
సికె బాబు
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సీకే బాబు ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు.
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సీకే బాబు ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు. ఎన్నికల పరిశీలకుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే తనిఖీలు నిర్వహించామని అధికారులు అధికారులు చెప్పారు.
తనిఖీలు నిర్వహించినట్లు తనకు సర్టిఫికెట్ ఇవ్వాలని సీకే బాబు డిమాండ్ చేశారు. తనిఖీల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో సికె బాబు ఇంటికి చేరుకున్నారు. దాంతో చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.