
సాక్షి, విశాఖపట్టణం : విశాఖ నగర టీడీపీ పార్టీ అధ్యక్షుడు రెహ్మాన్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్‌ల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సంస్కారవంతమైన రాజకీయ నేతగా వ్యవహరించాలని రెహ్మాన్ వాసుపల్లికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షునిగా తనకు పగ్గాలు అప్పగించాలన్న నైతిక బాధ్యత కూడా లేదా? అని ఆయన లేఖలో ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కూడా సరిగా వ్యవహరించట్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి వ్యవహారశైలిపై చంద్రబాబుకు నివేదిక ఇస్తానని లేఖలో పేర్కొన్న రెహ్మాన్, మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వాసుపల్లిని ప్రవర్తన మార్చుకుని చురుకుగా పాల్గొనాలని అల్టిమేటమ్ జారీ చేశారు.