attempt to murder case
-
లక్షద్వీప్ ఎంపీకి పదేళ్ల ఖైదు
కవరాట్టి: హత్యాయత్నం కేసులో లక్ష ద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహమ్మద్ ఫైజల్ సహా నలుగురికి జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి కె.అనిల్‌కుమార్ తీర్పు చెప్పారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి ఫైజల్ మరో ముగ్గురు ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. రాజకీయ కక్షలతోనే సాలిహ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని, అయితే అందులో వారు విఫలమయ్యారని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఎంపీ ఫైజల్ సహా దోషులు నలుగురిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ తీర్పుతో ఫైజల్ రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్సీపీకి చెందిన నేత ఫైజల్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసు రాజకీయ దురద్దేశంతో కూడుకున్నదని ఫైజల్ ఆరోపించారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తున్నట్టు చెప్పారు. 2009లో ఫైజల్ మరి కొంత మందితో కలిసి పదునైన ఆయుధాలతో సాలిహ్‌పై దాడి చేశారు. కత్తులు, కటారులు, కర్రలు, ఐరన్ రాడ్లతో కలిసి అతనిని వెంబడించి కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాలిహ్‌ని ప్రత్యేక హెలికాప్టర్లో ఎర్నాకులం ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలు నిలపగలిగారు. -
43 ఏళ్లు జైలులో మగ్గి ‘నిర్దోషి’గా విడుదల
పాట్నా: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ వ్యక్తి 43 ఏళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. 10 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లి 53 ఏళ్ల వయసులో నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ సంఘటన బిహార్‌లోని బక్సర్ జిల్లాలో జరిగింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేస్తూ బాక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు కొట్టి వేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఇంతకి ఏం జరిగిందంటే? జిల్లాలోని మురార్ పోలీస్ స్టేషన్ పరిధి చౌగాయి గ్రామంలో ఓ దుకాణదారుడిపై 1979, సెప్టెంబర్‌లో హత్యాయత్నం జరిగింది. పలువురు దుండగులు తనను హత్య చేసేందుకు దాడి చేశారని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అందులో మున్నా సింగ్ అనే 10 ఏళ్ల బాలుడిపైనా ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బాలుడిని సెక్షన్ 148, 307ల కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ పెండింగ్‌లో పడిపోయింది. 2012 నుంచి ఈ కేసును బక్సర్ జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు విచారిస్తోంది. జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ రాజేశ్ సింగ్ ఈ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాలని పలుమార్లు ఫిర్యాదుదారుకు నోటిసులు పంపించారు. అయితే, ఏ ఒక్కరూ సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మున్నా సింగ్‌ను నిర్దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పింది జిల్లా కోర్టు. ప్రస్తుతం మున్నా సింగ్ వయసు 53 ఏళ్లు. తనను నిర్దోషిగా వదిలిపెట్టినందుకు సంతోషం వ్యక్తం చేసిన సింగ్.. దశాబ్దాల పాటు కేసును పెండింగ్‌లో పెట్టటంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి: గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్.. వీడియో వైరల్ -
కుట్రకోణం ఛేదించే దిశగా..
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రకోణం ఛేదించే దిశగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇటీవలే నిందితుడు బడుగు నాగేశ్వరరావును రెండ్రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు. అలాగే పలువురు టీడీపీ నేతలకు నోటీసులిచ్చి వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ మృతి చెందినప్పటి నుంచి నిందితుడు మంత్రి ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు చెబుతున్నారు. మంత్రి తన తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో, ఆ తర్వాత ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అవకాశం కోసం ఎదురుచూసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటన తర్వాత ఏం చెప్పాలి అనేది నాగేశ్వరరావును పురిగొల్పిన వారే అతనికి తర్ఫీదు ఇచ్చి ఉంటారని, అందుకే ఎన్నిసార్లు ప్రశ్నించినా సరిగా బదులిచ్చేవాడు కాదని పోలీసులంటున్నారు. ఈ ఘటనకు ముందు మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితులతో నాగేశ్వరరావు మాట్లాడినట్లు గుర్తించిన పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. కొల్లు తీరుపై పోలీసుల ఆగ్రహం సీఆర్పీసీ సెక్షన్ 91 కింద ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పకపోగా తప్పించుకునే ధోరణిలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర వ్యవహరిస్తున్న తీరుపై పోలీసులు మండిపడుతున్నారు. మాజీ మంత్రిని వెనకేసుకొస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కేసు విషయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పెడితే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డీఎస్పీ రమేష్‌రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో భాగంగానే కొల్లుకు నోటీసులు ఇచ్చామని, అందులో తమకెలాంటి దురుద్దేశాలు లేవని తెలిపారు. ఈ కేసులో కుట్రకోణం దాగి ఉందని, ఇసుక కొరతతో పనుల్లేక పోవడం అనేది సాకు మాత్రమేనని ఎస్పీ ఎం.రవీంద్రబాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి విచారణకు సహకరించకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. నిందితుడు టీడీపీ కార్యకర్తే.. నిందితుడు నాగేశ్వరరావుకు సంబంధించి పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులకు సన్నిహితుడని పోలీసులు గుర్తించారు. ► టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బడుగు ఉమాదేవికి నిందితుడు స్వయానా సోదరుడు. ► మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను పోలీసులు విచారించిన సమయంలో ఆయనకు మద్దతుగా నాగేశ్వరరావు కూడా స్టేషన్ వద్దకు వచ్చాడు. ► రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కొల్లు విడుదలైనప్పుడు స్వాగతం పలికిన వారిలో నిందితుడు ఉన్నాడు. మచిలీపట్నంలో కొల్లుకు స్వాగత ర్యాలీలో కూడా పాల్గొన్నాడు. ► స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ నేతలు నామినేషన్ వేసిన సమయంలో నాగేశ్వరరావు వారితో ఉన్నాడు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కొల్లుకు మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. -
కొండయ్యపై హత్యాయత్నానికి కారణం అదే..
ఒంగోలు: కందుకూరు పట్టణంలో ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన చదలవాడ కొండయ్యపై జరిగిన హత్యాయత్నం కేసుకు కారణం పాత వివాదాలేనని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. కొండయ్య కేసులో పోలీసులకు తొలుత ఎటువంటి ఆధారాలు లభించలేదు. జేడీబీఎం చర్చి ఎదురుగా ఉన్న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ షాపులో ఉన్న కొండయ్యపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడిలో కొండయ్యకు ఏకంగా 42 కుట్లు పడ్డాయి. లాక్డౌన్ డ్యూటీలో ఉన్నా డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్ఐలు రెండు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో లభించిన సీసీ పుటేజీ ఆధారంగా నిందితులు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇందుకు టెక్నికల్ సపోర్టు తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో చింతం రూప్‌కుమార్ అలియాస్ రూప్ (కావలి వైకుంఠపురం), నాదెండ్ల భాస్కర్(కావలి మద్దూరుపాడు). వీరు పూర్తి నేరస్వభావం ఉన్న వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో వ్యక్తి కొండూరి రామస్వామి అలియాస్ రాము కూడా చిన్న చిన్న వివాదాల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులు ఉపయోగించిన ఇనుప రాడ్డు, హీరో గ్లామర్ మోటారు సైకిల్, 4 సెల్ఫోన్లతో పాటు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి పులుకూరి సుజయ్‌కు చెందిన ప్యాంటు, బెల్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు కథ వెలుగులోకి.. కందుకూరు పట్టణంలోని జేడీబీఎం టౌన్ చర్చి నిర్వహణ విషయంలో 2015లో ఎన్నికలు జరిగాయి. దీని అనంతరం సభ్యుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పులుకూరి సుజయ్ ఒక గ్రూపుగా, చదలవాడ కొండయ్య మరో గ్రూపుగా విడిపోయారు. 2016లో పెద్ద మనుషుల సమక్షంలో రెండు కమిటీలు విడివిడిగా ప్రార్థనలు చేసుకునేలా చర్చలు జరిగాయి. 2020 ఫిబ్రవరి 20న జేడీఎం టౌన్ చర్చి వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ వివాదం జరిగింది. ఈ క్రమంలో చర్చి కార్యదర్శి పులుకూరి కొండయ్య.. రెండో వర్గానికి చెందిన సుజయ్ వర్గంలోని మహిళలను చర్చి నుంచి బయటకు పంపాడు. దానిపై కక్ష కట్టిన సుజయ్.. ఎలాగైనా కొండయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కందుకూరుకు చెందిన తాటిపర్తి అశోక్‌కుమార్, దరిమడుగు శ్రీరాం, చనమల బాలాజీ అలియాస్ బాలు అనే వ్యక్తులతో కలిసి వారి ద్వారా కావలికి చెందిన చింతం రూప్‌కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్‌తో రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ప్రాథమికంగా సుజయ్ నుంచి అశోక్‌కుమార్ రూ.50 వేలు తీసుకుని మిగిలిన మొత్తం పని పూర్తి అయిన తర్వాత తీసుకునేందుకు అంగీకరించాడు. తాను తీసుకున్న మొత్తంలో రూ.4 వేలు అశోక్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని చనుమల బాలాజీ, దరిమడుగు శ్రీరాంలకు ఇచ్చాడు. వారు చెరో రూ.3 వేలు తీసుకుని మిగిలిన రూ.40 వేలను కందుకూరులోని మెర్సీ స్కూల్ వద్ద చింతం రూప్‌కుమార్, కొండూరి రామస్వామి, నాదెండ్ల భాస్కర్లకు అందించారు. అనంతరం ఫిబ్రవరి 29న ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉన్న కొండయ్యపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో ఆయన అపస్మార్థక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం రూప్‌కుమార్ తన వద్ద ఉన్న రూ.40 వేలలో రామస్వామికి రూ.10 వేలు, నాదెండ్ల భాస్కర్‌కు రూ.6 వేలు ఇచ్చి మిగితాది రూప్‌కుమార్ ఉంచుకున్నాడని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వివరించారు. ఒక వైపు కోవిడ్ విధుల్లో పాల్గొంటూనే మరోవైపు హత్యాయత్నం కేసును ఛేదించిన కందుకూరు డీఎస్పీ కె.శ్రీనివాసరావు, సీఐ ఎం.విజయ్‌కుమార్, టౌన్ ఎస్ఐ కేకే తిరుపతిరావు, హెడ్ కానిస్టేబుల్ ఎంఎం బేగ్, కానిస్టేబుళ్లు జి.దయానంద్, హరిబాబు, వీవీ లక్ష్మణస్వామి, ఎస్కే బాషా, ఎస్కే ముక్తార్‌బాషా, టి.ఆనంద్‌ను ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందించారు. -
పెట్రోల్ పోసి హత్యకు యత్నం
జిన్నారం (పటాన్చెరు): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడానికి కారణమైన వారిపై పెట్రోల్ పోసి హత్య చేసేందుకు యత్నించాడు ఓ తండ్రి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో ఆదివారం జరిగింది. గుమ్మడిదల ఎస్ఐ రాజేశ్‌నాయక్ కథనం ప్రకారం.. రాంరెడ్డిబావి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, సుశీల దంపతులకు నవీన్‌రెడ్డి, మమత ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 17న అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె ప్రవళిక, నవీన్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుని అమీన్పూర్లో కాపురం పెట్టారు. ఇదిలా ఉండగా నవీన్‌రెడ్డి తల్లి సుశీల వీరికి వివాహం చేసేందుకు సహకరించిందని శ్రీనివాస్‌రెడ్డి పగను పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సుశీల ఆమె కుమార్తె మమతలు ఇంట్లో ఉండగా శ్రీనివాస్‌రెడ్డి దంపతులు సుశీల ఇంటికి వచ్చి వారితో గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన శ్రీనివాస్‌రెడ్డి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సుశీల కుమార్తె మమతకు 35 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మమత తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు
బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్‌కు షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్యకర్తల మీద హత్యాయత్నం చేశారంటూ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్ జిల్లాలోని చన్నరాయపట్న పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జేడీఎస్ నుంచి బీజేపీలోకి మారిన కార్యకర్తల ఇళ్లపై దాదాపు 150–200 మంది వచ్చి దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన తమ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సరైన సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత చేజారేదని అన్నారు. దీంతో సూరజ్ సహా ఆరు మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్ ఖండించింది. -
ప్రేమించిందని కుమార్తె హత్యకు కుట్ర
చెన్నై, తిరువొత్తియూరు: ప్రేమించిందన్న కోపంతో కన్న కూతురి ప్రాణాలు తీసేందుంకు తల్లిదండ్రులు ప్రయత్నించిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తేని జిల్లా చిన్నమనూర్ సమీపం ఊత్తుపట్టికి చెందిన రాజా (46). అతని భార్య కవిత (43). వీరికి 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె బోడిలో ఉన్న ప్రైవేటు కళాశాలలో బీఏ చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థిని తన అక్క తరపు బంధువు ఒకరిని ప్రేమిస్తున్నట్టు తెలిసింది. దీనికి తల్లి దండ్రులు వ్యతిరేకించారు. బుధవారం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను బైకులో మర్కయన్‌కోట ముల్లై పెరియార్ వంతెన వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ కుమార్తెను చదువుకుంటున్న సమయంలో ప్రేమ వ్యవహారాలు ఎందుకంటూ నచ్చజెప్పారు. అయినా వినకపోవడంతో రాజా కుమార్తెపై దాడి చేసి ముల్లై పెరియార్ నదిలో తోసి అక్కడి నుంచి పారిపోయారు. నీటిలో పడిన ఆమె కాపాడాలంటూ కేకలు వేయడంతో ఆ మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్లు ఆమెను రక్షించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న చిన్నమనూర్ పోలీసు కేసు నమోదు చేసి విద్యార్థిని తల్లిదండ్రులు రాజా, కవితను గురువారం అరెస్టు చేశారు. -
మూత్ర విసర్జన చేస్తుండగా హత్యాయత్నం
కర్నూలు ,కల్లూరు : ఉలిందకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుసులూరు–రేవడూరు గ్రామాల మధ్య ఆదివారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుసులూరు గ్రామానికి చెందిన మాల మౌలాలి తన స్నేహితుడితో కలిసి వెల్దుర్తికి వెళ్లి తిరిగొస్తూ రేమడూరు–పుసులూరు మధ్య మూత్ర విసర్జనకు నిలిచారు. మౌలాలి మూత్ర విసర్జన చేస్తుండగా రేమడూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాగంటయ్య పాత కక్షలు మనసులో పెట్టుకుని ఆటోతో ఢీ కొట్టాడు. అతను ఎగిరి కిందపడ్డాడు. పక్కనే ఉన్న మౌలాలి స్నేహితుడు ఆటోను కొద్దిదూరం వెంబడించాడు. అయితే.. అతను దొరకలేదు. గాయపడిన మౌలాలిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ శంకరయ్య ఆసుపత్రి దగ్గరకు చేరుకుని బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. -
మోదీ హత్యకు కుట్ర: యువకుడు అరెస్టు
టీ.నగర్: రాజీవ్‌గాంధీ తరహాలో మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరిపి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. అందులో రాజీవ్‌గాంధీని హత్య చేసిన విధంగా మోదీని హతమార్చనున్నట్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారని తెలిపి ఫోన్ కట్ చేశాడు. దీంతో పోలీసులు వచ్చిన నంబరు ఆధారంగా విచారణ జరిపారు. చెన్నై తిరువాన్మియూర్ నుంచి ఆ వ్యక్తి కాల్ చేసినట్లు కనుగొన్నారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తిరునావుక్కరసును అరెస్టు చేశారు. -
కన్న కూతురి హత్యకు తల్లి యత్నం
భాగ్యనగర్‌కాలనీ: కన్న కూతురినే బస్సు కిందకు తోసేందుకు యత్నించిన .ఓ తల్లికి స్థానికులు దేహ శుద్ధిచేసి కూకట్పల్లి పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే బోయినపల్లికి చెందిన సోని తన కుమార్తె శిరీష(2)తో కలిసి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తన భర్త రెండవ వివాహం చేసుకోవడంతో కుమార్తె పోషణ భారమై ఆమెను వదిలించుకునేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలో మంగళవారం భాగ్యనగర్‌కాలనీలో ఆర్టీసీ బస్సు కిందకు తోసేందుకు యత్నించగా, అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేయటంతో ప్రమాదం తప్పింది. అంతటితో ఆగకుండా చిన్నారిని రోడ్డుపైకి విసరటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గుర్తించిన స్థానికులు ఆమెను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీ, కూతురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిన్నారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
మాజీ ప్రియురాలిపై లైంగికదాడి.. హత్యాయత్నం
బంజారాహిల్స్: భర్త ఇంట్లో లేని సమయంలో మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి యత్నించగా అడ్డుకుందన్న కోపంతో కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బంబారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బసవతారకం నగర్ బస్తీకి చెందిన షేక్ జబ్బర్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య నసీంభాను గృహిణి. వీరికి ఒక కుమారుడు కాగా, ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భవతి. పెళ్లికి ముందు ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఆసిఫ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తరచూ భర్త లేని సమయంలో అతను ఇంటికి వచ్చేవాడు. అయితే గత కొద్ది రోజులుగా ఆసిఫ్‌ను ఇంటికి రావద్దని వారించిన నసీంభాను అతడిని దూరం పెడుతోంది. సోమవారం రాత్రి ఆసీఫ్ ఆమె ఇంటికి రాగా తనను ఇబ్బంది పెట్టవద్దని, ఇకపై ఇంటికి రావద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆసీఫ్ పథకం ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేయడంతో నసీంబాను కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమె సోదరుడు సద్దాంకు సమాచారం అందించడంతో అతను తన బావ జబ్బార్‌తో కలిసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితురాలి భర్త జబ్బార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆసిఫ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎస్ఐ రవిరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కదులుతున్న కారు నుంచి భార్యను తోసి..
అన్నానగర్: కోవై సమీపంలో కదులుతున్నకారు నుండి భార్యని తోసివేసి హత్య చేయటానికి యత్నించిన భర్త వీడియో వాట్సాప్‌లో హల్చల్ చేస్తోంది. కోవై సమీపంలోని తుడియలూరు తొప్పంపట్టి గణపతి గార్డెన్ ప్రాంతానికి చెందిన ఆర్తీ(38). ఆమె భర్త అరుణ్‌జో అమల్‌రాజ్ ఒక ప్రైవేటు ఉద్యోగి. వీరికి 2008లో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనంతరం భార్యభర్తల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడి 2014వ సంవత్సరంలో ఆర్తి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. అనంతరం అరుణ్‌జో అమల్‌రాజ్ భార్యతో రాజీపడి భార్య, పిల్లలను ఇంటికి పిలుచుకుని వచ్చాడు. తర్వాత వారు కుటుంబంతో గత మే నెల 9వ తేదీ ఊటీ పర్యటనకు కారులో బయలుదేరారు. అప్పుడు దంపతుల మధ్య హఠాత్తుగా వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆవేశంలో అరుణ్‌జో అమల్‌రాజ్ ఆర్తీని కారు నుంచి తోసివేసి హత్య చేయటానికి ప్రయత్నించాడు. ఈ వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. సంఘటన గురించి తుడియలూరు పోలీసుస్టేషన్లో ఆర్తీ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
పెళ్లి ఇష్టం లేకే..
అమీర్‌పేట: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై కత్తులతో దాడికి పాల్పడిన ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇంతియాజ్‌తో పెళ్లి జరగడం ఇష్టంలేని ఫాతిమా సోదరులు స్నేహితులతో కలిసి పథకం ప్రకారమే వారిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఆదివారం ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న వివరాలు వెళ్లడించారు.సంగారెడ్డి జిల్లా, సదాశివపేటకు చెందిన షేక్ రహమతుల్లా కుమారుడు షేక్ ఇంతియాజ్ బోరబండలో ఉంటూ నాంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న తమ దూరపు బంధువు సయ్యద్ మోసిన్ అలీ కుటుంబంతో ఇంతియాజ్ చనువుగా ఉండే వాడు. ఈ క్రమంలో సయ్యద్ అలీ కుమార్తె సయ్యద్ జైన్ ఫాతిమాతో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు ఈ నెల 5న ఎవరికీ తెలియకుండా సదాశివపేటలోని ఓ దర్గాలో వివాహం చేసుకున్నారు. ఇదే రోజు ఫాతిమా తండ్రి ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫాతిమా సదాశివపేటలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం ఆమెను ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చింది. 6వ తేదీ రాత్రి ఫాతిమాను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇంతియాజ్ హత్యకు పథకం సయ్యద్ అలీ కుటుంబంతో చనువుగా ఉండే ఇంతియాజ్ ఫాతిమాను చెల్లి అని పిలుస్తుండటంతో వారు అతడిని పూర్తిగా నమ్మారు. అయితే అతనే ఫాతిమాను తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ప్రధానంగా ఫాతిమా సోదరుడు ఫారూక్ అలీ ఎలాగైన ఇంతియాజ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సమీప బంధువు తో ఇంతియాజ్‌కు ఫోన్ చేయించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఒప్పంద పత్రాలు రాసుకుని ఫాతిమాను తీసుకెళ్లాలని నమ్మించాడు. దీంతో ఇంతియాజ్ తల్లిదండ్రులతో కలిసి 7న నేరుగా ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌కు రాగా పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సింగ్ ఇచ్చి పంపారు. ఫాతిమాతో కలిసి ఇంతియాజ్ కారులో సంగారెడ్డికి వెళుతుండగా ఫారూక్ అలీ, అతడి ముగ్గురు సోదరులు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు ఆటోల్లో కారును వెంబడించారు. ఎస్ఆర్నగర్ ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో కారును అడ్డగించి ఇంతియాజ్‌పై కత్తులతో దాడికి పాల్పడారు. తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ మృతి చెందాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు.ఈ దాడిలో ఇద్దరు మహిళలు సహా 8 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు ఫారూక్ అలీతో పాటు కుటుంబ సభ్యులు మోసిన్ అలీ, మొహమ్మద్ అలీ, అహ్మద్ అలీ, జకీరా బేగం, జెబా ఫాతిమాలను అరెస్టు చేశారు. రెండు ఆటోలు, 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఫారూక్ స్నేహితులైన రబ్బాని, షేకీల్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.రబ్బాని సనత్‌నగర్‌లో జరిగిన ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటికి వచ్చినట్లు డీసీపీ వివరించారు. పట్టపగలు బహిరంగ ప్రదేశంలో కత్తులతో దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అవసరమైతే నిందితుల్లో కొందరిపై పీడియాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజేయ్‌కుమార్,ఎస్సై సాయినాథ్ పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై పొరుగింటి మహిళ..
మదనపల్లె టౌన్ : అనవసరంగా నోరు పారేసుకుంటోందని ఓ వృద్ధురాలిపై పొరుగింటి మహిళ రోకలిబండతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తంబళ్లపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు, తంబళ్లపల్లె పోలీసుల కథనం..కోటకొండకు చెందిన తంగిళ్ల లక్షుమన్న భార్య ఈశ్వరమ్మ(80) ఇంటిముందే కొళాయి ఉంది. వీధుల్లో ఉన్న వాళ్లు ఆ కొళాయి వద్ద నీటిని పట్టుకుని వెళ్తుంటారు. ఆ సమయంలో ఈశ్వరమ్మ దూషిస్తూ ఉండడంతో పొరుగింటికి చెందిన రాజన్న భార్య స్వర్ణమ్మకు మండుకొచ్చింది. దీంతో ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఆమె రోకలి బండతో ఈశ్వరమ్మపై దాడిచేసింది. ఈ దాడిలో కాళ్లూచేతులు విరిగి ఈశ్వరమ్మ అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాధితురానికి 108లో హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ట్రీట్మెంట్తో ఆమె కోలుకుని జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు విస్తుపోయారు. వెంటనే తంబళ్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు ఈశ్వరమ్మను తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు. తంబళ్లపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హత్యాయత్నం కేసుపై డీఎస్పీ దర్యాప్తు
శృంగవరపుకోట రూరల్: మండలంలోని శివరామరాజుపేట గ్రామంలో ఎస్సీ యువతి జుంజూరు శిరీష(19)పై వేపాడ మండలం ఆకులసీతంపేట గ్రామానికి చెందిన సుంకరి బంగారుబుల్లయ్య అనే ఆటో డ్రైవర్ ఇటీవల హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై విజయనగరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 1 డీఎస్పీ బి.మోహనరావు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్.కోట ఎస్ఐ ఎస్.అమ్మినాయుడు, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి శిరీషపై హత్యాయత్నం జరిగిన శివరామరాజుపేట గ్రామంలో బంధువుల ఇంటిని పరిశీలించారు. నిందితుడు దాడి చేసిన సమయంలో అక్కడే పడి ఉన్న పలు వస్తువులను వీఆర్ఓ అప్పలరాము, ఇతర పెద్దల సమక్షంలో డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు ముందుగా హత్యాయత్నానికి గురైన జుంజూరు శిరీష తల్లి సూరీడమ్మను డీఎస్పీ మోహనరావు విచారించగా.. తమ స్వగ్రామం వేపాడ మండలం ఆకులసీతంపేట గ్రామమని, 2007లో తన భర్త శ్రీను మృతి చెందటంతో ఉన్న ఒక్కగానొక్క కుమార్తెతో కలిసి గంట్యాడ మండలం పెదమధుపాడ గ్రామంలో కన్నవారింటికి వెళ్లి జీవిస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో ఆకులసీతంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బంగారుబుల్లయ్య తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తే అక్కడి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లామని, పెద్ద మనుషులు బంగారుబుల్లయ్యను వారించి ఇకపై శిరీష జోలికి రానంటు ఒక లేఖ కూడా రాయించారని తెలియజేసింది. నాలుగు రోజుల కిందట నా కుమార్తె శిరీష పేరున బ్యాంకులో ఖాతా తెరిచేందుకు ఇద్దరం వెళ్లామని, సమయం మించి పోవటంతో మరొక రోజు రమ్మన్నారని చెప్పటంతో కుమార్తె శిరీష సమీపంలో గల శివరామరాజుపేటలోని తన అక్క గారింటికి వెళ్లగా తాను పెదమధుపాడ వెళ్లిపోయానని వాంగ్మూలం ఇచ్చింది. శిరీషపై హత్యాయత్నానికి పాల్పడి ఇంట్లో నుంచి నిందితుడు వెళ్లిపోతున్న సమయంలో చూసిన శిరీష పెద్దమ్మను, మావయ్య గౌరినాయుడు, మరో ప్రత్యక్ష సాక్షి ముచ్చకర్ల చిరంజీవి సూర్యనారాయణను డీఎస్పీ విచారించి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం నిందితుడు బంగారుబుల్లయ్య, హత్యాయత్నానికి గురైన బాధిత యువతి శిరీషల స్వగ్రామమైన వేపాడ మండలంలోని ఆకులసీతంపేట గ్రామానికి వెళ్లి అక్కడి మాజీ ఎంపీటీసీ అడపా ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ మంచిన అప్పలసూరి తదితరులను డీఎస్పీ విచారించారు. డీఎస్పీ వెంట ఎస్.కోట ఎస్ఐ అమ్మినాయుడు, వేపాడ ఎస్ఐ తారకేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడు రఘురాజు హత్యకు కుట్ర..!
విజయనగరం , శృంగవరపుకోట : నియోజకవర్గ స్థాయి నేతగా, మాజీ మంత్రి బొత్స అనుచరునిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా జిల్లా వాసులకు సుపరిచితుడైన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు హత్యకు ఇద్దరు వ్యక్తులు కుట్ర పన్నినట్టు వస్తున్న వార్తలు స్థానికంగా సంచలనం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాలిలా ఉన్నాయి. నెల రోజులుగా ఇద్దరు వ్యక్తులు తరచూ వైఎస్సార్సీపీ నేత రఘురాజుకు, అతని భార్య సుధారాజులకు ఫోన్లు చేసి ‘రఘురాజును చంపేస్తాం.. ఆయన్ని చంపితే మాకు రూ.3 కోట్లు ఇస్తామన్నారు.. మీరుంటే వాళ్లు ఎన్నికల్లో గెలవలేరట.. మా ఖర్చులు మాకుంటాయిగా.. మిమ్మల్ని వేసేయడం ఖాయం.. అం టూ ఫోన్‌చేసి బెదిరిస్తున్నారు. అయితే మొదట్లో ఆకతాయిల పనిగా తేలిగ్గా తీసుకున్న రఘురాజు అదే పనిగా ఫోన్‌కాల్స్ రావడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, రఘురాజులు డీఐజీ పాలరాజును శనివారం కలిసి బెదిరింపుల విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు రఘురాజు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఎస్.కోట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే సీతంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని, కృష్ణాపురానికి చెందిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెండు రోజులుగా విచారిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు నోరు విప్పితే వాస్తవాలు వెలుగుచూస్తాయి. గతంలోనూ బెదిరింపులు .. ఎస్.కోట మండలంలో జింధాల్ భూముల కేటాయింపు సమయంలో (2007లో) రఘురాజుకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. అప్పట్లో విచారణ చేపట్టిన పోలీసులు రఘురాజుకు ప్రాణాలకు ముప్పు ఉందని నిర్దారించి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల పాటూ ఉదయం నలుగురు, రాత్రి ముగ్గురు కానిస్టేబుళ్లు రఘురాజు ఇంటి వద్ద బందోబస్తుగా ఉండేవారు. అలాగే ఆయనకు ఇద్దరు గన్మన్లను కేటాయించారు. ఇదిలా ఉంటే బొడ్డవరలో ఉన్న ఇంటిలో ఉండవద్దని పోలీసులు సూచించడంతో కొంతకాలం నుంచి రఘురాజు కుటుంబం విశాఖలో ఉంటోంది. అదే సమయంలో రఘురాజుకు పోలీస్‌శాఖ ఆయుధ లైసెన్స్ కూడా జారీ చేసింది. ఈ తరుణంలో మరోమారు రఘురాజుకు ప్రాణహాని ఉందన్న వార్తలు హల్చల్ చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. -
వాళ్ళని వదిలేశారు.. లోకేష్ ఒత్తిళ్లే కారణమా?
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోలీసులు దొంగాట ఆడుతున్నారా? తనపైన హత్యయత్నానికి ప్రయత్నించిన నిందితులను మీడియా సా«క్షిగా అప్పగించినా... మంత్రి లోకేష్ ఒత్తిళ్ల వల్ల వారిని వదిలేశారా? విచారణలో మంత్రి లోకేష్ ప్రమేయంపై నిందితులు విచారణలో ఒప్పుకున్నారా? అందుకే ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదా? చిన్న కేసుల్లో వదిలినట్టు నిందితులను వదిలేశారా? బయటకు వచ్చిన నిందితులపై ఒత్తిళ్లు తీసుకువచ్చి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారా? మూడు రోజులపాటు అరెస్ట్ చూపకుండా వారిని స్టేషన్లోనే పోలీసులు వేధించారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు న్యాయనిపుణులు. చిత్తూరు, తిరుపతి రూరల్: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై రెక్కీ కేసులో ఎంఆర్‌పల్లి పోలీసులు చట్టాలను ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుట్ర జరిగిందని కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని పూర్తి స్థాయిలో విచారించకుండానే వారిని వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజులపాటు ఆచూకీ లేకుండా పోయిన నిందితులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది సెర్చ్ పిటీషన్ వేసిన తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే న్యాయస్థానానికి ఎలా వచ్చారు? వారిని నడిపిస్తున్నది ఎవరు? అనేది పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ కుట్ర వెనుక దాగి ఉన్న మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలేం జరిగిందంటే... ప్రభుత్వ నిర్వహిస్తున్న పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై వారం క్రితం హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యేకు సంబంధించిన సమాచారం ఆయన వద్ద పనిచేస్తున్న డ్రైవర్లే ఆయన రాజకీయ ప్రత్యర్థులకు చేరవేస్తున్నారని గుర్తించారు. ఆ డ్రైవర్లను నాగభూషణం, సిసిం ద్రీగా గుర్తించారు. వారిని విచారిస్తే ఒక్కొక్కరికి రూ.15 లక్షల సుపారీ ఇస్తామన్నారని నాని అనుచరులు చెప్పడం వల్లే తాము ఈ కుట్రకు పాల్పడినట్లు వారు మీడియా ఎదుట, పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. దీంతో వారిని ఈ నెల 5వ తేదీన అర్బన్ ఎస్పీకి అప్పగించారు. కేసు నమోదు చేసి విచారించాలని ఎంఆర్‌పల్లి పోలీసులకు ఎస్పీ రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో 29 గంటలు దాటినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో 6వ తేదీ రాత్రి ఎంఆర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో హడవిడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. సర్వత్రా విమర్శలు పుణ్యక్షేత్రమైన తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యేపైనే రెక్కీ నిర్వహించి, ఒక విష సంస్కృతికి బీజం వేస్తే, ప్రశాంతత నెలకొల్పాల్సిన పోలీసు అధికారులు పట్టించిన నిందితులను సైతం వదిలేయడంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాసనసభ్యుడికి భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారులు భక్తులు, సామాన్యులు, స్థానికులకు ఏమాత్రం భద్రత కల్పిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విచారణలో మంత్రి లోకేష్ పేరు ఎమ్మెల్యేపై హత్యాయత్నం, రెక్కీ కేసులో నిందితులుగా ఉన్న నాగభూషణం, సిసింద్రీల విచారణలో మంత్రి లోకేష్ పేరు బయటకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఉలిక్కిపడిన పోలీసు అధికారులు విషయం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. పైస్థాయిలో ఒత్తిళ్ల వల్లే కేసును పక్కదారి పట్టిస్తూ ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధిపై హత్యయత్నానికి కుట్ర జరిగిందనే కేసులో నిందితులను వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో విచారిస్తే మంత్రి లోకేష్ హస్తంతోపాటు హత్యాయత్నం కుట్ర విషయం బయటకు వస్తుందని ప్రజాసంఘాలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. విచారించకుండానే వదిలేశారు 5వ తేదీ నుంచి నిందితులు నాగభూషణం, సిసింద్రీలను పోలీసులు స్టేషన్ లాకప్‌లోనే అక్రమంగా ఉంచుకున్నారనే ఆరోపణలు ఉన్నారు. వారిని అరెస్ట్ చూపకపోవడం, లాకప్‌లో పెట్టి చెవిరెడ్డికి వ్యతిరేకంగా చెప్పాలని వేధిస్తున్నారనే సమాచారం గుప్పుమంది. లోపాయికారీగా కుట్ర జరుగుతున్నట్లు అనుమానంతో వారిని వెంటనే కోర్టు ముందు హాజరు పరచాలని శుక్రవారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది వాణి తిరుపతి 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సెర్చ్ పిటిషన్ వేశారు. దీంతో 10 నిమిషాల్లోనే నిందితులు నాగభూషణం, సిసింద్రీలను కోర్టు ముందు వదిలి, ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని బెదిరించి పిటీషన్ వేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పిటీషన్ చూసిన న్యాయమూర్తి ఆగ్రహించి, మీరే నిందితులైతే మీకు ప్రాణహాని ఉందని పిటీషన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. కోర్టు సమయం వృథా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటీషన్‌ను తిరస్కరించారు. -
చోరీకి వచ్చి మహిళపై హత్యాయత్నం
గుంటూరు, పేరేచర్ల(ఫిరంగిపురం): మద్యానికి బానిసై చేతిలో డబ్బులు లేక దొంగతానికి పూనుకొన్నాడు. పక్కా స్కెచ్ వేసి తన ఇంటి పక్క ఇంటిలో జొరబడి ముసుగు వేసుకొని గుంటనక్కలా నక్కి మహిళ బయటకు రాగానే ఆమె కళ్లలో కారం కొట్టి ఆపై కర్రతో తలపై మోదాడు. తీవ్ర రక్త స్రావం అవుతున్న ఆమె మృతి చెందలేదని తెలుసుకొని గ్యాస్ సిలండర్‌కు ఉన్న పైపు తీసి ఆమె శరీర భాగాలపై కాల్చి చేతికున్న నాలుగు గాజులు లాక్కుని ఉడాయించాడు. తేరుకొన్న మహిళ స్థానికులను కేక వేయడంతో వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్నడూ ఊహించని ఈ ఘటనతో ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంటిలో నక్కిన దుండగుడు ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం... తొర్లికొండ బాబూరావు వేములూరిపాడులో అద్దె ఇంట్లో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తన ఇంటి పక్కనే నివాసముంటున్న తాటి శివకుమారికి భర్త లేకపోవటం, కొడుకులు ఇద్దరు విదేశాల్లో ఉండటంతో ఒంటరిగా నివసిస్తుందని తెలుసుకొని ఆమె ఇంట్లో దొంగతనం చేయటానికి అదునుగా భావించాడు. ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో గోడ దూకి దుప్పటి కప్పుకొని శివకుమారి ఇంటి ముందు నక్కాడు. ఆమె కాలకృత్యాలు తీర్చుకోవటానికి బయటకు రాగానే నిందితుడు తన వెంట తెచ్చుకొన్న కారం ఆమె కళ్లలో కొట్టి వెంటనే కర్రతో తలపై మోదాడు. ఆమె తలకు బలంగా దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం అవడంతో చనిపోలేదని తెలుసుకొని వంట గదిలోకి ఆమెను ఈడ్చుకొని వెళ్లి అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ పైపు తీసి దానిని వెలిగించి ఆమె శరీర భాగాలను కాల్చడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమె చేతికున్న నాలుగు బంగారు గాజులను లాక్కొని పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన శివకుమారి స్థానికులకు ఘటన విషయం చెప్పటంతో 108లో గుంటూరు సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది బాబూరావే అని బాధితురాలు పోలీసులకు స్పష్టంగా చెప్పటంతో అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ విషయం తెలుసుకొన్న నర్సరావుపేట డీఎస్పీ డి.రవివర్మ, గుంటూరు రూరల్ సీసీయస్ డీఎస్పీ వై.రవికృష్ణకుమార్ సిబ్బందితో కలసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లను, బంధువులను పిలిపించి ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీశారు. విదేశాల్లో ఉన్న బాధితురాలి కొడుకులతో మాట్లాడారు. నిందితుడు పరారవడంతో నిందితుడి తల్లి, కుమారుడును అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు తాటి శివకుమారిపై దాడి చేసి అనంతరం ఆమె చేతి గాజులతో ఉడాయించిన బాబూరావును రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు రూరల్ సీసీయస్ పోలీసులు గంటల వ్యవధిలోని పట్టుకొని అదుపులోకి తీసుకొన్నారు. సీసీయస్ డీఎస్పీ వై.రవికృష్ణ కుమార్, నర్సరావుపేట రూరల్ సీఐ బీసీహెచ్ చినమల్లయ్య ఆదివారం ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. నిందితుడిని గుంటూరు పూలమార్కెట్ సెంటర్ వద్ద గాజులు విక్రయిస్తుండగా పట్టుకొన్నట్లు తెలిపారు. నిందితుడు నుంచి నాలుగు గాజులు రికవరీ చేశామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. -
భర్తకు మళ్లీ దగ్గరవుతోందన్న అనుమానంతోనే..
హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసులో నిందితుడు బత్తుల నూతనకుమార్ విక్టర్ ఆత్మహత్య చేసుకోవటంతో దర్యాప్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. పద్మపై అత్యంత పైశాచికంగా దాడి చేసిన అనంతరం ఈ నెల 24 నుంచి అదృశ్యమైన నూతన కుమార్ గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం నుదురుపాడు వద్ద రైల్వే పైవంతెన కింద ఆదివారం సాయంత్రం శవమై తేలడం తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లె పద్మ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తొలుత హైదరాబాద్‌కు పరారీ.. పద్మపై కర్కసంగా హత్యాయత్నం చేసిన నూతనకుమార్ వెంటనే ఘటనాస్థలాన్ని విడిచిపెట్టి తన బైక్‌పై హైదరాబాద్‌కు పరారైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడం, నాలుగు ప్రత్యేక బృందాలను నియమించటం, అతని స్నేహితులను విచారించటం, మీడియాలో అతని పేరు, ఫొటో సంచలనం కావటంతో నూతనకుమార్‌కు గత్యంతరం లేక బలవ్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నూతనకుమార్ హైదరాబాద్‌లో ఉన్నట్లు శనివారం రాత్రి నిర్ధారణకు వచ్చిన హనుమాన్‌జంక్షన్ ఎస్ఐ వి.సతీష్ నేతృత్వంలోని పోలీసు బృందం హుటాహుటిన అక్కడికి బయలుదేరింది. దీంతో పోలీసుల చేతికి చిక్కక తప్పదనే భయంతో నూతనకుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త దగ్గరికి వెళ్లిపోతుందనే అక్కసుతోనే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వెన్నవల్లి వారి పేటకు చెందిన బత్తుల నూతన కుమార్ విక్టర్ ఎంబీఏ చదివాడు. ఏలూరులోని ద్విచక్ర వాహనాల షోరూంలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న అతనికి అక్కడే పనిచేస్తున్న పల్లె పద్మతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను భార్యను విడిచిపెట్టి, పద్మతో సహజీవనం ప్రారంభించారు. నాలుగేళ్లుగా వీళిద్దరూ కలిసి ఉంటున్నప్పటికీ గత కొంతకాలంగా మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో పెదపాడు, హనుమాన్‌జంక్షన్ పోలీస్స్టేషన్లలో నూతనకుమార్పై పద్మ ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా పద్మ తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోవటానికి నిశ్చయించుకోవటంతో నూతనకుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నెల 23వ తేది రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుందని స్ధానికులు చెబుతున్నారు. భార్యను సైతం విడిచిపెట్టి పద్మ కోసం వస్తే, మళ్లీ ఆమె భర్త సూర్యనారాయణ దగ్గరకు వెళ్లిపోతుందనే అక్కసుతోనే ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏలూరులో నూతనకుమార్‌కు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని సైతం ఇటీవలే విక్రయించి, తద్వారా వచ్చిన రూ.35 లక్షలు కూడా పూర్తిగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పద్మ వెళ్లిపోవటం, తన ఆస్తిని కూడా పూర్తిగా కోల్పోవటంపై నూతన కుమార్ విచక్షణ కోల్పోయి ప్రతీకార చర్యకు ఉపక్రమించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పద్మ చేతులకు శస్త్రచికిత్స.. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్యూటీషియన్ పద్మకు వైద్యులు సోమవారం శస్త్రచికత్స నిర్వహించారు. ఆమె రెండు చేతులు మణికట్టు పైభాగంలో కత్తిపోట్ల కారణంగా తీవ్రంగా దెబ్బతినటంతో తొలుత చేతులు తొలగించాలని వైద్యులు భావించారు. కానీ పూర్తిస్థాయిలో ఆమెకు నిర్వహించిన టెస్ట్ రిపోర్టుల ఆధారంగా మణికట్టు పైభాగంలో శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె రెండు చేతులకు ఆపరేషన్ చేసి రాడ్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. మెడ వద్ద తీవ్ర గాయం కావటంతో హత్యయత్నం వివరాలను వెల్లడించే స్థితిలో లేదని తెలుస్తోంది. నాభర్త ఆత్మహత్యకు పద్మే కారణం తన భర్త ఆత్మహాత్యకు పద్మే కారణమని నూతన్‌కుమార్ భార్య సునీతకుమారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన నూతన కుమార్ విక్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం నరసరావుపేట రైల్వే పోలీసులు ఆతని భార్య బత్తుల సునీతకుమారికి అప్పగించారు. ఆ సమయంలో పోలీసులకు సునీత ఇచ్చిన వాగ్మూలంలో తన భర్త మంచి వాడని, పద్మ వేసిన ఉచ్చులో పడి దారుణంగా మోసపోయాడని, తన భర్త మరణానికి పద్మే కారణమని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. 2014 వరకు తనతో ఎంతో అన్యోన్యంగా ఉండే వాడని, బైక్ షోరూంలో మేనేజర్‌గా పని చేశాడని చెప్పినట్లు సమాచారం. పద్మపై వ్యామోహాంతో ఆస్తిని సైతం నాశనం చేసుకున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. -
అనైతిక బంధం ..వరుడిపై పెట్రోల్ దాడి
-
అనైతిక బంధం.. వరుడు మృతి
సాక్షి, వరంగల్ : పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు పాడె ఎక్కాడు. వరుసకు సోదరుడైన వ్యక్తితో అనైతిక బంధం కొనసాగిస్తున్న వధువే వరుడిపై పెట్రోల్ దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో చివరకు వరుడు ప్రాణాలు కోల్పోయాడు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వరుడు యాకయ్య శనివారం మృతి చెందాడు. గత ఆరు రోజుల క్రితం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన యాకయ్యపై పెట్రోల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అనైతిక బంధంతో వధువే వరుడిపై హత్యాయత్నం జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే వధువు అరుణ, ఆమె సోదరుడు బాలస్వామిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలేం జరిగిందంటే.. కంచనపల్లి గ్రామానికి చెందిన గొంగోళ్ల సామ్యేల్- యాదమ్మల కుమారుడు యాకయ్యకు మాదరం గ్రామానికి చెందిన అరుణతో ఈనెల 21న పెళ్లి చేయాలని ఇరువర్గాల కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువుకు మాత్రం ఈ వివాహం ఇష్టం లేదు. కారణం ఆమె గత మూడేళ్లుగా బాలస్వామితో ప్రేమలో ఉంది. కానీ, బాలస్వామి మరెవరో కాదు.. వధువుకు స్వయాన పెద్దమ్మ కొడుకు. పెళ్లిని ఆపేందుకు బాలస్వామితో కలిసి వధువు పథకం పన్నింది. మరోవైపు ఆదివారం 18వ తేది నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వరుడు కుటుంబం రాత్రి బంధువులతో హడావిడిలో ఉండగా వధువు అరుణ నుంచి యాకయ్యకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని బయటకు వచ్చి మాట్లాడమని అరుణ చెప్పడంతో వరుడు యాకయ్య బయటకు వచ్చాడు. అప్పటికే మాటువేసిన బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
వధువు అనైతిక సంబంధం.. వారిద్దరు అరెస్ట్
సాక్షి, వరంగల్, రఘునాథపల్లి: కాబోయే వరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో వధువు అరుణ, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసకు అన్నయ్య అయిన బాలస్వామితో కొనసాగించిన ప్రేమ వ్యవహారమే వరుడి హత్యాయత్నానికి దారి తీసిందని స్టేషన్ ఘణపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు గురువారం మీడియాకు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే వధువు అరుణ, వరుడు యాకయ్యకు ఇంటి బయటకు రప్పించగా.. అప్రమత్తంగా ఉన్న బాలస్వామి వరుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన గొంగోళ్ల సామ్యేల్- యాదమ్మల కుమారుడు యాకయ్యకు మాదరం గ్రామానికి చెందిన అరుణతో ఈనెల 21న పెళ్లి చేయాలని ఇరువర్గాల కుటుంబసభ్యులు నిర్ణయించారు. వధువుకు మాత్రం ఈ వివాహం ఇష్టం లేదు. కారణం ఆమె గత మూడేళ్లుగా బాలస్వామితో ప్రేమలో ఉంది. కానీ, బాలస్వామి మరెవరో కాదు.. వధువుకు స్వయాన పెద్దమ్మ కొడుకు. పెళ్లిని ఆపేందుకు బాలస్వామితో కలిసి వధువు పథకం పన్నింది. మరోవైపు ఆదివారం 18 తేది నాడు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వరుడు కుటుంబం రాత్రి బంధువులతో హడావిడిలో ఉండగా వధువు అరుణ నుండి యాకయ్యకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ సిగ్నల్ సరిగా లేదని బయటకు మాట్లాడమని అరుణ చెప్పడంతో వరుడు యాకయ్య బయటకు వచ్చాడు. అప్పటికే మాటువేసిన బాలస్వామి ఒక్కసారిగా యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో ఉన్న యాకయ్యను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం అరుణ, బాలస్వామిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. -
అనైతిక బంధంతోనే హత్యాయత్నం
వరంగల్, రఘునాథపల్లి: కాబోయే పెళ్లి కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో విస్తుగొలిపే విషయం వెలుగు చూసింది. ఈ దురాఘాతానికి పాల్పడింది వధువుకు స్వయంగా పెద్దమ్మ కొడుకేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అన్నాచెల్లెలి మధ్య కొనసాగుతున్న అనైతిక బంధంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వారి విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. జనగామ జిల్లా కంచనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి గొంగళ్ల యాకయ్య అనే యువకుడిపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టి కీలకాధారాలను రాబట్టినట్లు తెలిసింది. వధువు కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు యాకయ్యకు ఆమె ఎప్పుడు ఫోన్ చేసింది? అంతకు ముందు ఫోన్ ఎవరితో మాట్లాడింది ? అనే వివరాలను సేకరించారు. యాకయ్యకు ఫోన్ చేయక ముందు ఆమె కాల్ చేసిన వ్యక్తి ఆమె పెద్దమ్మ కొడుకుగా గుర్తించారు. రాత్రి 11.45 గంటలకు ఐదు సార్లు యాకయ్యతో ఎందుకు మాట్లాడావు.. ఏం మాట్లాడావు, బయటకు ఎందుకు రమ్మన్నావు ? అని పోలీసులు తమదైన శైలీలో విచారించడంతో తాను, తన పెద్దమ్మ కుమారుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఆ యువతి వెల్లడించినట్లు తెలిసింది. తాము పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే యాకయ్యను హతమార్చేందుకు ప్లాన్ చేసినట్లు ఇరువురు అంగీకరించినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్ వద్ద మహిళల ఆందోళన.. అభంశుభం తెలియని యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని కంచనపల్లి మహిళలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. రెండు ట్రాక్టర్లపై దాదాపు 50 మంది మహిళలు పోలీస్ స్టేషన్‌కు వస్తుండగా వారిని పోలీసులు మద్యలో కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిలో 20 మందికిపైగా మహిళలు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యాకయ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై రంజిత్‌రావు ఎట్టకేలకు వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. కాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న యాకయ్యను టీఆర్ఎస్ నాయకుడు రాజారపు ప్రతాప్ పరామర్శించారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షపడేలా మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయినితో మాట్లాడి న్యాయం చేస్తానని ప్రతాప్ తెలిపినట్లుగా యాకయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసా
ఫ్లెక్సీల వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు చూపిన అత్యుత్సాహంపై కోర్టు మొట్టికాయలు వేసింది. ఈనెల 19వ తేదీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పుట్టినరోజు. ఆ సందర్భంగా కొందరు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా, స్థానిక మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఆయన అనుచరులు వాటిని తీయించేశారు. ఆ సందర్భంగా జరిగిన చిన్నపాటి గొడవపై పోలీసులు కేసు నమోదుచేశారు. కొట్టుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసు నమోదుచేసి ఆయనను అరెస్టుచేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. చిన్నపాటి ఫ్లెక్సీ వివాదానికి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన వైనాన్ని కొట్టు సత్యనారాయణ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసుల తీరును తప్పుబట్టిన కోర్టు.. సెక్షన్ 307ను 324గా మార్చాలని ఆదేశించింది. న్యాయమూర్తి ఆదేశాలతో సెక్షన్ 307ను 324గా పోలీసులు మార్చారు. అనంతరం కొట్టు సత్యనారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఇంట్లో ఇల్లాలు...స్టేషన్లో ప్రియురాలు
-
ఐదేళ్లుగా ఎస్సై సహజీవనం...ఆపై హత్యాయత్నం !
గుంటూరు: ఐదేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఎస్సై వదిలించుకునేందుకు హత్యాయత్నం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అడిగొప్పులకు చెందిన సదరు మహిళ తన భర్త వేధిస్తున్నాడంటూ దుర్గి ఎస్సై కృష్ణయ్యను ఆశ్రయించింది. అయితే, ఆమెపై కన్నేసిన ఎస్సై...భర్తను వదిలేస్తే తాను చూసుకుంటానని నమ్మబలికాడు. అతడి మాటలను నమ్మిన మహిళ.. గత ఐదేళ్లుగా ఎస్సైతో సహజీవనం చేస్తోంది. ప్రస్తుతం తాడికొండ ఎస్సైగా ఉన్న కృష్ణయ్య ఆమెను వదిలించుకునేందుకు ఇటీవల చంపేందుకు యత్నించాడంటూ శనివారం బాధితురాలు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. -
జయేంద్ర సరస్వతి ఉక్కిరిబిక్కిరి
చెన్నై: పదిహేనేళ్ల క్రితం చెన్నైలో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సోమవారం చెన్నై సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. వంద ప్రశ్నలతో రెండు గంటలపాటు జడ్జి.. కంచి పీఠాధిపతిని ఉక్కిరిబిక్కిరి చేశారు. సోమశేఖర్ ఘనాపాటి పేరుతో జయేంద్రపై ఆరోపణలతో తమిళనాడు ప్రభుత్వానికి ఆకాశరామన్న ఉత్తరాలు అందాయి. ఈ నేపథ్యంలో 2002 సెప్టెంబర్ 20న చెన్నై మందవల్లిలో నివసించే ఆడిటర్ రాధాకృష్ణన్ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి మారణాయుధాలతో దాడిచేశారు. ఈ ఉత్తరాల వ్యవహారాన్ని రాధాకృష్ణనే నడిపించినట్లు భావించిన వారు దాడులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఎమ్మెల్యే పై హత్యాయత్నం కేసు
దాయాదుల మధ్య ‘టపాసుల’ చిచ్చు హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద దాయాదుల మధ్య టపాసుల చిచ్చు రేగింది. టపాసుల దుకాణం ఏర్పాటు ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటనలో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై హత్యాయత్నం కేసు నమోదైంది. హైదరాబాద్ శివారులోని చింతల్లో వివేకానంద్, తన బాబాయి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్‌లకు సంబంధించిన స్థలం ఉంది. ఆ స్థలంలో ఎమ్మెల్యే వివేకానంద్ సూచన మేరకు హరికృష్ణ అనే వ్యక్తి టపాసుల దుకాణం ఏర్పాటు చేశాడు. వివాదాస్పద స్థలంలో దుకాణం ఎలా ఏర్పాటు చేశావని ప్రతాప్ తనయుడు కేపీ విశాల్ దుకాణదారుడిని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మాటామాటా పెరగడంతో వివేకానంద్ ఆగ్రహాంతో విశాల్‌పై చేయి చేసుకున్నారు. తనపై దాడి చేసి కొట్టారని విశాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు ఎమ్మెల్యే వివేకానంద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రూ.15 వేల విలువైన టపాసులు ఇవ్వాలని తనను బెదిరించారని దుకాణ యజమాని హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాల్‌పై పలు కేసులు నమోదు చేశారు. -
సీకే బాబుపై హత్యాయత్నం కేసు విచారణ ప్రారంభం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ప్రారంభమయింది. స్థానిక జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం సోమవారం కేసు విచారణ ప్రారంభించింది. డిసెంబర్ 19 వరకు కేసులోని సాక్షులను, నిందితులను విచారించనున్నారు. తొలి రోజు ఈ కేసులోని నిందితులు న్యాయస్థానం ఎదుట హాజరుకాగా, ముగ్గురు సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి విజయకుమార్ నమోదు చేశారు. ఈ కేసుకు విచారణ ప్రారంభమవడంతో కోర్టు ప్రాంగణంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇదీ కేసు... 2007 ఫిబ్రవరి 9వ తేదీన అప్పటి చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. చిత్తూరులో పలమనేరు రోడ్డులోని క్లబ్ వద్ద కొందరు ఓ కారులో వచ్చి సీకేను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. సీకే బాబు అంగరక్షకుడు హుస్సేన్‌భాషా, మునిసిపల్ ఉద్యోగి నావరసు మృతిచెందారు. గన్మన్లు జరిపిన కాల్పుల్లో హంతక ముఠాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి సైతం మృతి చెందాడు. సీకే బాబు త్రుటిలో తప్పించుకున్నారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అధికారులుగా వ్యవహరించిన సీఐలు మల్లికార్జున్, అల్లాబక్ష్, సుధాకరరెడ్డి, రవిమనోహర ఆచ్చారి, రాజగోపాల్ 16 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో టీడీపీ నాయకుడు కఠారి మోహన్, చింటూ, సురేష్‌బాబు, సర్దార్, గుర్తుతెలియని వ్యక్తి (చనిపోయిన దుండగుడు), కఠారి ప్రవీణ్‌కుమార్, శాంత కుమార్, అమర్నాథ్, శశిధర్, ప్రకాష్, సతీష్, రాజా, జీఎస్.వెంకటచలపతి, జలకం మురళి, త్రివిక్రమ్, ఏకాబరం ఉన్నారు. వీరిపై న్యాయస్థానంలో నేరాభియోగ పత్రాలను దాఖలు చేశారు. సీకే బాబుతో పాటు మొత్తం 94 మందిని సాక్షులుగా చేర్చారు. సాక్షుల విచారణ... సాక్షులుగా ఉన్న మాజీ కౌన్సిలర్ కేపీ శ్రీధర్, ప్రస్తుత కార్పొరేటర్ పులిచెర్ల శివప్రసాద్‌రెడ్డి న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం చెప్పారు. ఓ కేసులో రిమాండు ఖైదీగా ఉన్న కేపీ శ్రీధర్‌ను పోలీసులు పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరిచారు. హత్యాయత్నం జరిగినప్పటి విషయాలను శ్రీధర్, శివప్రసాద్‌రెడ్డి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.నిర్మల ద్వారా న్యాయస్థానానికి వివరించారు. కాగా వచ్చే నెల 19 వరకు జరిగే తొలి షెడ్యుల్ విచారణలో 94 మంది సాక్షులను వారికిచ్చిన తేదీల ప్రకారం ప్రతీ రోజు విచారించనున్నారు. -
ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు
-
ఎమ్మెల్యే, కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు
నంద్యాల:నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు పదకొండు మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. నంద్యాల పురపాలక సమావేశంలో ఘర్షణకు ప్రేరేపించి టీడీపీ కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డారని భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భూమాతో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రౌడీషీట్ నమోదు చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఆ సమావేశం సజావుగా సాగడం లేదని ప్రశ్నించినందుకు భూమాపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుట్టా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. -
భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్
-
భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి 15 రోజుల రిమాండ్ విధించారు. శనివారం సాయంత్రం భూమా నాగిరెడ్డిని నంద్యాలలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరపరిచారు. భూమాకు అనారోగ్యంగా ఉందని ఆయన తరపు న్యాయవాది పటిషన్ వేశారు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. భూమా నాగిరెడ్డి శనివారం మధ్యాహ్నం పోలీసులకు లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడతానన్నారు. నంద్యాల మునిసిపల్ కార్యాలయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులు నమోదు అయ్యాయి. -
భూమా నాగిరెడ్డి లొంగుబాటు
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శనివారం లొంగిపోయారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణ ఎదుట ఆయన సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోయినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడతానన్నారు. కాగా భూమా నాగిరెడ్డి వెంట వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు ఎస్వీ మోహన్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయరాం, గౌరు చరిత, ఐజయ్య, మణిగాంధీ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులు నమోదు అయ్యాయి. -
కాసేపట్లో పోలీసుల ముందుకు భూమా నాగిరెడ్డి
-
చట్టాన్ని గౌరవించి లొంగిపోతున్నా: భూమా నాగిరెడ్డి
ప్రజల శ్రేయస్సు కోసం ఎన్ని కేసులనైనా తాను భరిస్తానని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. చట్టాన్ని గౌరవించి తాను పోలీసులకు లొంగిపోతున్నట్లు ఆయన తన అనుచరులకు చెప్పారు. కర్నూలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. భూమా ఇంటిచుట్టూ భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆయన లొంగిపోనున్నట్లు చెప్పడంతో.. నంద్యాలకు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, ఐజయ్య, మణిగాంధీ తదితరులు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయ సాయిరెడ్డి కూడా కాసేపట్లో నంద్యాలకు చేరుకుంటారు. -
సీకే బాబుపై హత్యాయత్నం కేసు కొట్టివేత
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై నగరంలోని గంగనపల్లెకు చెందిన చంద్రశేఖర్(చింటూ)పై కేసు కొట్టివేశారు. 2007లో చిత్తూరులో జరిగిన గంగజాతరలో సీకే బాబును హతమార్చడానికి కఠారి మోహన్ బావమరిది చింటూ కిరాయి వ్యక్తుల్ని ఏర్పాటు చేశాడని కర్ణాటక రాష్ట్రం పావుగడ పోలీసులు కేసు నమోదు చేశారు. చింటూతో పాటు మొత్తం పది మందిపై తుముకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సాక్ష్యాధారాలు నిరూపణ కాకపోవడంతో పావుగడ ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానం నిందితులపై కేసు కొట్టివేసింది. ఈ మేరకు శనివారం న్యాయమూర్తి మధుగిరి ఆదేశాలు జారీ చేశారు. -
'నవాజ్ షరీఫ్ పై హత్యాయత్నం కేసు పెడతా'
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెహ్రీకే ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడైన నవాజ్ షరీఫ్ పై హత్యాతయ్నం కేసు పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. అమాయ ప్రజలపై పోలీసుల చర్యను ఆయన ఖండించారు. నవాజ్ షరీఫ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఆందోళనకారులు నవాజ్ షరీఫ్ ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో నిరసనలో పాల్గొంటున్న ఓ మహిళ మరణించింది. అనేక మంది గాయపడ్డారు. -
17 ఏళ్లయినా న్యాయం జరగలేదు: గద్దర్
నాపై హత్యాయత్నం కేసు ఇప్పటికీ వీడలేదు సీబీఐకి అప్పగించండి, గవర్నర్‌కు గద్దర్ లేఖ సాక్షి, హైదరాబాద్: తనపై హత్యాయత్నం జరిగి 17 ఏళ్లయినా ఇంతవరకు ఆ దాడికి పాల్పడ్డ నిందితులను పట్టుకోలేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రజా గాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ నరసింహన్‌కు లేఖ పంపారు. 1996 ఏప్రిల్ 6న అల్వాల్‌లోని నివాసంలో ఉన్న తనపై గ్రీన్‌టైగర్స్ పేరుతో కొందరు అగంతకులు కాల్పులు జరిపారని, ఇప్పటికీ ఓ బుల్లెట్ తన వెన్నుపూసలోనే ఉందని గద్దర్ పేర్కొన్నారు. అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు, హోంమంత్రిగా మాధవరెడ్డి, డీజీపీగా హెచ్ జే దొర ఉన్నారని వివరించారు. దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ.. నిందితులు దొరకలేదంటూ కేసును మూసేసిందని, తాను కోర్టును ఆశ్రయించడంతో కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించారని గద్దర్ తన లేఖలో పేర్కొన్నారు. చివరికి ఇన్నేళ్లయినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం, పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా గవర్నర్ జోక్యం చేసుకుని తనపై దాడి కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని, దోషులను పట్టుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
హత్యాయత్నం కేసులో విలన్ అరెస్టు
-
హత్యాయత్నం కేసులో విలన్ అరెస్టు
సినిమాల్లో విలన్‌గా చేస్తున్న ఓ నటుడు నిజజీవితంలో కూడా అలాగే వ్యవహరించాడని పోలీసులు అంటున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి రెహ్మాన్ అనే సినీ నటుడిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో రెహ్మాన్ పాత్ర ఉందని, అందుకే అతడిని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. గతంలో విక్రమార్కుడు లాంటి సినిమాల్లో రెహ్మాన్ విలన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు. అయితే ఇప్పుడు ఆయన ఈ హత్యాయత్నం కేసులో ఉండటంతో టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.