ్ సెంట్రల్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జె వి రాముడు మాట్లాడుతూ... వచ్చే  ఆరునెలల్లో ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేస్తామన్నారు.

తిరుపతి అత్యంత సున్నితమైన నగరమని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నిఘా వ్యవస్థను పటిష్ట పరిచే క్రమంలో కమాండింగ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జె.వి.రాముడు వివరించారు. అలాగే తిరుపతి అర్బన్ కాంప్లెక్స్కు స్థల సేకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement