rehman
-
చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత, రౌడీషీటర్ రెహమాన్ అరెస్ట్ అయ్యాడు. అయితే, ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో బెదిరింపులకు పాల్పడిన రెహమాన్‌తో పాటు మరో రౌడీ షీటర్ రాజాను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. టీడీపీ నేత రెహమాన్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, గతంలోనే రెహమాన్, రాజాపై పోలీసులు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. ఇక, పెనమలూరు నియోజకవర్గ టీడీపీలో రెహమాన్ కీలకంగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో రెహమాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు.. ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా రెహమాన్ యాక్టివ్‌గా పనిచేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పుంగనూరులో ఎల్లో బ్యాచ్ రౌడీమూకలు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఇది కూడా చదవండి: జనసేన నేతపై చీటింగ్ కేసు -
వల వేసి ఉచ్చులోకి..!
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఫార్మాస్యూటికల్ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ మహ్మద్ సలీం టెర్రర్ మాడ్యుల్లో కీలకమని నిర్ధారించారు. ఇతడే మిగిలిన వారిని ఈ ఉచ్చులోకి లాగినట్లు తేల్చారు. భోపాల్‌లో చిక్కిన 11 మందితోపాటు నగరంలో అరెస్టు అయిన ఐదుగురినీ ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. మహ్మద్ సలీంగా మారిన సౌరభ్ రాజ్ విద్య 2018లో తన భార్యతో కలిసి నగరానికి వలసవచ్చాడు. తొలుత సైదాబాద్‌లో నివసించిన వీళ్లు అక్కడి ఓ పాఠశాలలో టీచర్లుగా పనిచేశారు. ఇతడు కేవలం ఉగ్రవాద కార్యకలాపాల కోసం మాడ్యుల్ తయారు చేయడానికే హైదరాబాద్ చేరుకున్నట్లు ఏటీఎస్ చెప్తోంది. అబ్బాస్ కోసం ఆటో ఖరీదు చేసి... సైదాబాద్ నుంచి సలీం తరచూ మలక్‌పేటలోని ప్రార్థన స్థలానికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి హఫీజ్‌బాబానగర్‌కు చెందిన మహ్మద్ అబ్బాస్ అలీతో పరిచయమైంది. కొన్నాళ్లకు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. పేదరికంలో ఉన్న అబ్బాస్‌ను తన దారిలోకి తెచ్చుకోవడానికి సలీం అతడి అవసరాలు తెలుసుకుని ఆటో ఖరీదు చేసి, తక్కువ రేటుకు అతడికి అద్దెకు ఇచ్చాడు. ఇలా పూర్తిగా తన మీద ఆధారపడిన అబ్బాస్‌ను తన ఇంటికి పిలిచి రెచ్చగొట్టే వీడియోలు చూపించడం, ఆడియోలు వినిపించాడు. ఈ క్రమంలో సలీంతో కలిసి పనిచేయడానికి అబ్బాస్ అంగీకరించాడు. భార్య ద్వారా రెహ్మాన్ పరిచయం నగరంలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో క్లౌడ్ సర్విస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్‌తోపాటు ఇతడి భార్య కూడా మతం మార్చుకుంది. రెహ్మాన్‌ది ఒడిశా కాగా, అతడి భార్యది మధ్యప్రదేశ్. ఈమెకు, సలీం భార్యకు భోపాల్ నుంచే పరిచయం ఉంది. రెహ్మాన్ తన భార్య ద్వారా సలీం భార్యకు... ఆమె ద్వారా సలీంకు పరిచయమయ్యాడు. తరచూ సలీం ఇంటికి వచ్చి వెళ్లే రెహ్మాన్ మెల్లగా అతడి ఉచ్చులో పడ్డాడు. గోల్కొండలోని ఓ ప్రార్థన స్థలంలో సలీంకు డెంటిస్ట్ షేక్ జునైద్‌తోపాటు దినసరి కూలీ మహ్మద్ హమీద్‌తో పరిచయమైంది. వీరినీ తన దారిలోకి తెచ్చుకున్న సలీం మరికొందరిని తన మాడ్యుల్లో చేర్చుకోవాలని భావించాడు. ఈ విషయం హమీద్‌కు చెప్పగా... అతడు తన చిన్ననాటి స్నేహితుడైన జవహర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌ను (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) పరిచయం చేశాడు. ఖరీదు చేసింది మూడు ఎయిర్ గన్స్ ఈ మాడ్యుల్‌కు ఇప్పటివరకు వేరే ఎవరి నుంచీ ఆర్థిక సాయం అందలేదని ఏటీఎస్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయిన ఖర్చంతా సలీం, రెహ్మాన్, జునైద్ భరించారని అంటున్నారు. గత ఏడాది కాలంలో ఇతడు నాలుగు ఇళ్లు మారినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సైదాబాద్ నుంచి అక్బర్‌బాగ్, అక్కడ నుంచి సీతాఫల్మండి.. ఆపై గోల్కొండ ప్రాంతానికి మకాం మార్చాడు. రెహ్మాన్, జునైద్ కూడా ఇతడి ప్రోద్బలంతోనే అక్కడే ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. సలీం తన మాడ్యుల్‌ను ప్రాక్టీస్ చేయడానికి ఎంజే మార్కెట్ సమీపంలోని ఓ దుకాణం నుంచి మూడు ఎయిర్‌గన్స్, పిల్లెట్స్ కొన్నాడు. వీటిలో రెండే రికవరీ కాగా.. మరోదాని ఆచూకీ లభించలేదు. -
అడవులే కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు భోపాల్‌లో పట్టుబడిన 16 మంది ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నగర శివార్లలో ఉన్న వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల మాదిరిగానే భోపాల్ సరిహద్దుల్లోని రైసెన్ అడవిని ఎంచుకున్నట్లు ఏటీఎస్ అధికారులు నిర్థారించారు. అక్కడ అరెస్టయిన 11 మందితో పాటు నగరంలో చిక్కిన ఐదుగురినీ ప్రస్తుతం ఏటీఎస్ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. భోపాల్‌లోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ సయ్యద్ డానిష్ అలీ ఇంటిలో సూత్రధారి యాసిర్ ఖాన్ నిర్వహించిన సమావేశాలకు నగరం నుంచి సలీంతో పాటు అబ్దుల్ రెహా్మన్, షేక్ జునైద్ కూడా హాజరయ్యారని ఏటీఎస్ చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు సైతం తమకు లభించినట్లు స్పష్టం చేస్తోంది. గోల్కొండలోని సలీం నివాసంలో ఎయిర్ పిస్టల్, పిల్లెట్స్, భోపాల్‌లోని యాసిర్ ఇంటి నుంచి నాటు తుపాకీ, తూటాలు సీజ్ చేశారు. ఈ నాటు తుపాకీ సేకరించింది, భోపాల్ మాడ్యుల్‌కు శిక్షణ ఇచ్చింది కూడా సలీం అని ఏటీఎస్ అనుమానిస్తోంది. ఆ కోణంలో అతడిని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. విదేశీ నంబర్లకు ఫోన్లపై ఆరా నగర మాడ్యుల్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ఫోన్ల నుంచి విదేశీ నెంబర్లకు ఫోన్లు వెళ్లినట్లు అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు వాటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి విదేశాల్లో ఉన్న వారితో ఉన్న సంబంధాల పైనా దర్యాప్తు చేయనున్నారు. ఉగ్రవాద సాహిత్యాన్ని తన ల్యాప్‌టాప్ వినియోగించి సొంతంగా తయారు చేసిన సలీం అందులో అనేక అంశాలు చేర్చాడు. ఆన్లైన్లో ఉన్న విషయాలతో పాటు వివిధ పుస్తకాల్లోని అంశాలు క్రోడీకరించి రూపొందించిన ఇందులో జిహాద్, ముజాహిదీన్ అంటే ఏమిటి? తాము ఏం చేయాలి? అనే వివరాలతో పాటు ఉగ్రవాద చర్యల్లో పాల్గొంటూ చనిపోయిన వారి కుటుంబాలను ఎలా ఆదుకోవాలి? ఎలాంటి ఆయుధాలు సమీకరించుకోవాలి? క్యాడర్‌ను ఎలా రిక్రూట్ చేసుకోవాలి? వివరాలు పొందుపరిచాడు. ఈ కేసులో సాక్షులుగా ‘వారు’: సలీం రెహ్మాన్ న్ గతంలో మరికొందరిని ఆకర్షించారు. వీళ్లు కేవలం మతపరమైన కార్యక్రమాలు చేపడుతున్నారని భావించిన వాళ్లు కొన్ని సమావేశాలకు హాజరయ్యారు. కొన్నాళ్లకే వీరి వ్యవహరశైలి, కార్యకలాపాలు అనుమానాస్పదంగా భావించిన వారంతా దూరయమ్యారు. వీరిని గుర్తించి, ఈ కేసులో సాక్షులుగా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. -
పాక్ హక్కుల కార్యకర్త రెహ్మాన్ మృతి
లాహోర్: ప్రముఖ పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ఐఏ రెహ్మాన్(90) సోమవారం లాహోర్‌లో కన్నుమూశారు. పాక్‌లోని హిందు, క్రైస్తవ మైనారిటీల తరఫున గళం వినిపించి, రాజ్యాంగంలో దైవదూషణకు సంబంధించిన కఠినమైన చట్టాలను రద్దు కోసం పోరాడారు. భారత్–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు విశేష కృషి చేశారు. డయాబెటిస్‌తోపాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో రెండు రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కుటుంబసభ్యులు తెలిపారు. రెహ్మాన్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అవిభాజ్య భారత్‌లోని హరియాణాలో 1930లో జన్మించిన రెహ్మాన్ జర్నలిస్ట్‌గా వివిధ పత్రికల్లో 65 ఏళ్లపాటు పనిచేశారు. పాకిస్తాన్–ఇండియా పీపుల్స్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ వేదిక వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (హెచ్ఆర్సీపీ)కి రెండు దశాబ్దాలపాటు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన మృతికి హెచ్ఆర్సీపీ చైర్పర్సన్ జోహ్రా యూసఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రతిపక్ష టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైఎస్సార్సీపీలో చేరారు. విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వ్యవహరించిన రెహమాన్ గత ఏడాది డిసెంబర్ 26న టీడీపీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను స్వాగతిస్తున్నానని అన్నారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ప్రకటించిన రోజే సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపానని గుర్తుచేశారు. తన సతీమణి మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశారని.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్య విధానం వల్ల ఎంతో మేలుచేస్తోందని అభినందించారు. (టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా) పదవుల కోసం పార్టీలో చేరలేదని మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు చేరారని ఎస్ఏ రెహమాన్ స్పష్టం చేశారు. విశాఖపట్నం మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రెహ్మాన్ గతంలో స్వాగతించిన విషయం తెలిసిందే. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీకి ఎన్నికల అనంతరం కీలక నేతలంతా గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా రాజీనామా చేసి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. (రెహమాన్ టీడీపీకి రాజీనామా) ఇక సీఎం వైఎస్ జగన్ తీసుకున్న పాలనా వికేంద్రీకరణ నిర్ణయంతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు అధినేత చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల పోరును నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. -
చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా
-
చరిత్ర హీనుడిగా మిగలదల్చుకోలేదు
-
టీడీపీకి గుడ్ బై చెప్పిన రెహమాన్
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన రెహమాన్.. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్న భయపడేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు పుత్రరత్నం రాజకీయాల్లోకి ప్రవేశించాక.. తాము చంద్రబాబుకు దూరమయ్యామని తెలిపారు. గురువారం రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నార్సీ బిల్లు వల్ల కొంతమంది భారతీయుల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం తమకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఏపీలో ఎన్నార్సీ అమలు చేయటం లేదని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌కు తమ మైనార్టీలంతా రుణపడి ఉన్నామన్నారు. ఎన్నార్సీని వ్యతిరేకించిన సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయాలంటూ చంద్రబాబు తమకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తమ కోసం అనుకూల నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాము ఎలా వ్యతిరేకిస్తామని ప్రశ్నించారు. ఎన్నార్సీ బిల్లుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధాని కావాలని తాము గతంలోనే కోరామని.. అందుకోసం తను పోరాటం కూడా చేశానని చెప్పారు. అమరావతి రైతులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని.. తప్పుడు రాజకీయాలు చేయవద్దని చంద్రబాబుకు హితవు పలికారు. గత ఐదేళ్ల చంద్రబాబు విధానాల వల్ల పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరని.. కొంత మంది నాయకులు మాత్రమే బాగుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అనేది విశాఖ ప్రాంతవాసుల కల అని చెప్పిన రెహమాన్.. విశాఖ క్యాపిటల్ కావడాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై కులాల ప్రస్తావన తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. చరిత్రలో హీనంగా మిగలదల్చుకోలేదని.. అందుకే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు చంద్రబాబు ఎన్నార్సీని వ్యతిరేకించనందుకు టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని తెలీదా?
సాక్షి, విశాఖపట్టణం : విశాఖ నగర టీడీపీ పార్టీ అధ్యక్షుడు రెహ్మాన్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సంస్కారవంతమైన రాజకీయ నేతగా వ్యవహరించాలని రెహ్మాన్ వాసుపల్లికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షునిగా తనకు పగ్గాలు అప్పగించాలన్న నైతిక బాధ్యత కూడా లేదా? అని ఆయన లేఖలో ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కూడా సరిగా వ్యవహరించట్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి వ్యవహారశైలిపై చంద్రబాబుకు నివేదిక ఇస్తానని లేఖలో పేర్కొన్న రెహ్మాన్, మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వాసుపల్లిని ప్రవర్తన మార్చుకుని చురుకుగా పాల్గొనాలని అల్టిమేటమ్ జారీ చేశారు. -
టీడీపీ ఆఫీస్‌కు టూలెట్ బోర్డు ఖాయం
అనంతపురం, సప్తగిరి సర్కిల్: తెలంగాణలో టీడీపీ కార్యాలయానికి తాళం పడిందని, అమరావతిలోని ఆపార్టీ ఆఫీసుకు టూలెట్ బోర్డు వేసుకోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ అన్నారు. ఆయన అనంతపురంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కొన్ని దుష్ట శక్తులు వైఎస్సార్ కుటుంబాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా.. ప్రజాభిమానమే ఈనాటి వరకు వారికి అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు దోపిడీనే ధ్యేయంగా ఐదేళ్లు పాలనను గాలికొదిలేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. పాలన అంటే ఏమిటో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసి చూపారన్నారు. ఆయన ఆశయాలతో పార్టీని స్థాపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే జనరంజక పాలన అందిస్తారని, అప్పుడు చంద్రబాబుకు రాజకీయ సన్యాసం తప్పదని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో టీడీపీ పార్టీ ఐస్ లాగా కరిగిపోవడం ఖాయమవడంతో చంద్రబాబుకు భయంపట్టుకుందని, దీంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటమి కళ్లకు కనిపిస్తున్నందున భరించలేక వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి సుభిక్ష పాలనను అందించేందుకు వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. -
పవన్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ బచ్చా అని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ.రెహమాన్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సినిమాల్లో నటించినట్లు రాజకీయాల్లో నటిస్తే కుదరదని హెచ్చరించారు. వైఎస్ పాలన గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిదని ప్రశ్నించారు. పవన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, వెంటనే పిచ్చాసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోరారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, అన్యాయాలను పక్కన పెట్టి వైఎస్సార్ గురించి మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఐదేళ్లకోసారి పార్టీలు మారుస్తూ కాపురం చేసే చంద్రబాబు, ఆర్నెల్లకోసారి పెళ్లాలను మార్చే పవన్ ఒక్కటయ్యారని ఆరోపించారు. ఏపీలోని దోచుకున్న అవినీతి సోమ్ము తెలంగాణలో ఖర్చు పెడుతున్నారని, విచ్చలవిడిగా టీడీపీ నాయకుల ఇళ్లలో నగదు దొరుకుతోందని తెలిపారు. తిత్లీ తుపాను బాధితులను మరచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు సాధ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. నాడు వైఎస్సార్ ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అందుకే మైనార్టీల భుజాలపై మహానేత వైఎస్సార్ ఉన్నారని చెప్పారు. వైఎస్ ఆశయ సాధన కోసం జగన్ పాటుపడుతున్నట్లు వివరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రజాకూటమి, బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో స్వర్ణయుగం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తెలంగాణ ప్రజలు బాబును నమ్మరు: రెహ్మాన్
హైదరాబాద్: ఏపీలో దుకాణం బంద్ అవుతుందని గ్రహించిన చంద్రబాబు తెలంగాణలో ఫోకస్ పెడుతున్నాడని, తెలంగాణ ప్రజలు ఆయన్ను నమ్మరని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ఏ రెహ్మాన్ అన్నారు. గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆంధ్రాలో ఏమి అభివృద్ధి చేశాడని.. తెలంగాణలో ఏం చేద్దామని వస్తున్నాడని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో గోరంత అభివృద్ధికి కొండంత చూపించుకునే బాబు.. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హైటెక్ సిటీ నిర్మిస్తే అదే అభివృద్ధా అని మండిపడ్డారు. బాబుతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం ఆ పార్టీకే నష్టమన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేస్తే విజయం వైపు ఉండేదని అభిప్రాయ పడ్డారు. -
మూడో పెళ్లి వద్దన్నందుకు...
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయితో పెళ్లికి నిరాకరించారని ఓ యువకుడు తన తల్లిదండ్రులను హత్య చేశాడు. ఈ ఘటన ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాదీమ్ అహ్మద్ (55), తస్లీం బానో (50) కుమారుడు రెహ్మాన్ (26)తో కలిసి జామియా నగర్లో నివాసముంటున్నారు. రెహ్మాన్ కాల్ సెంటర్లో పనిచేస్తుండేవాడు. మత్తు పదార్థాలకు బానిస కావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. రెహ్మాన్‌కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు కాగా, మూడో పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి వారు ఒప్పుకోకపోవడంతో అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. వారి పేరున ఉన్న ఆస్తిని కూడా కాజేయాలనుకున్నాడు. తన తల్లిదండ్రులను హత్య చేసేందుకు నదీమ్ ఖాన్, గుడ్డూ అనే వ్యక్తులతో రెహ్మాన్ రెండున్నర లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. వారి సహాయంతో అహ్మద్, బానోలను హతమార్చాడు. ఏప్రిల్ 28 వారు నివాసముంటున్న భవనం మొదటి అంతస్తులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ చిన్మాయ్ బిస్వాల్ తెలిపారు. బెడ్‌షీట్‌తో ఊపిరాడకుండా చేయడంతో అహ్మద్, బానోలు చనిపోయనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయిందని బిస్వాల్ తెలిపారు. విచారణలో రెహ్మాన్ నేరాన్ని అంగీకరించాడనీ, అతనికి సహాయపడిన ఖాన్, గుడ్డూని కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
ముస్లింల జోలికి వస్తే ఊరుకోం
►నంద్యాలలో గూండా రాజకీయాలు చెల్లవు ►టీడీపీపై వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేత రహిమాన్ ధ్వజం నంద్యాల అర్బన్: టీడీపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడి ఓట్లను దండుకోవాలని చూస్తే ముస్లింలు గుణంపాఠం చెబుతారని వైఎస్ఆర్సీపీ జాతీయ కార్యదర్శి రహిమాన్ హెచ్చరించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లిం మత పెద్దలను బెదిరించడం జాతిని అవమానించినట్లేనన్నారు. మంగళ వారం నంద్యాల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ముస్లింలు టీడీపీకి ఓటు వేయాలని చంద్రబాబు హుకుం జారీం చేయడం అన్యాయమన్నారు. బెదిరింపులకు భయపడటానికి ముస్లిం మైనార్టీలు అమాయకులు కాదని స్పష్టం చేశారు. మూడేళ్ల కాలంలో ముస్లింల సంక్షేమానికి ఒక్క పథకమైనా అమలు చేయలేకపోవడం దారుణమన్నారు. మైనార్టీల విద్య, వైద్యం, ఆర్థిక సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు వచ్చేలా చేశారన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం భృహత్తర ప్రణాళికలతో తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. -
‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ మైనారిటీ నేత రెహ్మాన్ అన్నారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీలో మైనారిటీ సంక్షేమంపై ఆయన మాట్లాడుతూ... వైఎస్ జగన్ వ్యక్తి కాదు, ఓ శక్తి అన్నారు. ఎవరెన్ని చేసినా జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానే అని చంద్రబాబు గొప్పులు చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చార్మినార్ కూడా మీరే కట్టారా? అసెంబ్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, మక్కా మసీదు మీరే కట్టారా అని ప్రశ్నించారు. ఒక్క హైటెక్ సిటీ కట్టి తానే అంత కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేతలకుసిగ్గు లజ్జా లేదని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్ దొంగ, వాళ్ల తాత దొంగ, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా దొంగేనని పేర్కొన్నారు. ‘ముస్లింలకు నాలుగు శాతం ఎవరు ఇచ్చారు. సోనియా గాంధీ ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారు. మైనారిటీల గుండెల్లో వైఎస్ఆర్ కొలువై ఉన్నారు. ఒక్క సైకిల్‌కు రెండు హ్యాండిల్స్ ఉన్నాయి. టీడీపీ మంత్రివర్గంలో ఒక్క మైనారిటికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమ’ని రెహ్మాన్ అన్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు నదీం అహ్మద్ రాబోయే రోజుల్లో దుర్మార్గపు, మోసపూరిత చంద్రబాబు పాలనను సాగనంపుదామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు నదీం అహ్మద్ పిలుపునిచ్చారు. భారతదేశంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని మోసగాడు చంద్రబాబు ఒక్కరేనని దుయ్యబట్టారు. అమరావతికి ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తూ తెలుగుజాతిని మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దని కొనియాడారు. మనమందరం కష్టపడి సైనికులుగా పనిచేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని అహ్మద్ పిలుపునిచ్చారు. మైనారిటీలకు ఒక్క సీటు కూడా కేటాయించిన ఘనుడు చంద్రబాబని దుయ్యబట్టారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొని మంత్రిపదవులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. సంబంధిత కథనాలు: ‘ఫ్యాక్షనిస్టు అంటే చంద్రబాబే’ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు: ధర్మాన అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎన్టీఆర్ సినిమాలో విలన్ ఆయనే! వైఎస్ జగన్ సీఎం కాకూడదనే.. -
రహమాన్‌కు స్వర్ణం
హబీబ్‌కు రజతం సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ గ్రామీణ క్రీడల బాక్సింగ్ పోటీల్లో హైదరాబాద్ కుర్రాళ్లు అబ్దుల్ రహమాన్, హబీబ్ వుర్ రహమాన్ మెరిశారు. గుజరాత్‌లోని జై జలల్రామ్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్సలో జరిగిన ఈ పోటీల్లో అబ్దుల్ రహమాన్ బంగారు పతకం సాధించాడు. అండర్-17 బాలుర విభాగంలో జరిగిన 44-46 కేజీ కేటగిరీలో అతను విజేతగా నిలిచాడు. అండర్-19 విభాగంలో నిర్వహించిన 46-48 కేజీల కేటగిరీలో హబీబ్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. -
టీడీపీ ఉనికి కోసమే తెరపైకి పవన్
సుల్తాన్ బజార్ : ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఉనికి కోసమే పవన్ కళ్యాణ్‌ను తెరపైకి తీసుకువస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి హెచ్.ఎ. రెహ్మాన్ విమర్శించారు. ఈ మేరకు నగరంలోని కింగ్‌కోఠిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెహ్మాన్∙మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా అంటూ వస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఏపీలో టీడీపీ ఉనికి కోసం వస్తున్నాడని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనే భయం చంద్రబాబునాయుడికి పట్టుకుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్రమోడి, చంద్రబాబుకు అనుకూలపరుడని ప్రజలు ఇప్పటికే గుర్తించారని తెలిపారు. ఎన్నికల్లో రాత్రి పగలు కష్టపడి బాబుతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ దగ్గర ఉండి పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రజలు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి పోరాటం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన అన్నారు. -
కోట్లకు పడగలెత్తిన సీఆర్డీఏ అధికారి
విశాఖపట్నం: కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) టౌన్ ప్లానింగ్ అధికారి రెహ్మాన్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులుకు దిగారు. విశాఖలోని ఆయన ఇంటితో పాటు విజయవాడ, కర్నూలులోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 11 చోట్ల దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంతో ఏసీబీ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో భారీగా అధికారులు ఆస్తులు గుర్తించారు. అబ్దుల్లా అనే వ్యక్తి బినామీగా రెహ్మాన్ అక్రమాస్తులు కూడబెట్టారు. అబ్దుల్లా, కుమారుడి పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవారని సమాచారం. గతంలో రెహ్మాన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పని చేశాడు. ఇప్పటి వరకు రూ.1.60 కోట్లు అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. విశాఖ ఆయన నివాసంలో 4.46 లక్షలు, విదేశీ కరెన్సీ, బంగారంతో పాటు పలు జిల్లాల్లో సిరాస్థులను గుర్తించారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. అధికారులు గుర్తించిన అక్రమాస్తుల చిట్టా. ► విశాఖ దస్పల్లా హిల్స్ లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ► రాజధాని తుళ్లూరు అనంతవరంలో 70 సెట్ల వ్యవసాయ భూమి ► గుంటూరు పొన్నూరు రోడ్డులో అపార్ట్మెంట్ ► గుంటూరు, కర్నూలులో ఇల్లు. -
అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులకు దిగారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో పలు అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఓ ప్రభుత్వాద్యోగి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నాయి. నంద్యాల ఎస్ఆర్బీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషుబాబు ఇంటిపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. విశాఖపట్నం: కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) టౌన్ ప్లానింగ్ అధికారి రెహ్మాన్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులుకు దిగారు. విశాఖలోని ఆయన ఇంటితో పాటు విజయవాడ, కర్నూలులోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంతో ఏసీబీ దాడులు చేసింది. గతంలో రెహ్మాన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పని చేశాడు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. కోట్లలో ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. -
దాడి కేసులో ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
చాంద్రాయణగుట్ట: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నాయకులపై దాడి చేసిన కేసులో ఎంఐఎం పార్టీ కార్పొరేటర్‌తో పాటు మరో నలుగురిని చాంద్రాయణగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 2వ తేదీన జంగమ్మెట్ డివిజన్ ఘాజీమిల్లత్ కాలనీలో బీజేపీ అభ్యర్థి కౌడి మహేందర్‌తో పాటు ఆయన అనుచరులపై ఎంఐఎం అభ్యర్థి ఎం.ఎ.రెహమాన్(49), అతని నలుగురి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితులపై 143, 147, 323, 181, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇదే ఘటనలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కూడా కేసు నమోదైంది. -
సిరియాలో ఏపీ వాసి మృతి
- ఐఎస్ఐఎస్ లో చేరినట్లు నిఘా వర్గాల వెల్లడి - రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ మరణంపై అనేక అనుమానాలు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) ఛాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కూ విస్తరించాయా..? కువైట్‌లో ఉద్యోగం చేస్తున్న మచిలీపట్నం వాసి ఐసిస్‌లో చేరి సిరియాలో జరిగిన దాడుల్లో మరణించినట్లు వెలుగులోకి రావడంతో కేంద్ర, రాష్ట్రాల నిఘా వర్గాలు ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. అతడు ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు ఆకర్షితుడైనట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. ఇతడి సంబంధీకులు హైదరాబాద్‌లో ఉంటున్న నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించడానికి కేంద్ర నిఘా వర్గాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తుల్ఫిజుర్ రెహ్మాన్ మచిలీపట్నంలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్నేళ్ళ కిందట ఉద్యోగ నిమిత్తం కువైట్ వెళ్ళగా... ఇతడి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. దాదాపు ఏడాది కాలంగా అతనికి కుటుంబంతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో కేంద్ర నిఘా వర్గాలు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) సహకారంతో ఆన్‌లైన్‌పై నిఘా ఉంచుతోంది. భారత్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో అనుమానాస్పదమైన వారి ఆన్లైన్, సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ళ క్రితం కువైట్‌లో ఉంటున్న రెహ్మాన్ ఆన్లైన్లో ఐసిస్‌కు సంబంధించిన వెబ్సైట్లు వీక్షిస్తున్నట్లు, ఫేస్బుక్ ద్వారానూ సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించాయి. కొన్నాళ్ళ కిందట కువైట్‌లో ఉద్యోగం మానేసి సిరియా వెళ్ళిపోయిన రెహ్మాన్ ఐసిస్‌లో చేరినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించాయి. ఈ కోణంలో ఆరా తీస్తుండగానే సిరియాలో జరిగిన దాడుల్లో రెహ్మాన్ చనిపోయినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. రెహ్మాన్ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్న వర్గాలు ఈ ఉదంతం నేపథ్యంలో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ఏలూరుల్లో ఐసిస్ కార్యకలాపాలపై డేగకన్ను వేశాయి. ‘రెహ్మాన్ ఉదంతం నిరుడే జరిగినట్లు తెలుస్తోంది. గుర్తించడంలో మాత్రం ఆలస్యమైంది’ అని నిఘా విభాగ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఆదిలాబాద్‌కు చెందిన ఆతిఫ్ ఐసిస్‌లో చేరి సిరియాలో చనిపోయిన విషయం తెలిసిందే. -
మైనార్టీలంతా వైఎస్ జగన్ వైపే: రెహ్మాన్
మహబూబ్‌నగర్ : మైనార్టీలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపే ఉన్నారని ఆపార్టీ నేత రెహ్మాన్ అన్నారు. మైనార్టీలకు న్యాయం చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆయన బుధవారమిక్కడ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని రెహ్మాన్ ధీమా వ్యక్తం చేశారు. మైనార్టీ, బీసీ, ఎస్సీలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎదగనివ్వలేదని ఆయన విమర్శించారు. -
హత్యాయత్నం కేసులో విలన్ అరెస్టు
-
హత్యాయత్నం కేసులో విలన్ అరెస్టు
సినిమాల్లో విలన్‌గా చేస్తున్న ఓ నటుడు నిజజీవితంలో కూడా అలాగే వ్యవహరించాడని పోలీసులు అంటున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి రెహ్మాన్ అనే సినీ నటుడిని పశ్చిమ మండలం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో రెహ్మాన్ పాత్ర ఉందని, అందుకే అతడిని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. గతంలో విక్రమార్కుడు లాంటి సినిమాల్లో రెహ్మాన్ విలన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు. అయితే ఇప్పుడు ఆయన ఈ హత్యాయత్నం కేసులో ఉండటంతో టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
'జగన్‌పై బురదజల్లడమే ఎల్లో మీడియా పని'
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లడం తప్ప ఎల్లో మీడియాకు మరోపనిలేదని ఆ పార్టీ నేత రెహ్మాన్ విమర్శించారు. ప్రజల్లో జగన్‌కున్న ఆదరణను చూసి ఓర్వలేక కట్టుకథనాలను అల్లుతోందని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ప్లీనరీకి తెలంగాణ ప్రాంతం నుంచి వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారని రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల ఆస్తులకు తాము రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఏమీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సొత్తు కాదని, అందరిదీనని రెహ్మాన్ అన్నారు. ఇడుపులపాయలో ఆదివారం నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ ఘనంగా జరిగింది. జగన్‌తో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లీనర్ ప్రసంగించిన జగన్.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. -
'బిజెపి వర్క్ షాప్ లో టిడిపి సైకిల్ రిపేర్ చేస్తున్నారు'
-
మైనార్టీలు వైఎస్సార్సీపీ వెంటే. : రెహమాన్
అత్తాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని మైనారిటీ సోదరులందరూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి మద్దతిస్తున్నారని పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ రెహమాన్ అన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ ఎంఎం పహాడీ, హిమాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన 800 మంది మైనారిటీ సోదరులు రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో పార్టీలో చేరిన యువకులకు రెహమాన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ....ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అందించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో మైనారిటీ యువకులు పార్టీలో చేరడం ఆనందకరమని, ప్రతి మైనారిటీ కుటుంబానికి జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ....రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోజురోజుకు పార్టీ బలపడుతుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండాగా పార్టీని ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్వాన్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు దయానంద్, నాయకులు షేక్ నయీమొద్దీన్, ఇబ్రహీం, తయ్యబ్, సయ్యద్‌ఖదీర్, జుబేర్, ఇస్మాయిల్, సలీం, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సాయంత్రం అత్తాపూర్‌లోని రంగారెడ్డిజిల్లా పార్టీ కార్యాలయంనుంచి మైనారిటీ సోదరులు భారీ ర్యాలీగా సభాప్రాంగణానికి తరలివెళ్లారు. -
హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు.. అందరిదీ
-
హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు.. అందరిదీ
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఏ ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ సీపీ నేత రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్ అందరిదని, హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మనే అర్హత ఏ ఒక్కరికి లేదన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని రణన్నినాదం చేశారు. 'జబ్ సీధీ ఉంగ్లీ సే ఘీ నహీ నికలీతో ఉంగ్లీ టేఢీ కర్నీ పడేగీ' (వేలు తిన్నగా ఉంచితే డబ్బాలోంచి నెయ్యి రాదు.. వేలు వంకరగా పెట్టాల్సిందే) అంటూ సమైక్యరాష్ట్రం కోసం ఏమైనా చేస్తామన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో రెహ్మాన్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని చూసి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్య శంఖారావం కోసం వస్తున్నవందలాది బస్సులను తెలంగాణ ప్రాంతాలలో నిలిపేశారని, పోలీసులు ఆ బస్సులను తక్షణమే అనుమతించాలని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావుకు రెహ్మాన్ విజ్ఞప్తి చేశారు. -
వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ కన్వీనర్,రెహ్మన్‌తో సాక్షి వేదిక
-
కోల్‌కతాలో రెహ్మాన్ ఇష్క్
-
'హైదరాబాద్ కేసీఆర్ అబ్బ సొత్తు కాదు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మమాన్ మండిపడ్డారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ అబ్బసొత్తు కాదని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్ తన సొంత ఆస్తిలా మాట్లాడుతున్న కేసీఆర్ ప్రజలను భయభ్రాంతుకు గురిచేస్తున్నారని రెహమాన్ తెలిపారు. 'హైదరాబాద్ కు అర్ధరాత్రి అయినా సరే రండి. మీ సెక్యూరిటీ మేం చూసుకుంటాం' అని ఆయన తెలిపారు. హైదరాబాద్ మాది అంటూ కేసీఆర్ పదేపదే మాట్లాడటంపై రెహమాన్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌పై మెలికలు పెట్టి కిరికిరి చేయాలనుకుంటే రణరంగమే అవుతుందని టీఆర్ఎస్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.