సాక్షి, విశాఖపట్నం : అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.
ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై గత నెల ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.
దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పాటు దసరాకు బోనస్ ఇవ్వలేదని, దీపావళికి జీతం లేదంటూ కార్మికులు వాపోతున్నారు. ఇంత జరగుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment