ck babu
-
సీకే వస్తే పార్టీలో ఉండలేం
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీలోకి వస్తే ఆ పార్టీలో ఉండలేమని మేయర్ హేమలత, ఆమె భర్త కటారి ప్రవీణ్ స్పష్టం చేశారు. శుక్రవారం గంగనపల్లెలోని తమ నివాసంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలతో మేయర్ దంపతులు సమావేశమయ్యారు. ప్రవీణ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు చివరి నిమిషం వరకు టీడీపీ కోసం పనిచేశారన్నారు. పార్టీ కోసం తీసుకున్న నిర్ణయాలతోనే ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందరం మనోహరన్న నామినేషన్‌కు వెళదాం.. వాళ్లు పార్టీలో చేరారంటే నడిరోడ్డునుంచే వచ్చేస్తా, నాతో రావడానికి మీరు సిద్దమా..?’ అని ప్రవీణ్ కార్పొరేటర్లను ప్రశ్నించగా సిద్ధమంటూ చేతులెత్తారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కంద, కిరణ్, వెంకట్, ఆనంద్, రాణి, అన్నపూర్ణ, కృపానందం, తిరుకుమరన్, శేషాద్రినాయుడు, యువరాజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సీకే బాబు పార్టీలోకి వస్తే కలుపుకుని పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్, ఎమ్మెల్సీ దొరబాబు పేర్కొనడం గమనార్హం. -
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
-
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
సాక్షి,చిత్తూరు: పదేళ్ల క్రితం సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై హత్యాయత్నం కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 2007 డిసెంబర్ 31న సీకే బాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని నిందితులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీకే బాబు గన్‌మెన్ సురేంద్ర మృతి చెందగా, సీకే బాబుకు, అతని అనుచరులకు గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన వన్‌టౌన్ పోలీసులు 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీకే బాబు సహా 81మంది సాక్షుల్ని పోలీసులు చేర్చగా, కోర్టు 51 మందిని విచారించి 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఇందులో ఏ-1 నిందితుడు, టీడీపీ నాయకుడు కటారి మోహన్ మృతిచెందగా, ఏ-2 నిందితుడైన చింటూకు కోర్టు జీవితఖైదును విధించింది. మేయర్ కటారి అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడుగా ఇప్పటికే వైఎస్ఆర్ కడప జిల్లా సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. -
సీకేబాబుపై హత్యాయత్నం కేసులో నేడు తీర్పు
చిత్తూరు (అర్బన్): పదేళ్ల క్రితం చిత్తూరులో అప్పటి మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. సీకే బాబు వెళుతున్న కారును లక్ష్యంగా చేసుకుని పట్టపగలు నడిరోడ్డు పై మందుపాతర పేల్చారు. ఒక పోలీసు కానిస్టేబుల్ (గన్‌మెన్) చనిపోగా.. సీకే త్రుటిలో బయటపడ్డారు. ఈ కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా ఉంటుందోనని చిత్తూరు వాసులు ఆసక్తిగా ఉన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల నుంచి నగరంలోని ప్రముఖులకు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. 2007 డిసెంబరు 31న అప్పటి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. సీకే.బాబు కట్టమంచిలోని తన నివాసం నుంచి గన్మెన్లు, అనుచరులతో వెళుతుండగా సాయిబాబా ఆలయం సమీపంలోని కల్వర్టు వద్ద మందుపాతర పేలింది. సీకే.బాబు గన్‌మెన్‌గా ఉన్న సురేంద్ర మృతి చెందాడు. సీకే.బాబుతో పాటు ఆయన అనుచరులు సైతం గాయపడ్డారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుల్లో టీడీపీ నాయకులు కఠారి మోహన్ (చనిపోయాడు), చింటూ, కఠారి ప్రవీణ్ (చిత్తూరు మేయర్ భర్త), జలగం మురళి, కిశోర్, గోపి, జ్యోతి, పురుషోత్తం, గిరిధర్‌రెడ్డి, ఏకాంబరం, డీఏ శ్రీనివాస్ (చిత్తూరు ఎమ్మెల్యే కొడుకు), వెంకటస్వామి, అర్జున్, రాజేష్, ఏడుకొండల యాదవ్, శ్రీను, వై.శ్రీనివాసులు, రవి ఉన్నారు. సీకే బాబుతో సహా మొత్తం 81 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. వారిలో 51 మందిని న్యాయమూర్తి కపర్తి విచారించి తీర్పును సోమవారానికి రిజర్వు చేశారు. కేసులో రెండో నిందితుడిగా ఉన్న చింటూ చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతను వైఎస్సార్ కడప సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. -
అదే హై డ్రామా..!
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని పూల మార్కెట్ విషయంలో నెలకొన్న వివాదంలో ఆదివారం కూడా నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. పూల మార్కెట్ వద్ద మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మళ్లీ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సీకే బాబు ఉంటున్న కట్టమంచికి ఆదివారం ఉదయం నుంచే పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూల మా ర్కెట్ వద్దకు వెళ్లేట్లయితే అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సీకే బాబు పలమనేరు రోడ్డులోని క్లబ్ వద్దకు చేరుకున్నారు. ఆయన్ను 50 మంది వరకు పోలీసులు వెంబడించారు. తనను ఎందుకు అనుసరిస్తున్నారని సీకేబాబు పోలీసులను ప్రశ్నించారు. తన వెంట రావద్దని సూచించారు. ఇక టీడీపీ నేతలు సైతం ఎమ్మెల్సీ దొరబాబు కార్యాలయం వద్ద సమాలోచనలు జరిపారు. అటు నుంచి ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని తదితరులు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకు ని నగర అభివృద్ధిపై కమిషనర్‌తో చర్చిం చారు. పూల మార్కెట్ విషయంలో వెన క్కు తగ్గకూడదని నిర్ణయం తీసుకున్నారు. పేదల కడుపుకొట్టొద్దు.. 11 గంటల ప్రాంతంలో సీకే బాబు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ డీఎస్పీ సుబ్బారావుతో మాట్లాడారు. పూల మార్కెట్‌ను అక్కడే ఉంచి పేదలకు న్యాయం చేయాలని కోరారు. అలా కానిపక్షంలో పాత బస్టాండులో తాత్కాలికంగా దుకాణాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సూచించారు. పేదల కడుపుకొట్టకుండా హుందాగా వ్యవహరిం చాలని కోరారు. దీనిపై స్పందించిన డీఎస్పీ మార్కెట్ తరలింపుపై నగరపాలక సంస్థ నిర్ణయం మేరకు మునిసిపల్ కమిషనర్ ఇక్కడ దుకాణాలు ఉంచకూడదని, పోలీసు బందోబస్తు కల్పించాలని తమకు లేఖ రాశారని తెలిపారు. ఇక్కడ దుకాణా లు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ పరిణామాలపై ప్రజాకోర్టులో తేల్చుకుంటామని చెప్పి సీకే బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 30 మందిపై కేసులు.. డీఎస్పీ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూల మార్కెట్ వద్ద జేసీబీ తీసుకొచ్చి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో సీకే బాబు సైతం ఉన్నారని పేర్కొన్నారు. అలాగే కార్తీక్, భాస్కర్, మణి, ప్రదీప్, సురేష్, రవి, షేరు, కార్పొరేటర్ చందు, అఫ్జల్ఖాన్, జీవరత్నం, అమీర్ అబ్బాస్, కిశోర్, శ్రీనివాస్ తదితరులను శనివారం రాత్రే అదుపులోకి తీసుకున్నామని చెప్పా రు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామన్నారు. వారికి 14 రోజుల రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరు జిల్లాకు జైలుకు తరలించారు. -
ఆయన మా పార్టీలో లేరు: వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్ : చిత్తూరు జిల్లాకు చెందిన సీకే బాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ పార్టీలో లేరని వైఎస్సార్ సీపీ తెలిపింది. పార్టీతో వారికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సీకే బాబు కుటుంబ సభ్యులు ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము వైఎస్సార్ సీపీలో ఉన్నామంటూ.. పార్టీ సీనియర్ నాయకులు, ఇతర నేతలను నిందించారు. ఇవన్నీ పార్టీ నాయకత్వం దృష్టికి రావడంతో సీకే బాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ పార్టీలో లేరన్న విషయాన్ని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
సీకే బాబుపై కాల్పుల కేసు కొట్టివేత
2007లో సీకే బాబు లక్ష్యంగా కాల్పులు గన్‌మెన్, ఉద్యోగి, దుండగుడు మృతి 57 మంది సాక్షుల్ని విచారించిన కోర్టు చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు లక్ష్యంగా చేసుకుని 2007లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసును చిత్తూరులోని 9వ జిల్లా అదనపు, సెషన్స్ న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీకే అంగరకక్షుడితో పాటు ఓ మున్సిపల్ ఉద్యోగి, ఆగంతకుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు పదేళ్ల పాటు విచారణ అనంతరం సోమవారం ఈ ఘటనపై న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. కేసు వివరాలు... 2007, ఫిబ్రవరి 9.. సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో ఉన్న క్లబ్‌కు వెళ్లడం సీకేకు అలవాటు. మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నా సీకే క్లబ్ వద్ద ఉన్న తన గదిలో అనుచరులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు. ఇంతలో తుపాకులతో వచ్చిన ఓ ఆగంతక ముఠా గది వద్ద ఉన్న గన్‌మెన్ (ఏఆర్ కానిస్టేబుల్) హుస్సేన్ భాషను తుపాకీతో కాల్పి చంపారు. అక్కడి నుంచి సీకే ఉన్న గదిలోకి వెళ్లారు. సీకే ఆయన అనుచరులు గడ్డాలతో ఉండటంతో లోపలికి వెళ్లిన దుండగులు ఎవర్ని కాల్పాలో తెలియక అందరిని గురిపెట్టారు. ఒక్క సారిగా కాల్పుల శబ్దం. కొంత మంది పరుగులు తీశారు. చిత్తూరు మునిసిపాలిటీలో పనిచేస్తున్న నావరసు అనే ఉద్యోగి దుండగుల తూటాకు బలయ్యాడు. ఆగంతకుల్లో ఓ వ్యక్తిని సీకే అంగరక్షకులు మట్టుపెట్టారు. కాలికి బుల్లెట్ తగిలి ఓ వ్యక్తి, మరి కొంత మంది పారిపోయారు. సీకే బాబు తృటిలో తప్పించుకున్నారు. వీళ్లపై కేసులు... 2005 లో అప్పటి కౌన్సిలర్, టీడీపీ నేత కటారి మోహన్‌పై జరిగిన హత్యాయత్నానికి ప్రతీకారంగా సీకేపై కాల్పులు జరిగాయని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా కటారి మోహన్, మోహన్ మేనల్లుడు చింటూ (మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు), సతీష్‌బాబు, పటాన్ సర్దార్, కటారి ప్రవీణ్ (కటారి మోహన్ కుమారుడు), శాంతకుమార్, అమర్నాద్, శశిధర్, ప్రకాష్, సతీష్, రాజ, వెంకటాచలపతి, జలగం మురళి, త్రివిక్రమ్, ఏకాంబరంలు ఈ కుట్రలో పాలు పంచుకున్నారంటూ అభియోగాలు మోపుతూ పోలీసులు కేసు నమోదు చేసి అందర్నీ అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుల్లో కటారి మోహన్, శాంతకుమార్ చనిపోయారు. కాల్పులు జరిగినప్పుడే రాజా అనే వ్యక్తి కాలికి బుల్లెట్గాయం తగలడంతో పారిపోగా.. అతని ఆచూకీ తెలియరాలేదు. మొత్తం 94 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. -
సీకే బాబుపై హత్యాయత్నం కేసు విచారణ ప్రారంభం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ప్రారంభమయింది. స్థానిక జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం సోమవారం కేసు విచారణ ప్రారంభించింది. డిసెంబర్ 19 వరకు కేసులోని సాక్షులను, నిందితులను విచారించనున్నారు. తొలి రోజు ఈ కేసులోని నిందితులు న్యాయస్థానం ఎదుట హాజరుకాగా, ముగ్గురు సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి విజయకుమార్ నమోదు చేశారు. ఈ కేసుకు విచారణ ప్రారంభమవడంతో కోర్టు ప్రాంగణంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇదీ కేసు... 2007 ఫిబ్రవరి 9వ తేదీన అప్పటి చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. చిత్తూరులో పలమనేరు రోడ్డులోని క్లబ్ వద్ద కొందరు ఓ కారులో వచ్చి సీకేను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. సీకే బాబు అంగరక్షకుడు హుస్సేన్‌భాషా, మునిసిపల్ ఉద్యోగి నావరసు మృతిచెందారు. గన్మన్లు జరిపిన కాల్పుల్లో హంతక ముఠాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి సైతం మృతి చెందాడు. సీకే బాబు త్రుటిలో తప్పించుకున్నారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అధికారులుగా వ్యవహరించిన సీఐలు మల్లికార్జున్, అల్లాబక్ష్, సుధాకరరెడ్డి, రవిమనోహర ఆచ్చారి, రాజగోపాల్ 16 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో టీడీపీ నాయకుడు కఠారి మోహన్, చింటూ, సురేష్‌బాబు, సర్దార్, గుర్తుతెలియని వ్యక్తి (చనిపోయిన దుండగుడు), కఠారి ప్రవీణ్‌కుమార్, శాంత కుమార్, అమర్నాథ్, శశిధర్, ప్రకాష్, సతీష్, రాజా, జీఎస్.వెంకటచలపతి, జలకం మురళి, త్రివిక్రమ్, ఏకాబరం ఉన్నారు. వీరిపై న్యాయస్థానంలో నేరాభియోగ పత్రాలను దాఖలు చేశారు. సీకే బాబుతో పాటు మొత్తం 94 మందిని సాక్షులుగా చేర్చారు. సాక్షుల విచారణ... సాక్షులుగా ఉన్న మాజీ కౌన్సిలర్ కేపీ శ్రీధర్, ప్రస్తుత కార్పొరేటర్ పులిచెర్ల శివప్రసాద్‌రెడ్డి న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం చెప్పారు. ఓ కేసులో రిమాండు ఖైదీగా ఉన్న కేపీ శ్రీధర్‌ను పోలీసులు పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరిచారు. హత్యాయత్నం జరిగినప్పటి విషయాలను శ్రీధర్, శివప్రసాద్‌రెడ్డి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.నిర్మల ద్వారా న్యాయస్థానానికి వివరించారు. కాగా వచ్చే నెల 19 వరకు జరిగే తొలి షెడ్యుల్ విచారణలో 94 మంది సాక్షులను వారికిచ్చిన తేదీల ప్రకారం ప్రతీ రోజు విచారించనున్నారు. -
సీకే బాబుపై హత్యాయత్నం కేసు కొట్టివేత
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై నగరంలోని గంగనపల్లెకు చెందిన చంద్రశేఖర్(చింటూ)పై కేసు కొట్టివేశారు. 2007లో చిత్తూరులో జరిగిన గంగజాతరలో సీకే బాబును హతమార్చడానికి కఠారి మోహన్ బావమరిది చింటూ కిరాయి వ్యక్తుల్ని ఏర్పాటు చేశాడని కర్ణాటక రాష్ట్రం పావుగడ పోలీసులు కేసు నమోదు చేశారు. చింటూతో పాటు మొత్తం పది మందిపై తుముకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సాక్ష్యాధారాలు నిరూపణ కాకపోవడంతో పావుగడ ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానం నిందితులపై కేసు కొట్టివేసింది. ఈ మేరకు శనివారం న్యాయమూర్తి మధుగిరి ఆదేశాలు జారీ చేశారు. -
‘పుర’ పాలకవర్గాల ఎన్నిక నేడే
పుంగనూరు, పలమనేరు, మదనపల్లె ‘పుర’పీఠాలు వైఎస్సార్సీపీకే చిత్తూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు టీడీపీకి ఉత్కంఠ రేపుతున్న నగరి ఎన్నిక కీలకం కానున్న స్వతంత్రులు,ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు మదనపల్లెలో వైఎస్సార్సీపీ అభ్యర్థులనుప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ చిత్తూరు కార్పొరేషన్లో నేటి ప్రమాణస్వీకారానికి వైఎస్సార్సీపీ గైర్హాజరు సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తోపాటు ఆరు మున్సిపాలిటీలకు గురువారం పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. నగరిలో పాలకవర్గం ఏర్పాటు ఉత్కంఠ రేపుతోంది. మదనపల్లెలో ఇద్దరు వైఎస్సార్సీపీ అభ్యర్థులను టీడీపీ ప్రలోభాలకులోను చేసి తమ క్యాంపునకు తరలించింది. ఈ స్థానంపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాంపునకు వెళ్లిన వారు కచ్చితంగా వైఎస్సార్సీపీ అభ్యర్థికే మద్దతు ప్రకటిస్తారని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థికి పడనున్నాయి. తద్వారా మదనపల్లె పీఠంపై కచ్చితంగా తమ పార్టీ అభ్యర్థినే అధ్యక్షునిగా కూర్చోబెడతామని ఆ పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు. చిత్తూరు తొలి మేయర్‌గా కఠారి అనురాధ చిత్తూరు కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ 50 డివిజన్లు ఉన్నాయి. టీడీపీ 33 స్థానాల్లో గెలుపొందింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. 13 మంది స్వతంత్రులు గెలుపొందారు. వీరిలో 8 మంది మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు సంబంధించిన వారు. దీంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల సంఖ్య 12కు చేరింది. తక్కిన ఐదుగురు స్వతంత్రులు టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగారు. వీరి మద్దతు టీడీపీకే! దీంతో 38 మంది కార్పొరేటర్లు టీడీపీ తరఫున ఉండడంతో కఠారి అనురాధాను చిత్తూరు తొలిమేయర్‌గా ఎన్నుకోనున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నేటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. మరో రోజు వీరు ప్రమాణస్వీకారం చేయనున్నారు. పుంగనూరు వైఎస్సార్సీపీ వశం పుంగనూరులో 24 వార్డులు ఉన్నాయి. 17వార్డుల్లో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. 7చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ పార్టీ తరఫున షమీమ్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కానున్నారు. మదనపల్లెలో ఉత్కంఠ ఈ మున్సిపాలిటీ బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ 35 వార్డుల్లో వైఎస్సార్సీపీ 17, టీడీపీ 15 స్థానాలు దక్కించుకున్నాయి. ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. ఎమ్మె ల్యే, ఎంపీ ఓట్లు వైఎస్సార్సీపీకి మరింత మె జార్టీని కట్టబెట్టనున్నాయి. టీడీపీ నాయకులు ఇద్దరు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసి తమ క్యాంపునకు తరలించారు. ముగ్గురు స్వతంత్రులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రకారం ఎన్నిక జరిగితే 20 మంది కౌన్సిలర్లతో టీడీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. టీడీపీ తరఫున కొడవలి శివప్రసాద్ చైర్మన్ అభ్యర్థి. టీడీపీ క్యాంపులోని వైఎస్సార్సీపీ అభ్యర్థులు కచ్చితంగా తాము ఎన్నికైన పార్టీకే అండగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వీరు వైఎస్సార్పీపీ వైపు నిలిస్తే ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయి. ఈ లెక్కన 19 మంది కౌన్సిలర్లతో వైఎస్సార్సీపీ పురపీఠాన్ని కైవసం చేసుకునే అవకాశముంది. షమీమ్ అస్లం చైర్‌పర్సన్‌గా ఎన్నికకానున్నారు. తమ్ముళ్లకే శ్రీకాళహస్తి .. శ్రీకాళహస్తి ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ 35 వార్డుల్లో 18 టీడీపీ, 11 వైఎస్సార్సీపీ దక్కించుకున్నాయి. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. నలుగురు కాంగ్రెస్ తరఫున గెలిచారు. అధిక స్థానాలు దక్కించుకున్న టీడీపీ తరఫున పేట రాధారెడ్డి(బీసీ) చైర్మన్‌గా ఎన్నికకానున్నారు. నగరిలో నువ్వానేనా నగరి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ 27 వార్డులుంటే 11 వైఎస్సార్సీపీ, 13 టీడీపీ కి దక్కాయి. ముగ్గురు స్వతంత్రులు గెలుపొం దారు. వీరిలో ఒకరు టీడీపీ గూటికి చేరితే త క్కిన ఇద్దరు వైఎస్సార్సీపీకి అండగా నిలిచా రు. ఇక్కడ ఎంపీ ఓటు టీడీపీకి, ఎమ్మెల్యే ఓటు వైఎస్సార్సీపీకి ఉన్నాయి. దీంతో వైఎస్సార్సీపీ బలం 14కు చేరితే, టీడీపీ 15కు చేరనుంది. ఈ లెక్కన చైర్మన్ పీఠం టీడీపీ వశం అవుతుంది. చైర్మన్ గిరి కోసం ఇక్కడ చెండామరై, రేవతి నువ్వానే నా అని పోటీపడుతున్నారు. చెండామరైకి అనుకూలంగా ‘గాలి’ నిర్ణయం తీసుకోన్నుట్లు తెలిసింది. ఇదే జరిగితే రేవతి వర్గంలోని ఒకరిద్దరు కౌన్సిలర్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే చైర్మన్ స్థానాన్ని తాము దక్కించుకుంటామని వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి శాంతి. పుత్తూరు పీఠం టీడీపీకే పుత్తూరులో 24 వార్డులకు టీడీపీ 13, వైఎస్సార్సీపీ 11 స్థానాలు దక్కించుకున్నాయి. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుంది. యుగంధర్, కరుణాకర్ చైర్మన్ కోసం పోటీపడుతున్నారు. -
చిత్తూరులో ఉద్రిక్తత
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సీకే బాబు ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు. ఎన్నికల పరిశీలకుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే తనిఖీలు నిర్వహించామని అధికారులు అధికారులు చెప్పారు. తనిఖీలు నిర్వహించినట్లు తనకు సర్టిఫికెట్ ఇవ్వాలని సీకే బాబు డిమాండ్ చేశారు. తనిఖీల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో సికె బాబు ఇంటికి చేరుకున్నారు. దాంతో చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం: సీకే బాబు
చిత్తూరు: మహాప్రస్థానం ముగింపు రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉంది అని చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. చిత్తూరులో సాక్షి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే మా ధ్యేయం సీకే బాబు అని అన్నారు. వైఎస్ జగన్ నిరంతం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకున్నారని ఆయన అన్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని సీకే బాబు తెలిపారు. సీకే బాబుగా సుపరిచితులైన సీకే జయచంద్రారెడ్డి తొలుత చిత్తూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఆతర్వాత 1994, 1999, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. -
వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు!
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీకే బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు సన్నిహితుడైన సీకే బాబుకు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. చిత్తూరు ఎమ్మెల్యేగా సీకే బాబు ఉన్నారు. సీకే బాబుగా సుపరిచితులైన సీకే జయచంద్రారెడ్డి తొలుత చిత్తూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఆతర్వాత 1994, 1999, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు చేరువతాయని సీకే బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇరు ప్రాంతాల అభివృద్ది వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని సీకే బాబు తెలిపారు. -
పదవులను వీడి ఉద్యమంలోకి రండి
తిరుపతి కార్పొరేషన్,న్యూస్‌లైన్: ‘మీ పదవులు, పార్టీలను పక్కన పెట్టండి. సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యమించండి’ అని చిత్తూరు ఎమ్మెల్యే, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ సీకే బాబు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సీకే బాబు చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం తిరుపతికి చేరుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీకేబాబు మాట్లాడారు. సీమాంధ్రలో చేస్తున్న ఉద్యమం ఏ ఒక్కరి బలవంతం మీద చేస్తున్నది కాదన్నారు. ‘మీ వెంట మేముంటాం, మీరు ముందుండి ఉద్యమాన్ని నడిపించాలని’ ప్రజలు రోడ్లపైకొచ్చి కోరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎంతో మంది మేధావులైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ విభజనను అడ్డుకోకుండా మౌనంగా ఉండడం సరికాదని హితవుపలికారు. గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని శాంతియుతంగా నడపాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నిరంకుశమైన దొరలరాజ్యం నడుస్తోందని, అందుకే సీమాంధ్ర వారిని రెచ్చగొట్టేలా వాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎల్.వర్మ, ఐఎన్టీయూసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మబ్బు చెంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్‌కుమార్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. సీకేకు ఘన స్వాగతం: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టిన సీకేబాబు శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. టౌన్‌క్లబ్ వద్ద సీకేకు ఐఎన్టీయూసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మబ్బు చెంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అమాస రాజశేఖర్‌రెడ్డి, తిరుపతి అధ్యక్షులు నాగభూషణం, నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మబ్బు దేవనారాయణరెడ్డి ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా మబ్బు యువసేన నాయకులు, సమైక్యవాదులు 2వేల మందికి పైగా పూలు చల్లుతూ, టపాకాయలు పేల్చుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అంతకు ముందు టౌన్‌క్లబ్ వద్ద ఏపీఎన్జీవోలు, నాలుగు కాళ్లమండపం వద్ద కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలు, మున్సిపల్ కార్పొరేషన్ వద్ద సాప్స్ నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు సీకే బాబు సంఘీభావం తెలిపారు. -
సమైక్యాంద్రని కోరుతూ సికె బాబు పాదయాత్ర
-
'కెసిఆర్‌పై హత్యాయత్న ఆరోపణలు హాస్యాస్పదం'
-
'కేసీఆర్‌పై హత్యాయాత్నమా, హాస్యాస్పదం'
చిత్తూరు : కెసిఆర్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందంటూ టిఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవని విశాలాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ అన్నారు. తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్న టిఆర్ఎస్ నేతలు ఆ ఆధారాల్ని పోలీసులకు సమర్పించి కేసు పెట్టడంలేదెందుకని ఆయన ప్రశ్నించారు. తెలుగువారి సమైక్యతను కోరుకుంటూ మహాసభ నిర్వహించి ఆరు నెలలు కాకముందే రాష్ట్ర విభజన చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేయడం దారుణమని పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన పరకాల చిత్తూరులో ఆగి నిరాహారదీక్ష విరమించిన ఎమ్మెల్యే సికె బాబును పరామర్శించారు. -
క్షీణించిన సికె బాబు ఆరోగ్యం