
సీకే బాబుపై హత్యాయత్నం కేసు కొట్టివేత
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై నగరంలోని గంగనపల్లెకు చెందిన చంద్రశేఖర్(చింటూ)పై కేసు కొట్టివేశారు. 2007లో చిత్తూరులో జరిగిన గంగజాతరలో సీకే బాబును హతమార్చడానికి కఠారి మోహన్ బావమరిది చింటూ కిరాయి వ్యక్తుల్ని ఏర్పాటు చేశాడని కర్ణాటక రాష్ట్రం పావుగడ పోలీసులు కేసు నమోదు చేశారు.
చింటూతో పాటు మొత్తం పది మందిపై తుముకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సాక్ష్యాధారాలు నిరూపణ కాకపోవడంతో పావుగడ ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానం నిందితులపై కేసు కొట్టివేసింది. ఈ మేరకు శనివారం న్యాయమూర్తి మధుగిరి ఆదేశాలు జారీ చేశారు.