మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య | chittoor corporator siva reddy suicide in chintu case | Sakshi
Sakshi News home page

మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య

Published Fri, Dec 18 2015 12:50 AM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM

మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య - Sakshi

మేయర్ హత్యకేసు విచారణ: కార్పొరేటర్ ఆత్మహత్య

చిత్తూరు: చిత్తూరు నగరంలోని 36వ డివిజన్ కార్పొరేటర్ శివప్రసాద్ రెడ్డి (46) గురువారం ఉదయం 11 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు.  చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, కఠారి మోహన్ దంపతుల హత్య కేసులో బుధవారం మధ్యాహ్నం పోలీసులు శివప్రసాద్ రెడ్డిని తీసుకెళ్లి విచారించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయనను వదిలిపెట్టారు.

అయితే, ఈ హత్యకేసులో అనవసరంగా తనను ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని భావించిన శివ ప్రసాద్ రెడ్డి మనోవేదనకు గురై ఇంటికి వస్తూనే గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 36వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి గెలిచారు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement