
ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు తన కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీలో నమోదైన కేసులు, ఫోన్ ట్యాపింగ్ వ్యహారంలో నమోదైన కేసులను ఆయన సమీక్షించారు.
ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ కావడం, ఈ వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబు అని ఆరోపణలు రావడంతో ఏపీలో కేసీఆర్ పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫోన్లు ట్యాప్ చేశారంటూ కేసీఆర్ కేసులు పెట్టారు. కేసీఆర్ పై నమోదైన మొత్తం కేసుల విచారణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.