హత్యాయత్నం కేసులో విలన్ అరెస్టు | cine villain arrested in attempt to murder case | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 24 2014 5:02 PM | Last Updated on Wed, Mar 20 2024 3:19 PM

సినిమాల్లో విలన్గా చేస్తున్న ఓ నటుడు నిజజీవితంలో కూడా అలాగే వ్యవహరించాడని పోలీసులు అంటున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి రెహ్మాన్ అనే సినీ నటుడిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో రెహ్మాన్ పాత్ర ఉందని, అందుకే అతడిని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. గతంలో విక్రమార్కుడు లాంటి సినిమాల్లో రెహ్మాన్ విలన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు. అయితే ఇప్పుడు ఆయన ఈ హత్యాయత్నం కేసులో ఉండటంతో టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement