'చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదు' | AP DGP JV Ramudu review meeting on Mayor Anuradha murder case in Chittoor | Sakshi
Sakshi News home page

'చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదు'

Published Sat, Nov 28 2015 12:40 PM | Last Updated on Sat, Aug 18 2018 6:24 PM

'చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదు' - Sakshi

'చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదు'

చిత్తూరు : చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. ఈ హత్యకేసు పురోగతిపై డీజీపీ శనివారం చిత్తూరులో సమీక్ష నిర్వహించారు. అనంతరం జె.వి.రాముడు విలేకర్లతో మాట్లాడారు.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదని.. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వివరాలను ఆయన ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశానికి ఐజీ ఆర్పీ ఠాగూర్తోపాటు జిల్లా ఎస్పీ జి.శ్రీనివాస్తోపాటు ఇతరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement