నకిలీ పాస్ పుస్తకాల కేసును పోలీసులే విచారిస్తారని ఏపీ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించాల్సిన పనిలేదని అన్నారు.
అనంతపురం: నకిలీ పాస్ పుస్తకాల కేసును పోలీసులే విచారిస్తారని ఏపీ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించాల్సిన పనిలేదని అన్నారు. అనంతపురం పోలీసులే ఈ కేసు విచారణను కొనసాగిస్తారని వివరించారు.
ఇక కాల్ మనీ వ్యవహారంపై స్పందిస్తూ అధిక వడ్డీలతో ప్రజలను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు. కొత్త మనీ ల్యాండరింగ్ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.