రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని చెక్పోస్టులపై ఏసీబీ, ఆర్టీఏ అధికారులు వేర్వేరుగా శనివారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లోని తడ చెక్పోస్టుపై దాడి చేసి భారీగా నగదును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా కొందుర్గు చెక్పోస్టు నుంచి రూ.55 వేలను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తేటగుంట చెక్పోస్టుపై చేసిన దాడిలో రూ.25వేలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వీటితోపాటు అనంతపురం జిల్లా పెనుకొండ చెక్పోస్టుపై నిర్వహించిన దాడులలో రూ. రూ.39 వేల నగదుతోపాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ సమీపంలోని పాలమాకుల చెక్పోస్టుపై దాడి చేసి రూ.24 వేల నగదు సీజ్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్పోస్టుపై దాడులు నిర్వహించి రూ. 41 వేలు స్వాధీనం చేసుకున్నారు.