checkposts
-
ఇది కూటమి చెక్‌పోస్టు.. ఓకే అంటేనే ముందుకు!
మామూలుగా రోడ్లపై ప్రభుత్వం చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం చూశాం. పోలీసు, అటవీ, గనులు, వ్యవసాయ శాఖలతో పాటు రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు కనిపిస్తుంటాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారి నుంచి ఫైన్లు వసూలు చేస్తుంటాయి. అయితే తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నల్లాయగారిపాళెం గ్రామ సమీపంలోని రహదారి వద్ద కూటమి నేతలు ‘మా ప్రభుత్వం.. మా ఇష్టం..’ అంటూ ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో కన్వర్షన్ కూడా చేయకుండానే పక్కా భవనం నిర్మించి, కాటా కూడా ఏర్పాటు చేశారు. రోడ్డుపై డ్రమ్ములు అడ్డంగా పెట్టి.. వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు. సిలికా లీజుదారులు, గనులు, యార్డులు పొందిన వారిని గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇలా వ్యూహం పన్నారు. ప్రధానంగా ‘సిలికా’ రవాణాదారుల నుంచి మామూళ్లు దండుకునేందుకేనని స్పష్టమవుతోంది. -
Narendra Modi: ఉగ్రనిరోధక సామర్థ్యాలను పెంచండి
న్యూఢిల్లీ/జమ్మూ: ఉగ్రవాదం పీచమణిచేలా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిరోధక సామర్థ్యాలను మరింతగా పెంచాలని పాలనా యంత్రాంగానికి ప్రధాని మోదీ సూచించారు. యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి, చెక్‌పోస్ట్‌పై మెరుపుదాడి వంటి ఉదంతాలు మళ్లీ పెచ్చరిల్లిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదనపు భద్రతా బలగాల మొహరింపుతోపాటు ఉగ్రనిరోధక వ్యవస్థలను క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిస్థితిపై వివరాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను మోదీ అడిగి తెల్సుకున్నారు. స్థానిక యంత్రాంగంతో ఏ విధంగా వ్యూహాలను అమలుచేస్తున్నారో సిన్హా మోదీకి వివరించారు. జీ7 సదస్సు కోసం ఇటలీకి మోదీఇటలీలో నేటి నుంచి జరగబోయే జీ7 శిఖరాగ్ర సదస్సులో కృత్రిమ మేథ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంత సమస్యలపైనే దృష్టిసారించే అవకాశం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం ఇటలీకి బయల్దేరి వెళ్లారు. ‘గ్లోబల్ సౌత్’ దేశాల సమస్యలపైనా ప్రధానంగా చర్చ జరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటలీలోని అపూలియో ప్రాంతంలోని విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు నేటి నుంచి 15వ తేదీదాకా జరగనుంది. -
ఇక ‘క్యాష్‌లెస్’ చెక్‌పోస్టులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రవాణాశాఖలో ఇప్పటికే అన్ని రకాల లైసెన్సులను ఆన్లైన్ విధానంలో అందిస్తున్న రవాణాశాఖ.. ఇక సరిహద్దుల్లో కూడా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతర్రాష్ట్ర రవాణా చెక్‌పోస్టులను ఇక క్యాష్‌లెస్‌గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. రవాణాశాఖకు చెందిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో యూపీఐ పేమెంట్స్ విధానాన్ని ప్రారంభించింది. తద్వారా చెక్‌పోస్టుల్లో అవినీతిని కట్టడికి ఉపయోగపడుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అన్ని చెక్‌పోస్టుల్లో క్యాష్‌లెస్ విధానం అమలు కావడంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అన్ని ట్యాక్స్‌లూ ఆన్లైన్లోనే.. వాస్తవానికి రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. బోర్డర్ ట్యాక్స్, టెంపరరీ పర్మిట్ ట్యాక్స్, వలంటరీ ట్యాక్స్, కంపౌండింగ్ ఫీజు ఇలా అన్నింటినీ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కానింగ్ చేయడం ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా హెచ్‌టీ టీపీఎస్://ఏపీఆర్టీఏసిటిజెన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానంతో అవినీతి కట్టడితో పాటు చెక్‌పోస్టుల వద్ద లైన్లలో నిలబడి చెల్లించే బాధ తప్పనుంది. తద్వారా వాహనాలను ఎక్కువ సమయం నిలిపి ఉంచే సమయం కూడా తగ్గడం ద్వారా వాహన రవాణా ప్రయాణ సమయం కూడా తగ్గనుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రవాణాశాఖ చెక్పోస్టులివే.. రాష్ట్రానికి అటు కర్ణా్ణటక, ఇటు తమిళనాడు, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను రవాణాశాఖ నిర్వహిస్తోంది. మొత్తం 15 చెక్‌పోస్టులు.. ఇచ్ఛాపురం, జీలుగువిుల్లి, పంచలింగాల, పెనుకొండ, సున్నిపెంట, తిరువూరు, గరికపాడు, పలమనేరు, తడ, బీవీ పాలెం, రేణిగుంట, నరహరిపేట, దాచేపల్లి, మాచర్ల, బెండపూడి ప్రాంతాల్లో రవాణాశాఖ నిర్వహిస్తోంది. సీఎం ఆదేశాలతో చెక్‌పోస్టుల వద్ద క్యాష్‌లెస్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఇక నుంచి చెక్‌పోస్టుల్లో నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేశాం. అవినీతిరహిత పరిపాలన దిశగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎటువంటి మధ్యవర్తులకు తావులేకుండా ఈ విధానం తోడ్పడనుంది. ట్రాఫిక్ ఇబ్బందులకు కొత్త విధానంతో చెక్ పడుతుంది. – మనీష్‌కుమార్ సిన్హా, రవాణాశాఖ కమిషనర్ -
లాక్డౌన్: సరిహద్దులు దిగ్బంధం..
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/అలంపూర్/ కోదాడ రూరల్/నాగార్జునసాగర్: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ రెండోరోజు గురువారం ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 10 గంటల తరు వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రయాణ ప్రాంగణాలలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు యథావిధిగా ప్రయాణాలు సాగాయి. ఇక అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దుల్లోని గ్రామీణ రహదారుల గుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోకి రాకపోకలు సాగించే వాహనాలపైనా నిఘా పెట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాశారు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద రోడ్లపైకి వచ్చిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అత్యవసర పనులు, వైద్యం, వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చిన వారిని మాత్రం పోలీసులు వివరాలు సేకరించి అనుమతించారు. ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సులను వివరాలు సేకరించి అనుమతించారు. బారికేడ్లతో కట్టడి.. ఏపీ, కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలు, స్థానిక రవాణా వంటి అంశాలపై జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. పుల్లూరు–పంచలింగాల జాతీయ రహదారిలోని రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. ఏపీ సరిహద్దు సుంకేసుల–రాజోలి వద్ద రహదారినే మూసివేశారు. కేటీదొడ్డి మండలంలోని కర్ణాటక–తెలంగాణ అంతర్ రాష్ట్ర రహదారిలోని నందిన్నే చెక్‌పోస్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను కట్టడి చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద పరిస్థితిని ఎస్పీ భాస్కరన్ సమీక్షించారు. అలంపూర్ వాసుల ఇక్కట్లు లాక్డౌన్ సడలింపు సమయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత వ్యత్యాసం ఉండటం ఇబ్బందిగా మారింది. ఏపీలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపు ఉండగా.. తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉంది. ఇది ప్రతిరోజూ నిత్యావసరాలు, వైద్యం, మందులు, వ్యవసాయ అవసరాలు, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం కర్నూలు జిల్లాకు వెళ్లి వచ్చే అలంపూర్ నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలకు సమస్యగా మారింది. ఏపీలో ఉన్న సమయానికి అనువుగా ఉద్యోగాలు, వ్యాపారాలు, సరుకుల కొనుగోళ్లు చేసి అనేక మంది సొంత గ్రామాలకు వస్తున్నారు. అప్పటికి ఇక్కడ సడలింపు సమయం ముగిసిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి వాహనాలను అనుమతించండి: డీజీపీ లాక్డౌన్లో సింగరేణి కార్మికులు, వాహనాలను అనుమతించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి సంస్థకు అవసరమైన పేలుడు పదార్థాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర విడిభాగాలను కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగరేణి సీఎండీ విజ్ఞప్తి మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా రంజాన్ సందర్భంగా ప్రార్థనా స్థలాల వద్ద కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్: సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు
కోదాడ రూరల్/ నాగార్జునసాగర్/దామరచర్ల/ జహీరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. లాక్డౌన్ తొలిరోజు బుధవారం పోలీసు ఉన్నతాధికారులు పలు చెక్‌పోస్టుల వద్ద స్వయంగా తనిఖీలు పర్యవేక్షించారు. అత్యవసర సర్వీసులు, అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించి మిగతా వాటిని వెనక్కి పంపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని సరిహద్దుల్లో గల చెక్‌పోస్టుల్లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు, మఠంపల్లి మండలం మట్టపల్లిలోని కృష్ణానది వద్ద, చింతలపాలెం మండలం వజినేపల్లి క్రాస్‌రోడ్డు, పులిచింతలప్రాజెక్ట్ వద్ద, నాగార్జునసాగర్‌లోని కొత్త బ్రిడ్జి, దామరచర్ల మండలం వాడపల్లి వంతెన వద్ద ఉన్న చెక్‌పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు, అత్యవసర విభాగం, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాహనాలను మాత్రం నేరుగా అనుమతించారు. మిగతా వాహనాలకు ఈ పాస్‌లు ఉంటేనే అనుమతించారు. ఖమ్మం, సంగారెడ్డి సరిహద్దుల్లోనూ.. సత్తుపల్లి–చింతలపూడి మధ్యలో.. మధిర–వత్సవాయి, పెనుబల్లి–ముత్తగూడెం, వల్లభి–గండ్రాయి మధ్య చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. ఇక సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు. అంబులెన్సులను అనుమతిస్తున్న అధికారులు.. రాష్ట్రంలోకి వచ్చే కోవిడ్ బాధితుల వివరాలు, ఏ ఆసుపత్రికి వెళ్తున్నారు? అనే వివరాలు సేకరిస్తున్నారు. సంబంధీకుల ఫోన్ నంబర్ తీసుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే అంబులెన్సులను కూడా అనుమతిస్తు న్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సరిహద్దుల వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను ఎలాంటి ఆటంకాలూ లేకుండా అనుమతించారు. చదవండి: లాక్డౌన్: జనమంతా ఇళ్లలోనే! -
దీనిపై అసత్య ప్రచారం తగదు
-
ఏపీ-తెలంగాణ చెక్ పోస్టు వద్ద వాహనాల క్యూ
-
మార్కెటింగ్‌శాఖలో 246 ఆధునిక చెక్‌పోస్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ 246 ఆధునిక చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనుంది. రైతుల నుంచి పంటను కొనుగోలు చేసిన వ్యాపారులు మార్కెటింగ్ శాఖ కార్యాలయాలకు వెళ్లకుండా వీటిలోనే సెస్ చెల్లించేందుకు అనువుగా వీటిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్డు పక్కన చిన్న రేకులషెడ్డులో అరకొర సౌకర్యాలతో చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. అక్కడ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటి స్థానే ఆధునిక చెక్‌పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మంచి వాతావరణంలో విధులు నిర్వహించేందుకు వీలుగా సౌకర్యాల కల్పనతో పాటు కంప్యూటర్ల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. సిబ్బందికి వాష్ రూంలు తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ► గత ప్రభుత్వ హయాంలో సాలీనా రూ.400 కోట్లలోపే ఆదాయం కలిగిన మార్కెటింగ్‌శాఖకు గత రెండేళ్ల నుంచి రూ.600 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. కరోనా విపత్తు సమయంలోనూ లక్ష్యానికి అనువుగా ఆదాయాన్ని సాధించింది. పెరుగుతున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో రైతులకు అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ► వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి మార్కెట్‌యార్డులో అరటి రైతులు పంటను నిల్వ చేసుకునేందుకు, ప్యాకింగ్ చేసుకునేందుకు వీలుగా కోల్డుస్టోరేజీ ప్లాంట్, గోదామును నిర్మించనుంది. గత సీజన్లో అరటిని నిల్వ చేసుకునే సౌకర్యాల్లేక రాయలసీమ రైతులు నానా ఇబ్బందులుపడ్డారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డు స్టోరేజీ ప్లాంట్‌ను నిర్మించనుంది. ► దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఈ యూనిట్ల నిర్మాణంతో వైఎస్సార్ జిల్లాలోని రైతులు పంటను నిల్వ చేసుకునేందుకు, అమ్ముకునేందుకు ఇక ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ► గత నెలలోనే 70 గోడౌన్ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించిన మార్కెటింగ్‌శాఖ.. రాయలసీమ ప్రాంతంలోని మార్కెట్‌యార్డుల్లో సిమెంట్ రోడ్లు, దుకాణాలు, ప్లాట్‌ఫాంలు, ప్రహరీలు, పశువైద్యశాలల నిర్మాణాలకూ టెండర్లు పిలిచింది. ► దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే ఈ సౌకర్యాలను వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.ప్రద్యుమ్న చెప్పారు. -
ఏసీబీ దాడుల కలకలం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఏసీబీ ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. అనంతపురంలో కొడికొండ చెక్‌పోస్ట్‌లోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ పై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి రూ.14వేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చిత్తూరులో పలమనేరు, నరహరిపేటలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వాణిజ్యపన్నుల కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయాలలో రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పలమనేరులో రూ.32 వేలు, నరహరిపేటలో రూ.51 వేలు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దు ఇచ్చాపురం చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎనిమిది మంది ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి రూ.64వేలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో పొందుగల కమర్షియల్ చెక్ పోస్టుపై దాడులు జరిపిన ఏసీబీ అధికారులు రూ.22వేలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద కెమెరాలు
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. శుక్రవారం తిరుపతి నగరంలోని తూర్పు పోలీసు స్టేషన్లో కమాండింగ్ సెంట్రల్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జె వి రాముడు మాట్లాడుతూ... వచ్చే ఆరునెలల్లో ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్లను అరెస్ట్ చేస్తామన్నారు. తిరుపతి అత్యంత సున్నితమైన నగరమని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నిఘా వ్యవస్థను పటిష్ట పరిచే క్రమంలో కమాండింగ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జె.వి.రాముడు వివరించారు. అలాగే తిరుపతి అర్బన్ కాంప్లెక్స్‌కు స్థల సేకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. -
చెక్ పోస్టులపై ఏసీబీ, ఆర్టీఏ అధికారులు దాడులు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని చెక్పోస్టులపై ఏసీబీ, ఆర్టీఏ అధికారులు వేర్వేరుగా శనివారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లోని తడ చెక్‌పోస్టుపై దాడి చేసి భారీగా నగదును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా కొందుర్గు చెక్‌పోస్టు నుంచి రూ.55 వేలను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తేటగుంట చెక్‌పోస్టుపై చేసిన దాడిలో రూ.25వేలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు అనంతపురం జిల్లా పెనుకొండ చెక్‌పోస్టుపై నిర్వహించిన దాడులలో రూ. రూ.39 వేల నగదుతోపాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ సమీపంలోని పాలమాకుల చెక్‌పోస్టుపై దాడి చేసి రూ.24 వేల నగదు సీజ్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించి రూ. 41 వేలు స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
-
ఆర్డీవో చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు