పదేళ్ల క్రితం సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై హత్యాయత్నం కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 2007 డిసెంబర్ 31న సీకే బాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని నిందితులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీకే బాబు గన్‌మెన్ సురేంద్ర మృతి చెందగా, సీకే బాబుకు, అతని అనుచరులకు గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన వన్‌టౌన్ పోలీసులు 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.