విజయవాడ: బెజవాడ కల్తీ మద్యం ఘటనపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జెవి రాముడు తెలిపారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, డీఐజీ లడ్హా నేతృత్వంలో 9 మంది కమిటీ విజయవాడ కల్తీ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. కల్తీ మద్యం ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత కల్తీ మద్యం కేసులో స్పష్టత వస్తుందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన కల్తీ మద్యం మరణాల కేసులు కూడా సిట్ దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటుందని రాముడు చెప్పారు. ఇక ఈ కేసులో తొమ్మిది మంది బార్ సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.