katari anuradha
-
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
-
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
సాక్షి,చిత్తూరు: పదేళ్ల క్రితం సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై హత్యాయత్నం కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 2007 డిసెంబర్ 31న సీకే బాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని నిందితులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీకే బాబు గన్‌మెన్ సురేంద్ర మృతి చెందగా, సీకే బాబుకు, అతని అనుచరులకు గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన వన్‌టౌన్ పోలీసులు 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీకే బాబు సహా 81మంది సాక్షుల్ని పోలీసులు చేర్చగా, కోర్టు 51 మందిని విచారించి 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఇందులో ఏ-1 నిందితుడు, టీడీపీ నాయకుడు కటారి మోహన్ మృతిచెందగా, ఏ-2 నిందితుడైన చింటూకు కోర్టు జీవితఖైదును విధించింది. మేయర్ కటారి అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడుగా ఇప్పటికే వైఎస్ఆర్ కడప జిల్లా సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. -
'చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదు'
చిత్తూరు : చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. ఈ హత్యకేసు పురోగతిపై డీజీపీ శనివారం చిత్తూరులో సమీక్ష నిర్వహించారు. అనంతరం జె.వి.రాముడు విలేకర్లతో మాట్లాడారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదని.. విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వివరాలను ఆయన ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశానికి ఐజీ ఆర్పీ ఠాగూర్‌తోపాటు జిల్లా ఎస్పీ జి.శ్రీనివాస్‌తోపాటు ఇతరు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతకు రూ.3 కోట్లు సెటిల్మెంట్ చేసిన చింటూ
చిత్తూరు : చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ పలువురు టీడీపీ నేతలకు సాయపడినట్లు పోలీసులు విచారణలో వెలుగు చూస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు, పోలీసుల అదుపులో ఉన్నవారిని విచారిస్తుండగా పలు విషయాలు వెల్లడి అయినట్లు సమాచారం. చిత్తూరులో అధికార పార్టీలో ఉంటూ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఓ నేత ఇటీవల చింటూ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబాయిలో తనకు చెందిన రూ.3 కోట్ల విలువైన ఆస్తులను అక్కడి మాఫియా ద్వారా చింటూ సెటిల్ చేసినట్లు, చింటూ అనుచరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనికి ప్రతిఫలంగా చింటూకు ఆ నేత విదేశీ తుపాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న చింటూ భారత్‌కు సమీప దేశాల్లోని ద్వీపాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతులు ఈ నెల 17న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
కఠారి హత్యవెనుక టీడీపీ నేతలు?
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన కఠారి మోహన్‌తో ఆ పార్టీలోనే కొందరికి వర్గవిభేదాలున్నాయా? మోహన్‌ను అంతమొందించేందుకు అధికారపార్టీ నేతలే కుట్రపన్నారా? ఇందుకోసం అధికారమూ.. ఆధిపత్యమూ నీదేనంటూ మేనల్లుడు చింటూను రెచ్చగొట్టారా? వారి భరోసాతోనే చంపేంత పగలేకపోయినా చింటూ మేనమామ కఠారి దంపతులను హత్యచేశాడా?.. ఈ ప్రశ్నలకు రాజకీయవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. హత్య వెనుక అధికారపార్టీ నేతల కుట్ర ఉండడంలో ఆశ్చర్యం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే అంటున్నట్టు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నేతల్లో అక్కసు.. చిత్తూరు పరిధిలోని ఓ ముఖ్యనేత, మరికొందరు స్థానిక నేతల అండతో కఠారి మోహన్ టీడీపీలో ముఖ్యనేతగా ఎదిగారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో గొడవల నేపథ్యంలో ఆయనకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యమిచ్చింది. నగరానికి చెందిన కొందరు అధికారపార్టీ నేతలు ఇది జీర్ణించుకోలేకపోయారు. మోహన్ భార్య అనురాధ మేయర్ అయ్యాక ఆ కుటుంబం ఎవర్నీ లెక్కచేయట్లేదని, నగర పరిధిలో అభివృద్ధి పనుల కేటాయింపులోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఓ ప్రజాప్రతినిధితోపాటు మరో ముగ్గురు అధికారపార్టీ నేతలు మోహన్‌పై అక్కసు పెంచుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యే టికెట్‌కోసం పోటీపడిన మోహన్.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌కోసం గట్టి పోటీదారయ్యే అవకాశముండడంతో వారు ఆయన ఆధిపత్యానికి అడ్డ్డుకట్ట వేసేందుకు పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీలో అంతర్గతపోరు ముదిరిపోయింది. చింటూను రెచ్చగొట్టారా? మామ కోసమే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన చంద్రశేఖర్ అలియాస్ చింటూ, మోహన్ మధ్య కుటుంబ కలహాలు రేగాయి. దీనికిసైతం కొందరు అధికారపార్టీ నేతలే బీజం వేశారనే ప్రచారముంది. తరువాత పార్టీలోని కఠారి వ్యతిరేకవర్గం మామాఅల్లుళ్ల మధ్య ఆజ్యంపోసి విభేదాలు తారస్థాయికి చేరేలా చేసిందని ప్రచారం జరుగుతోంది. మూడున్నరేళ్ల అధికారం ఉంది.. మామపోతే అధికారం నీదే, ఆధిపత్యం నీదేనంటూ చింటూను రెచ్చగొట్టినట్లు సమాచారం. ఇలాగే వదిలేస్తే రాబోయే మూడేళ్లలో మీ మామ మరింత ఎదుగుతారని, ఆపై ఎమ్మెల్యే అయినా ఆశ్యర్యపడాల్సిందిలేదని, అదే జరిగితే అత్త కుటుంబానిదే పెత్తనమంటూ రెచ్చగొట్టినట్లు, నీ వెనుక మేముంటామంటూ వారు భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో మేనమామ కుటుంబంపై దాడికి చింటూ తెగబడినట్లు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ప్రచారం సాగుతోంది. అధికారపార్టీ నేతల అండలేకుండా చింటూ హత్యాకాండకు దిగేంత సాహసం చేయలేడని రాజకీయవర్గాలతోపాటు కఠారి వర్గం సైతం భావిస్తున్నట్లు సమాచారం. కుట్రకోణంపై పోలీసు విచారణ కఠారి దంపతుల హత్యపై పోలీసు, నిఘా విభాగాలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. కఠారి కుటుంబంతో అధికారపార్టీలో ఎవరెవరికి విభేదాలున్నాయి? వారిలో హత్యను ప్రోత్సహించిందెవరు? చింటూకు భరోసా కల్పించిందెవరు? సహకరించిందెవరు? అన్నకోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విభేదాలకు సంబంధించి కఠారి కుటుంబసభ్యులు, సన్నిహితులు, అనుచరులు, కొందరు అధికారపార్టీ నేతలనుసైతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే మోహన్‌ను హత్యచేసేందుకు సొంత పార్టీలో ఎవరు కుట్ర పన్నారన్న విషయానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సీఎంకు మినహా ఏ ఒక్కరికీ బహిర్గతం చేయరాదని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసిన ట్లు విశ్వసనీయ సమాచారం. -
సామాన్య మహిళ నుంచి మేయర్ దాకా..
చిత్తూరు : ఎవరూ అనుకోలేదు.. ఆమెకు అప్పుడే నిండూ నూరేళ్లు నిండుతాయని. ఏ ఒక్కరూ ఊహించలేదు.. ఓ సామాన్య గృహిణి నుంచి మేయర్‌గా ఎదిగిన ఈమెను హతమార్చేంత శత్రుత్వం ఉందని. నిజమే.. కఠారి అనురాధ మామూలు గృహిణి. అయితే ఆమె పట్టుదల, పోరాట ప్రతిమ మాత్రం అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తుంది. అనురాధ తండ్రి పేరు రాధాక్రిష్ణ. 1970-80లో ఈయన చిత్తూరు మునిసిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. నగరంలోని కస్తూర్భా మునిసిపల్ పాఠశాలలో కఠారి అనురాధ చదివారు. రాజకీయాలు ఈమెకు పూర్తిగా కొత్త. అయితే 2005లో అనురాధ భర్త కఠారి మోహన్ కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో అప్పటి మునిసిపల్ పాలకవర్గం మోహన్‌ను కౌన్సిలర్ పదవి నుంచి తొలగించింది. 2007లో జరిగిన ఉప ఎన్నికల్లో అనురాధ తొలిసారిగా గంగనపల్లె ప్రాంతం నుంచి టీడీపీ తరపున కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ సమయంలో తన వార్డులో ఓ నీటి బోరుకు మోటరు బిగించుకోవడానికి కఠారి అనురాధ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తన వార్డు ప్రజలకు నీళ్లను ఇవ్వడానికి ఆమె కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ వందలసార్లు తిరిగారు. అయినా కుదర్లేదు. ఈ సమయంలోనే అనురాధలో ఉన్న పోరాట ప్రతిమ నాయకురాలిని చేసింది. 2014 మునిసిపల్ ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. నగర మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. గంగనపల్లె నుంచి కఠారి అనురాధ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. నగరంలో టీడీపీ 30కు పైగా డివిజన్లలో కార్పొరేట్లను గెలుచుకుంది. ఇందులో మోహన్ పాత్ర చాలా కీలకం. 50 డివిజన్లలో తిరుగుతూ పార్టీ గెలుపు ఆర్థికంగా, సామాజికంగా బలాన్ని కూడగట్టుకుని పాదయాత్ర చేశారు. ఈ కష్టం అనురాధను చిత్తూరు నగర తొలి మేయర్‌ను చేసింది. సామాన్య గృహిణిగా ఉన్న ఈమె తొలి మేయర్ పదవిని చేపట్టి చిత్తూరు రాజకీయాల్లో తన కంటూ ఓ చరిత్రను లిఖించుకున్నారు. తన రాజకీయ గురువు మాత్రం తన భర్త కఠారి మోహన్నే నంటూ అనురాధ అందరి ముందు గర్వంగా చెప్పుకునేది. అవే రాజకీయాలు తన ప్రాణాలను హరిస్తాయని ఆమె ఏ నాడూ ఊహించుకుని ఉండరు. -
ఇంటెలిజెన్స్ వైఫల్యం - చంద్రబాబు
చిత్తూరు: ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం వల్లే చిత్తూరు మేయర్ దంపతుల హత్యోదంతం చోటుచేసుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుట్రను ముందుగా గుర్తించివుంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్యలు జరిగియన్నారు. హత్యాస్థలిని క్షుణ్నంగా పరిశీలించినట్టు చెప్పారు. నిందితుల్లో ఇద్దరు దొరకాల్సివుందని వెల్లడించారు. హత్యారాజకీయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. దుండగుల దాడిలో హత్యకు గురైన మేయర్ కఠారి అనురాధ, మోహన్ భౌతిక కాయాలకు చంద్రబాబు నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కూడా శ్రద్ధాంజలి ఘటించారు. -
ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే...: చంద్రబాబు
-
'ఐదుగురు వ్యక్తులు హత్యకు పాల్పడ్డారు'
-
చింటూ ఇంటి వద్దకు వెళ్లి ఆగిన జాగిలాలు
చిత్తూరు: మేయర్ కఠారి అనురాధ హత్య కేసులో బంధువుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. కఠారి మోహన్ బావమరిది చింటూ ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలాలు కూడా అతడి ఇంటి వద్దకు వెళ్లి ఆగడంతో అనుమానాలకు బలపడుతున్నాయి. మోహన్, చింటూలకు మధ్య చాలాకాలంగా ఆధిపత్య, ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఎంటెక్ చదువుకున్న చింటూ నేరచరిత్ర కలిగివున్నాడు. 2004లో ఓ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగి పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పోలీసులు తన కేసు పట్టించుకోలేదని పలుమార్లు మీడియా ముందు చింటూ వాపోయినట్టు తెలిసింది. కాగా చింటూ నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో తనకు సెక్యురిటీ పెంచాలని ఎస్పీ కార్యాలయానికి అనురాధ ఇటీవల లేఖ రాసినట్టు తెలిసింది. ఈరోజు ఆమె ఎస్కార్ట్ సెలవులో ఉన్నట్టు సమాచారం. కార్పొరేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని తెలుస్తోంది. కాగా చింటూ లొంగిపోయాడని ప్రచారం జరుగుతోంది. చింటూ అరెస్ట్ ను పోలీసులు ధ్రువీకరించలేదు. మరోవైపు చింటూ ఇంటిపై మేయర్ మద్దతుదారులు దాడి చేశారు. మూడు వాహనాలను ధ్వంసం చేశారు. -
'ఐదుగురు వ్యక్తులు హత్యకు పాల్పడ్డారు'
చిత్తూరు: మేయర్ కఠారి అనురాధ హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఘటనా స్థలంలో రైఫిల్, 3.2 వెపన్, కత్తులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. హత్యాస్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ కేసులో కఠారి మోహన్ బావమరిది చింటూ ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. అతడికి వెంకటేశ్, వెంకటా చలపతి, రెడ్డప్ప, మంజునాథ్ సహకరించినట్టు తెలుస్తోంది. వెంకటేష్, మరో నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. మరోవైపు ఎస్పీ శ్రీనివాసులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. నిందితులు జిల్లా దాటివెళ్లకుండా చూడాలని ఆదేశించారు. కాగా, మేయర్ హత్యతో చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మొహరించారు. -
చింటూ ఇంటి వద్దకు వెళ్లి ఆగిన జాగిలాలు
-
మహిళా మేయర్ హత్య దారుణం: చంద్రబాబు
విజయవాడ: చిత్తూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళా మేయర్ తన కార్యాలయంలో హత్యకు గురికావడం దారుణమన్నారు. కరడుకట్టిన ముఠాలు చేసిన పని ఇదని, ఇద్దరు లొంగిపోయారుని తెలిపారు. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ కేసులో ఎవరువున్నా రాజీ పడబోమని, రాజకీయ ముసుగులో ఇలాంటి హత్యలు జరగడం విచారకరమని చంద్రబాబు అన్నారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధను దుండగులు మంగళవారం కాల్చిచంపారు. ఆమె భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. చిత్తూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఇద్దరు నిందితులు లొంగిపోయారు. వీరిలో ఒకరు పలమనేరుకు చెందిన వెంకటేష్, మరొకరు ముల్ బాగల్(కర్ణాటక)కు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
మహిళా మేయర్ హత్య దారుణం
-
స్పృహలోకి వచ్చిన మేయర్ భర్త
చిత్తూరు: చిత్తూరులో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మేయర్ అనురాధ భర్త కటారి మోహన్ తమిళనాడు వేలూరులోని సీఎంసీలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన 1.30 గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ముగ్గురు వ్యక్తులు చిత్తూరు ఒన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోను, మరో వ్యక్తి చిత్తూరు కోర్టులోను లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మోహన్ అక్క కుమారుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు చెందిన ఆఫీసును మోహన్ వర్గీయులు పెట్రోలు పోసి నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో మేయర్ అనూరాధపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూరాధతో పాటు ఉన్న కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తరలించారు. -
చిత్తూరు మేయర్ భర్త మృతి
చిత్తూరు: దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్ మరణించారు. వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మోహన్ తుది శ్వాస విడిచారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూరాధతో పాటు ఉన్న కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరుకు తరలించారు. వేలూరుకు తీసుకెళ్లిన కాసేపటికే మోహన్ చనిపోయారు. -
బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి!
మేయర్ కఠారి అనూరాధ ప్రతిరోజూ ఉదయం 10-10.30 గంటలకే కార్పొరేషన్ కార్యాలయానికి వస్తారు. ఈ విషయం బాగా తెలిసిన ఆరుగురు దుండగులు మంగళవారం నాడు జనంలో కలిసిపోయి వచ్చారు. బయట దాదాపు 50 మంది వరకు ఉన్నారు. మేయర్‌కు ఎలాంటి పోలీసు భద్రత లేదు. ఆమె కోసం ఎవరు వచ్చినా నేరుగా లోపలకు పంపేస్తున్నారు. ఈ విషయాన్ని దుండగులు బాగా కనిపెట్టారు. అనూరాధను అభినందించాలంటూ ఆరుగురు వ్యక్తులు బురఖాలు ధరించి బొకేలతో వచ్చారు. వచ్చినవాళ్లు మహిళలని భావించి, వాళ్లను లోనికి పంపారు. లోపల మేయర్, ఆమె భర్త కఠారి మోహన్, దాదాపు 8 మంది వరకు కార్పొరేటర్లు ఉన్నారు. లోపలకు వెళ్లగానే వాళ్లు ముసుగులు తీసి, నేరుగా మేయర్ మీద పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు. ఆమెకు నుదుటి మీద, కంటి కింద బుల్లెట్లు తగిలాయి. అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయిన ఆమె.. ఘటనాస్థలంలోనే మరణించారు. వెంటనే మేయర్ భర్త కఠారి మోహన్‌పై పొడవాటి కత్తులతో విరుచుకుపడ్డారు. ఆయన మెడ వెనకభాగంలో కూడా నరకడంతో నరాలు తెగిపోయాయి. గతంలో కూడా మోహన్‌పై హత్యాయత్నం జరిగింది. అప్పట్లో ఆ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. కానీ ఈసారి మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను తొలుత చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి వెల్లూరు సీఎంసీకి తరలించారు. ఛాంబర్లో ఉన్న అద్దాలు మొత్తం పగిలిపోయాయి. మేయర్‌కు భద్రత కోసం కేవలం వ్యక్తిగత అనుచరులు ఉన్నారే తప్ప పోలీసులు మాత్రం ఎవరూ లేరు. విషయం తెలిసిన తర్వాత పోలీసులు కార్పొరేషన్‌కు చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
చిత్తూరులో ఉద్రిక్తత, 144 సెక్షన్ విధింపు
చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతులపై దాడి జరగడంతో నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో నగరంలో 144 సెక్షన్ విధించారు. పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో రత్న సంఘటనా స్థలాన్నిపరిశీలించారు. సంఘటనాస్థలంలో దుండగులు వేసుకున్న బురఖాలు, ఓ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మేయర్ కఠారి అనురాధను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన నలుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనూరాధతో పాటు ఉన్న భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దాడిలో చిత్తూరుకు చెందిన ఓ కార్పొరేటర్ తమ్ముడికి కూడా తీవ్రగాయాలయినట్లు తెలిసింది. -
బురఖాలు ధరించి.. బొకేలతో వచ్చి!
-
చిత్తూరు మేయర్ అనురాధ హత్య
-
చిత్తూరు మేయర్ దారుణ హత్య
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం బురఖా ధరించి వచ్చిన ఆరుగురు దుండగులు చిత్తూరు కార్పొరేషన్ ఆవరణలో అనూరాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజిలో నేరుగా నుదుటిపై కాల్పులు జరపడంతో.. ఆమె సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అనూరాధతో పాటు ఉన్న ఆమె భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆయనను రాయవెల్లూరులోని సీఎంసీకి తరలించారు. దాడి అనంతరం దుండగులు గేట్లు దూకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 8 మంది కార్పొరేటర్లు, ఇతర నాయకులు చూస్తుండగానే ఈ దాడి జరిగింది. దుండగులంతా 25-35 ఏళ్ల మధ్య వయసువాళ్లేనని ప్రత్యక్ష సాక్షి లోకనాథం 'సాక్షి'కి తెలిపారు. తర్వాత అందరూ ద్విచక్ర వాహనాలపై పారిపోయారని, అలా వెళ్లేటప్పుడు మూడు బురఖాలు, ఒక రివాల్వర్ కింద పడిపోయాయని, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో కఠారి మోహన్ ప్రధాన నిందితుడు. గతంలో ఆయన కర్ణాటకలో కొన్నాళ్లు తలదాచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి, తన భార్యను మేయర్‌గా చేసుకున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూపు వ్యతిరేకించింది. అయితే తాను చాలాకాలం పార్టీ కోసం కష్టపడ్డానని, భద్రతా కారణాల రీత్యా కూడా ఆ పదవి కావాలని పట్టుబట్టి మరీ భార్యను మేయర్ చేసుకున్నారు. ఆ తర్వాతి నుంచి పార్టీలోని ఒక గ్రూపు మాత్రం మోహన్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. మేయర్ కుటుంబ సభ్యులు ఎవరూ ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. కుటుంబ కలహాలు కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు. -
..అలా వద్దంటున్నారు !
నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కమిషనర్...అధికారం మాది మేము చెప్పినట్లు జరగాలని మేయర్...దాదాపు వంద రోజుల పాలనలో ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గలేదు. తెగేదాకా లాగారు. ఇంకేముంది తమ మాట వినని కమిషనర్ వద్దనికలెక్టర్కు మేయర్ లేఖాస్త్రం సంధించారు. బదిలీ వచ్చినా సరే నిబంధనలకు విరుద్ధంగా పనిచేసేది లేదని కమిషనర్ భీష్మించుకున్నారు. సాక్షి, చిత్తూరు: ‘చిత్తూరు నగరపాలక కమిషనర్ రాజేంద్రప్రసాద్‌తో మేము వేగలేకపోతున్నాం.. తక్షణమే ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయండి’ అంటూ చిత్తూరు మేయర్ కఠారి అనురాధ కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌కు విన్నవించారు. మంగళవారం కమిషనర్‌పై ఫిర్యాదు చేశారు. విభేదాలకు బీజం పడిందిలా.. చిత్తూరు కార్పొరేషన్ తొలి పాలకవర్గ సమావేశం నిర్వహించినప్పటి నుంచి కమిషనర్, మేయర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. కార్పొరేషన్లో పనిచేసే కూలీలకు వేతనాలు ఇవ్వాలనే అంశాన్ని అజెండాలో కమిషనర్ చేర్చారు. దీన్ని మేయర్ తిరస్కరించారు. ప్రస్తుతం మూడు నెలలుగా కూలీ లంతా వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాన్ని కమిషనర్ జీర్ణించుకోలేకపోయారు. పాత కాంట్రాక్టర్ పేరుతో వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని, ప్రస్తుతం శేఖర్‌బాబుకు కొత్త కాంట్రాక్టు ఇచ్చామని, కాబట్టి పాత వేతనాలు ఇప్పట్లో ఇచ్చేది లేదనే తీరుగా వారు వ్యవహరించారు. కాంట్రాక్టర్ పేరుతో కూలీల వేతనాలను రాజకీయం చేయడం తగదని మేయర్‌కు సూచించారు. అలాగే తొలి పాలకమండలి సమావేశం కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది బహిరంగ రహస్యం. ఎజెండాలోని అంశాలపై చర్చ జరిపి సభ్యుల ఆమోదం మేరకే అజెండాలోని అంశాలను పాస్ చేయాలి. అయితే సభ్యులు మధ్య చర్చ లేకుండా,వారు చేతులెత్తి అజెండాలోని అంశాలను ఆమోదించకుండానే ఏకపక్షంగా సమావేశాన్ని నిర్వహించారు. ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ సమావేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని నడిపించారు. దీన్ని కమిషనర్ సహించలేదు. అక్కడ మొదలైన విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య విభేదాలకు ఆజ్యంపోసిన కారణాలు ఇవే! కార్పొరేషన్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలి. ఈ అంశాన్ని అజెండాలో పాస్ చేశారు. విగ్రహం ఏర్పాటుకు కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. వర్క్ ఆర్డర్ ఇవ్వకుండానే పనులు ప్రారంభించారు. దీనికి బిల్లులు ఇవ్వాలని మేయర్ సిఫార్సుచేస్తేఅనుమతి రానిదే బిల్లులు ఇవ్వలేమన్నారు. కార్పొరేషన్ మీటింగ్‌హాలులో కమిషనర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ చాంబర్‌ను కుదించారు. ఇదేంటని కమిషనర్ ప్రశ్నిస్తే ‘వాస్తుదోషమని’ చెప్పారు. పాలకవర్గం మారినప్పుడల్లా వాస్తుదోషం పేరుతో ఇలా వ్యవహరించడం సరికాదని కమిషనర్ చెప్పారు. నీటిసరఫరాకు 80 ట్యాంకర్లకు పాలకవర్గం ఆమోదించింది. కానీ 120 ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. దీనికి కమిషనర్ ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం వర్షాలు పడ్డాయని, కొన్నిచోట్ల బోర్లలో నీటిమట్టం కూడా పెరిగిందని, ఈ క్రమంలో ట్యాంకర్లను తగ్గించాలనుకుంటే ఇంకా పెంచడమేంటని కమిషనర్ ప్రశ్నిస్తున్నారు. మేయర్ పుదుచ్చేరి రిజిస్ట్రేషన్‌తో పార్చూనర్ కారు తెప్పించుకున్నారు. దీనికి మూన్నెళ్లుగా బాడుగ బిల్లు ఇవ్వడంలేదు. టెండర్ పిలవకుండా బిల్లు ఇచ్చే ప్రసక్తే లేదని కమిషనర్ చెబుతున్నారు. ఎమ్మెల్యేతో తమకు విభేదాలు తలెత్తేలా కమిషనర్ వ్యవహరిస్తున్నారని కూడా మేయర్ పేర్కొన్నారు. చిత్తూరు ఆడిటోరియానికి చిత్తూరు నాగయ్యపేరు, పొట్టిశ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే సత్యప్రభ సిఫార్సుచేస్తే దాన్ని పాలకవర్గం నిరాకరించింది. ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. తిరిగి చిత్తూరు నాగయ్యపేరు మహతి కళాక్షేత్రానికి పెట్టడంతోపాటు పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనిచేసిన అన్నిచోట్లా మంచిపేరు తెచ్చుకున్న కమిషనర్ ప్రతి అంశంలోనూ కమిషనర్ నిబంధనల మేరకే కార్పొరేషన్ నడవాలని, అందుకు భిన్నంగా ఎలాం టి నిర్ణయం తాను తీసుకోలేనని తెగేసి చెబుతున్నా రు. ఈ అంశంలో రాజేంద్రప్రసాద్ పనిచేసిన చోట ఎక్కడా? ఎప్పుడూ రాజీపడలేదనే మంచిపేరు ఉం ది. పైగా రాష్ట్రంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలు, నియమావళి తెలిసిన ఒకరిద్దరిలో ఈయన ఒకరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరికి ఏ సందేహం వచ్చినా రాజేంద్రప్రసాద్‌కు ఫోన్‌చేసి చర్చిస్తా రు. అందుకే ఈయనను రాష్ట్ర మునిసిపల్ కమిషనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. ప్రస్తుతం ఈయనే కొనసాగుతున్నారు. తనకున్న మంచిపేరు పోకూడదానే కారణంతో కమిషనర్ ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాల్లో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ కూడా కమిషనర్‌కు మద్దతుగా ఉన్నట్లు తెలిసింది. నిబంధనలకు అనుగుణంగానే నడచుకుంటా నిబంధనలకు అనుగుణంగానే నడచుకుంటాను. రాజకీయాలతో నాకు సంబంధం లేదు. కార్పొరేషన్లో ఏం జరుగుతోంది? నేనేంటి అనే విషయం అందరికీ తెలుసు. మేయర్ ఇచ్చిన లేఖపై నేను మాట్లాడదలచుకోలేదు. -రాజేంద్రప్రసాద్, కమిషనర్, చిత్తూరు నియంతలా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధి అండతో రాజేంద్రప్రసాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు. నేను, డెప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సూచిస్తున్న ప్రజా సమస్యలపై ఏమాత్రం స్పందించడంలేదు. నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. నియంతలా వ్యవహరిస్తున్నారు. నాకు,ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు వచ్చే విధంగా చిచ్చు పెడుతూ అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. -కఠారి అనురాధ, చిత్తూరు మేయర్ -
ముదురుతున్న వర్గపోరు
చిత్తూరు ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్ కఠారి అనురాధ మధ్య అంతర్గతపోరు తారస్థాయి కి చేరింది. కార్పొరేషన్ తొలి కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం బట్టబయలైంది. చిత్తూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ప్రతిపాదించిన ఆరు అంశాల్లో రెండింటికి మాత్రమే పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. నాలుగింటిని తిరస్కరించింది. దీనిపై ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉంది. చిత్తూరు అభివృద్ధి కోసం చంద్రబాబుతో ‘ఆమోదముద్ర’ వేసిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం ఎమ్మెల్యేను విస్మయానికి గురిచేసింది. సాక్షి, చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ మధ్య అంతర్గత విభేదాలు మరోసారి పొడచూపాయి. చిత్తూరు తొలి మేయర్‌గా కఠారి అనురాధ ఎన్నికైన తర్వాత తొలి పాలకమండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. చిత్తూరు నగర అభివృద్ధిపై మేయర్‌కు ఎంత బాధ్యత ఉందో ఎమ్మెల్యే సత్యప్రభకు అంతే ఉంది. ఈ క్రమంలో చిత్తూరు అభివృద్ధికి సంబంధించి ఆరు అంశాలను తీర్మానించాలని కౌన్సిల్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిలో మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు విగ్రహం ఏర్పాటు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి బస్టాండ్ సర్కిల్ వరకూ ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి దారికి ‘ఎన్టీఆర్ మార్గ్’ అని నామకరణం చేయాలనే ప్రతిపాదనలను మాత్రమే కౌన్సిల్ ఆమోదించింది. నాలుగు అంశాలపై ఎలాంటి చర్చ జరపకుండానే తిరస్కరించింది. ఇటీవల మేయర్ లేకుండా కమిషనర్‌తో కలిసి కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించినందుకు ఆమె ప్రతిపాదనల తిరస్కరణతో మేయర్ బదులు చెప్పినట్లయింది. తిరస్కరించిన అంశాలు ఇవే... * చిత్తూరు గంగినేని చెరువులో పార్కు ఏర్పాటు చేసి అందులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సత్యప్రభ సీఎం చంద్రబాబు వద్ద ప్రతిపాదించింది. దీనికి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపారు. 35లక్షల రూపాయలతో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. చిత్తూరులో కొత్తగా పార్కును ఏర్పాటు చేస్తున్నామని ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కూడా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. పాలకమండలి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. * కొంగారెడ్డిపల్లిలోని కమిషనర్ బంగ్లా సమీపంలో వృథాగా ఉన్న స్థలంలో 25.69 లక్షల రూపాయలతో పార్కు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి కౌన్సిల్లో ‘తిరస్కరణముద్ర’ పడింది. * ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని లక్ష్మీనగర్‌లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. * తెలుగుచలన చిత్ర రంగానికి విశేష సేవలందించిన జిల్లా వాసి చిత్తూరు నాగయ్య పేరును కళాక్షేత్రానికి పంపాలని ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు.