Vasupalli ganeskumar
-
ప్రధాని మోడీ టూర్ తో ఉత్తరాంధ్రకు మేలు : ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
-
గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా ఎన్ని గొడవలున్నా శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటిగా కలుసుకుంటాం. అందుకు భిన్నంగా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడంలో సిద్ధహస్తులుగా మారుతున్నారు టీడీపీ నగర నేతలు. ప్రతి విషయంలోనూ విలువలకు ‘గండి’ కొట్టే సదరు టీడీపీ నేత... ఎమ్మెల్యే వాసుపల్లి ఇంట జరిగిన శుభకార్యంలోనూ రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే భగ్గుమంటున్నారు. శుభకార్యాల్ని కూడా రాజకీయం చేస్తే పార్టీ మనుగడ కష్టమవుతుందంటూ పంచాయితీని పెద్దల ముందుకు తీసుకెళ్లడంతో మరోసారి పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. చదవండి: గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి.. శుభకార్యానికి వెళ్లొద్దనడంతో... రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడి రిసెప్షన్ జరిగింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన వాసుపల్లికి ఆ పార్టీలోని అన్ని వర్గాల వారితో సత్సంబంధాలున్నాయి. దీంతో అందరికీ ఈ వేడుకకు ఆహ్వానం అందించారు. విషయం తెలుసుకున్న టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీ వాసుపల్లి కుమారుడి రిసెప్షన్‌కు వెళ్లొద్దంటూ హుకుం జారీ చేశారు. ఎవరైనా ఈ వేడుకకు హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే మండిపడ్డారు. రాజకీయాలు రాజకీయాలే.. శుభకార్యాలు శుభకార్యాలే.. ఆయనెవరు మమ్మల్ని వెళ్లనివ్వొద్దని చెప్పడానికంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారో చూద్దామంటూ వేడుకలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న బాబ్జీ.. ఎవరైతే వాసుపల్లి ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారో వాళ్లని పార్టీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా గ్రూపుల నుంచి తొలగించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎక్కడా లేని విధంగా ఇలాంటి కుటిల రాజకీయాలకు గండి బాబ్జీ ఆద్యుడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. లేనిపోని వ్యవహారాలపై ఆంక్షలు విధిస్తే.. పార్టీ గెలవడం మాట అటుంచితే మనుగడ కూడా కోల్పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది నేతలతో కలిసి పనిచేసినా.. ఈ తరహా నీఛమైన అనుభవం ఎదురవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరత్ దృష్టికి పంచాయితీ గండి బాబ్జీ వ్యవహారాన్ని పార్టీ పెద్దల ముందుకు తీసుకెళ్లాలంటూ పంచాయితీని పార్టీ సీనియర్ నేత భరత్ దృష్టికి తీసుకెళ్లారు. బాబ్జీ వైఖరిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. గండి బాబ్జీ వ్యవహారంపై ఆ పార్టీ మహిళ ఆవేదనకు సంబంధించిన ఆడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దాని సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే... ‘‘బాబూ.. భరత్.. మీ తాత గారు మమ్మల్ని నియమించారు. అందరూ సమానమేననే ధోరణితో వెళ్లాం ఇన్నాళ్లూ. అన్ని పార్టీలూ సమానమేనని అనుకున్నాం. ఎన్నికల సమయంలో ఎలా గెలవాలనే ఆలోచనతో నిత్యం బాధలు పడి పనిచేసేవాళ్లం. కానీ ఏనాడూ ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు గండి బాబ్జీ వచ్చాక చుట్టాల దగ్గరికి వెళ్లొద్దంటారు.. పట్టాల దగ్గరికెళ్లొద్దంటున్నారు. వాసుపల్లి గణేష్‌కుమార్ మా బంధువు. ఆ పెళ్లికి వెళ్తున్నాననీ.. ఎవరైనా వస్తున్నారా అని 34వ వార్డు గ్రూపులో మెసేజ్ పెట్టాను. అది తప్పు అని.. ఎవరూ పెళ్లికి వెళ్లొద్దని పీఏతో బాబ్జీ వార్నింగ్ ఇచ్చారు. అన్ని గ్రూపుల నుంచి నన్ను తొలగించేశారు. ఇది ఎంతవరకూ కరెక్ట్.? ఇలాంటి విలువల్లేని మనుషులా అనేది అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పేమీ లేదు. పెళ్లిళ్లకు వెళ్లడం, వెళ్లకపోవడం అనేది మా వ్యక్తిగతం. దాన్ని ఇలా రాజకీయం చేస్తారని అనుకోలేదు. గెలిచే వ్యక్తులైతే ఇలా విడదీసి పాలించరు. ఇతను వచ్చాక కనీసం 50 మంది ముఖ్య కారకర్తలు పార్టీకి దూరమయ్యారు. పార్టీ గెలవాలనుకుంటున్నారో..? ఓడిపోవాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని నడిరోడ్డుపై ప్రెస్‌మీట్ పెట్టి నిలదీయాలని అనుకుంటున్నాను.’’ ఇలా.. ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గండి బాబ్జీ వ్యవహారంపై దక్షిణ నియోజకవర్గం టీడీపీ నేతల్లో ఇప్పటికే పూర్తి వ్యతిరేకత ఉంది. నియంతలా వ్యవహరిస్తూ కేడర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ నుంచి చాలా మంది దూరమైపోతారన్న సంకేతాల్ని ఇప్పటికే పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్ధా వెంకన్న బుధవారం నగరానికి వచ్చారు. గండి బాబ్జీ వ్యవహారాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. -
‘అక్కడ డబ్బున్న వారికే ప్రాధాన్యత’
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీని ధనిక వర్గాల పార్టీగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అభివర్ణించారు. వైఎస్సార్సీపీ పేదల గుండె చప్పుడు వినే పార్టీ అని తెలిపారు. గణేష్ కుమార్ వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన సందర్భంగా విశాఖ వన్ టౌన్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పూర్ణ మార్కెట్ దుర్గమ్మ గుడి తదితర ప్రాంతాల్లో ర్యాలీ సాగింది. (చదవండి: చంద్రబాబు కడుపుమంటపై తమిళ పత్రిక కథనం) ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని 16 నెలలు మదన పడ్డాడని, వైఎస్సార్సీపీలోకి చేరడం ఆనందంగా ఉందన్నారు. ‘ఏడేళ్ల పాటు టీడీపీలో వున్నా.. అక్కడ డబ్బున్న వారికే ప్రాధాన్యత’ అంటూ ఆయన మండిపడ్డారు. భవిష్యత్తుపై ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఇతర రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నిధులు దుర్వినియోగం చేయకుండా ప్రజల్ని ఆదుకుంటున్నారని తెలిపారు. ‘జలకళ’ పథకం ద్వారా రైతుల జీవితాల్లో వెలుగు నింపారని వాసుపల్లి గణేష్‌కుమార్ పేర్కొన్నారు. -
వైఎస్సార్ సీపీలో వాసుపల్లి జోష్
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారన్న వాపుతో ఉనికి చాటాలని యతి్నస్తున్న తెలుగుదేశం పార్టీకి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి శనివారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తన నైతిక మద్దతు ప్రకటించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనకు సంఘీభావంగానే తాను రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తనయులు వాసుపల్లి సూర్య, వాసుపల్లి గోవింద్ సాకేత్‌లను సీఎం సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి్పంచారు. ఏ పని చేసినా అంకితభావంతోనే.. వాసుపల్లి గణేష్‌కుమార్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడు. ఎయిర్‌ఫోర్స్‌లో 1988లో ఉన్నతాధికారిగా పనిచేసి 1994లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం విశాఖలోని 104 ఏరియాలో వైజాగ్ డిఫెన్స్ అకాడమీని నెలకొల్పి వేలాది మంది విద్యార్థులను డిఫెన్స్ రంగంలోకి పంపారు. అకాడమీని తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలకు విస్తరింపజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. విశాఖలో భారీ వినాయక విగ్రహాలను నెలకొల్పి అట్టహాసంగా చవితి సంబరాలు చేసేవారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన వాసుపల్లి ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంపై తన పట్టు నిరూపించుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఏ పనైనా అంకిత భావంతో చేసే వాసుపల్లి గణేష్ ఇప్పుడు ఆయన తనయులు వైఎస్సార్సీపీలోకి రావడంతో మరింత జోష్‌తో ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాసుపల్లికి అచ్చి వచ్చిన ‘19’ యాధృచ్ఛికమే కావొచ్చు కానీ 19వ తేదీ వాసుపల్లి గణేష్‌కి వ్యక్తిగత జీవితంలో అచ్చి వచ్చిన రోజుగా నిలిచిపోయింది. 1988 సెప్టెంబర్ 19వ తేదీన వాసుపల్లి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పైలట్ ఆఫీసర్‌గా చేరారు. 1994 సెప్టెంబర్ 19న ఎయిర్‌ఫోర్స్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 1994 అక్టోబర్ 19వ తేదీన వైజాగ్ డిఫెన్స్ అకాడమీని ప్రారంభించారు. 2014 మార్చి 19న ఎమ్మెల్యే అభ్యరి్థగా నామినేషన్ వేశారు. 2014 మే 19న తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ఎన్నో మేలిమలుపులు చోటుచేసుకున్న 19వ తేదీనే ఆయన ఇద్దరు కుమారులను వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేర్పించడం గమనార్హం. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను మొదటి నుంచి వాసుపల్లి గణేష్ స్వాగతిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా.. తాను మాత్రం ఉత్తరాంధ్ర వాసిగా రాజధాని నిర్ణయాన్ని హర్షిస్తున్నానని ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో విశాఖ రాజధాని ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పారీ్టకి కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యకలాపాలకు సైతం గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని ఉందంటూ ప్రకటించి ఆ మేరకు శనివారం మధ్యాహ్నం తాడేపల్లిలో ఆయన కుమారులను పార్టీలో చేర్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సాదరంగా ఆహా్వనించి పార్టీ కండువాలు వేశారు. విశాఖతో దశాబ్దాల అనుబంధం కలిగిన వాసుపల్లి నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వాగతించాయి. అధికార పార్టీలోకి టీడీపీ నగర, జిల్లా మాజీ సారథులు తెలుగుదేశం నేతలు వరుసగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండటంతో ప్రతిపక్ష పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్ సీపీలోకి టీడీపీకే చెందిన మరో ఎమ్మెల్యే, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమారులిద్దరూ చేరడంతో విశాఖ నగరంలో టీడీపీకి కోలుకోలేని షాక్ తగిలిందనే చెప్పాలి. అందులో హార్డ్‌కోర్ టీడీపీ నేతగా ముద్రపడ్డ వాసుపల్లి ఎవ్వరూ ఊహించని రీతిలో ఇలా షాక్ ఇవ్వడంతో నగర టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం కమ్ముకుంది. ఇదే సందర్భంలో నగరంలో మాస్ అప్పీల్ నేతగా చెలామణీ అయ్యే వాసుపల్లి రాకతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. -
టీడీపీలో వాసుపల్లి లేఖ కలకలం!
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ లేఖ కలకలం సృష్టించింది. అమరావతికి అనుకూలంగా వాసుపల్లి పేర్కొన్నట్టు టీడీపీ ఓ లేఖ విడుదల చేసింది. దాంతో తాను రాయని లేఖ ఎలా వచ్చిందని టీడీపీ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించారు. పార్టీ చర్యలపై వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడులో గతంలో మాట్లాడిన వాసుపల్లి వ్యాఖ్యల్ని తాజాగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంపైన ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రపై విషం చిమ్మే క్రమంలో చంద్రబాబు అండ్‌కో ఈ పనిచేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: అసలు అక్కడ ఉద్యమమే లేదు) -
టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసులపై దౌర్జన్యం
సాక్షి, విశాఖపట్నం: పట్టణంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్‌లు గురువారం ఉదయం ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించవ్దదంటూ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పోలీసులతో గొడవకు దిగారు. ర్యాలీకి అనుమతులేందుకంటూ పోలీసులపై దాడి చేశారు. జంక్షన్ వద్ద ఉన్న బారికేడ్స్‌ను తోసేసి ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పర్యటన సందర్భంగా విశాఖ నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. టీడీపీ నాయకులు, కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించడంతో నగర పౌరులు ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. పోలీసులతో వాగ్వివాదాలకు దిగుతూ తెలుగు తమ్ముళ్లు ఓవరాక్షన్ చేయడంతో రద్దీ రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. అత్యుత్సాహం ప్రదర్శించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు వారించకపోవడం గమనార్హం. -
అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని తెలీదా?
సాక్షి, విశాఖపట్టణం : విశాఖ నగర టీడీపీ పార్టీ అధ్యక్షుడు రెహ్మాన్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సంస్కారవంతమైన రాజకీయ నేతగా వ్యవహరించాలని రెహ్మాన్ వాసుపల్లికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షునిగా తనకు పగ్గాలు అప్పగించాలన్న నైతిక బాధ్యత కూడా లేదా? అని ఆయన లేఖలో ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కూడా సరిగా వ్యవహరించట్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి వ్యవహారశైలిపై చంద్రబాబుకు నివేదిక ఇస్తానని లేఖలో పేర్కొన్న రెహ్మాన్, మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వాసుపల్లిని ప్రవర్తన మార్చుకుని చురుకుగా పాల్గొనాలని అల్టిమేటమ్ జారీ చేశారు. -
విశాఖ తీరం: మునిగిపోతున్న నావలా టీడీపీ
తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏదైనా ఒక్క జిల్లా పాలిటిక్స్‌ను పరిశీలిస్తే చాలు. సువిశాల తీరం ఉన్న విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మునిగిపోయే నావలా తయారైంది. ప్రజాప్రతినిధులు ఎవరి దారిలో వారు నడుస్తూ.. పార్టీని దారిలో పెట్టేవారే లేనట్టు కనిపిస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో నేతలు రచ్చకెక్కుతున్నారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేల చూపులు చూస్తోంది. తీరంలో సైకిల్ తిరోగమనంలో పయనిస్తోంది. 2004 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో కేవలం నలుగురితో సరిపెట్టుకుంది. అందులో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు గెలుపు అంత ఈజగా రాలేదు. చివరి నిమిషంలో చావుతప్పి కన్నులొట్టబోయినట్టు ఆయన ఒడ్డునపడ్డారు. ఇక, పార్టీలో గెలిచిన నలుగురైనా.. చెయ్యీ చెయ్యీ కలిపి ముందుకెళ్తున్నారా అంటే అదీ లేదు. నలుగురూ నాలుగు దారుల్లో వెళ్తూ.. పార్టీని ఏ తీరానికి తేర్చాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుంచి పూర్తిస్థాయిలో తేరుకోలేకపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికీ లోకల్ సమస్యలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. దీంతో ఎక్కడికక్కడ లోకల్ అధికార కేంద్రాలుగా మారేందుకు.. విశాఖ టీడీపీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. విశాఖ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా ఎస్ఏ రెహ్మాన్‌ను నియమించారు. అయితే.. రెహ్మాన్‌కు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంది. రెహ్మాన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తాను పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టనని భీష్మించుకొని కూర్చున్నారు వాసుపల్లి గణేష్. అంతేకాదు, రెహ్మాన్‌ను బాహాటంగానే ఆయన విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసుపల్లి గణేష్‌కు షోకాజ్ నోటీసులు ఇస్తానని రెహ్మాన్ ప్రకటించారు కూడా. ఇటు వాసుపల్లి ధోరణి మాత్రం ఏం చేసుకున్నా పర్వాలేదు.. టీడీపీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసేది లేదనేలా ఉంది. ఇటీవల అధికార పార్టీని విమర్శించడానికి వాసుపల్లి గణేష్ పార్టీ కార్యాలయంలో కాకుండా.. ఒక హోటల్లో ప్రెస్‌మీట్ పెట్టడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ కార్యాలయంలోకి అడుగు పెట్టకుండా.. సొంత ఖర్చుతో ప్రెస్‌మీట్ పెట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయం ఉండగా ప్రెస్‌మీట్ బయట ఎక్కడో పెట్టడం ఏంటని రెహ్మాన్ రగిలిపోతున్నారట. వాసుపల్లి గణేష్ అధికార పార్టీ కంటే తననే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారట. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా మెలుగుతున్నారని తెలుస్తోంది. స్వయంగా అధ్యక్షుడు ఆదేశించినా.. ఆయన మాత్రం ఆచరించడానికి మొగ్గుచూపడం లేదని అంటున్నారు. ఇక.. కాకలు తీరిన గంటా శ్రీనివాసరావు గురించి చెప్పనవసరమే లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను ఆయన పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదట. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులు అనుభవించి అధికారం చెలాయించడాన్ని బాగా వంటబట్టించుకున్న గంటా... ఇప్పుడు ఆ అధికారానికి దూరంగా జస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగడాన్ని ఏమాత్రం జీర్ణించుకోవడం లేదని సొంత పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్న విశాఖ జిల్లా టీడీపీ నేతలు.. కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేస్తారు.. పార్టీని ఏ తీరానికి చేరుస్తారనేది నాయకులకే అర్థంకాని మిస్టరీగా మారింది. -
మునిగిపోతున్న నావలా టీడీపీ
-
‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విద్యార్థి టీసీ ఇచ్చేందుకు సొమ్ములు డిమాండ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాధితులు విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన మారెడ్డి మణికంఠారెడ్డి విశాఖ నగరం 104 ఏరియాలో ప్రియదర్శిని జూనియర్ కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదివాడు. సబ్జెక్టులు చాలా మిగిలిపోవడంతోపాటు సరైన విద్యా ప్రమాణాలు లేవని, హాస్టల్ వసతి కూడా సరిగ్గా లేదని భావించిన మణికంఠ కుటుంబ సభ్యులు కాలేజీ నుంచి టీసీ తీసుకోవాలని భావించారు. కళాశాల ప్రిన్సిపాల్ మంగళవాణిని సంప్రదించిన విద్యార్థి తల్లి మారెడ్డి ఆదిలక్ష్మి తన కుమారుడి టీసీ ఇవ్వాలని కోరారు. టీసీ ఇవ్వాలంటే రూ.30 వేలు చెల్లించాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశారు. ఫస్టియర్ ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు చెల్లించామని, టీసీ కోసం మళ్లీ రూ.30 వేలు అడగటం ఏమిటని ఆదిలక్ష్మి ప్రశ్నించారు. అంతమొత్తం చెల్లించలేమని స్పష్టం చేశారు. దీంతో కళాశాల సిబ్బంది ఒక్కసారిగా జులుం ప్రదర్శించారు. ‘డబ్బు కట్టకపోతే టీసీ ఇచ్చేది లేదు. బయటకు పొండి’ అంటూ బలవంతంగా గెంటివేశారు. ఇదేమిటని ఎదురు తిరిగిన వారిపై ‘ఇది ఎమ్మెల్యే గారి కాలేజీ. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మమ్మల్ని ఎవ్వరూ పీకలేరు. ఎక్కువ మాట్లాడితే మీరు గుంటూరు కూడా వెళ్లలేరు’ అని బెదిరింపులకు దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆదిలక్ష్మి వెంటనే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్పై ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫొటోతో ఉన్న అకాడమీ బోర్డు కేసు దర్యాప్తు చేస్తున్నాం ప్రియదర్శిని కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీపై ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్‌కుమార్ శనివారం తెలిపారు. ఆదిలక్ష్మితో పాటు మరో ముగ్గురు విద్యార్థుల తల్లితండ్రులు కూడా తమపై కళాశాల ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారన్నారు. అయితే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన విద్యార్థుల నుంచి ఇదే మాదిరి ఫిర్యాదులు సదరు అకాడమీపై అందాయని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): తనను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని 2014 ఎన్నికల సమయంలో వాసుపల్లి గణేష్‌కుమార్ హామీలిచ్చేశారు. దీంతో 2009 ఎన్నికల్లో మూడో స్థానంలోకి దిగజారిపోయిన వాసుపల్లిని నియోజకవర్గ ప్రజలు కనికరించారు. పోనిలే..ఈసారి అవకాశమిద్దామని 2014 లో అవకాశమిచ్చారు. అంతే అప్పటి నుంచి ప్రజా సమస్యలు గాలికొదిలేశారంటూ నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ అధిస్టానం ఈ దఫా ఎన్నికల్లో కూడా వాసుపల్లికే టికెట్ కేటాయించడంతో టీడీపీ తమ్ముళ్లే రగిలిపోతున్నారు. ప్రత్యక్షంగా..పరోక్షంగా వాసుపల్లికి దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఎన్నికల ప్రచారానికి 21వ వార్డుకు వెళ్లిన వాసుపల్లిని వార్డు ప్రజలు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు యర్రబల్లి ప్రభాకర్, సీఎం రమణను నిలదీశారు. సీసీ రోడ్డు..అభివృద్ధి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారాలకైతే ముందుంటారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు కనిపించావా? మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఐదేళ్ల కాలంలో వార్డు సమస్యలు పట్టించుకున్నారా? కమీషన్ల కక్కుర్తితో మురికివాడ ప్రాంతంగా తయారు చేశారు. మీరా..మా నాయకులు..మీకా మేము ఓట్లేసేది అంటూ ఎండగట్టారు.యువకులు, మహిళలు, వార్డు పెద్దలు వారిపై మండిపడ్డారు. అమ్మవారి గుడి రోడ్డు వేయకుండా అడ్డుతగిలారంటూ వాగ్వాదానికి దిగారు. ఏ ముఖం పెట్టుకొని వార్డులోకి వచ్చారంటూ నిలదీశారు. వార్డు టీడీపీ అధ్యక్షుడు సీఎం రమణ వల్లే మాకు ఈ దుస్థితి వచ్చిందంటూ ఎదురుతిరిగారు. అంతేగాక వార్డు అభివృద్ధికి నిరోధకులతో వస్తే ఊరుకోమని వాసుపల్లిని హెచ్చరించారు. అన్ని పథకాల్లో దోపీడికి పాల్పడిన వారిని పక్కన పెట్టుకుని రావడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతి పనిలో లంచాలకు మరిగిన పార్టీ సీనీయర్నాయకుడు యర్లబల్లి ప్రభాకర్‌ను ఎందుకు వెంట తిప్పుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. స్థానికుల నుంచి పెద్దగా వ్యతిరేకత రావడంతో టీడీపీ తమ్ముళ్లు, వాసుపల్లికి తల తిరిగినట్టయ్యింది. పసుపు చొక్కాలు ఒక్కసారిగా తెల్లముఖం వేశాయి. దీంతో వాసుపల్లి, టీడీపీ నాయకులు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. -
ముస్లింల ద్రోహి వాసుపల్లి
విశాఖపట్నం , పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): ముస్లింల ద్రోహిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పాతనగరం ముస్లిం వాడల్లోకి వస్తే తరిమి కొడతామని విశాఖ అర్బన్ టీడీపీ మైనారిటీ వింగ్ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాదిక్ హెచ్చరించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ముస్లింలు వాసుపల్లికి చేసిన మేలును మరిచిపోయారని, అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో ముస్లింల సంక్షేమం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ముస్లిం ప్రజాదర్బార్ పేరిట ప్రతి శుక్రవారం నమాజ్ సమయంలో సమావేశాలు నిర్వహించి ముస్లింల మనోభావాలు దెబ్బతీశాడని ధ్వజమెత్తారు. పాతనగరంలోని మసీదులకు సంబంధించిన మతపెద్దలు ముస్లింలకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాలు నిర్మించాలని పలుమార్లు విన్నవించినా నెరవేర్చలేదన్నారు. మైనారిటీలకు వర్తించే దుల్హన్ పథకం, ఇళ్ల మంజూరు వంటి విషయాలకు సంబంధించి రాష్ట్రం విడుదల చేస్తున్న నిధుల్లో 90 శాతం వెనక్కి వెళ్లిపోవడానికి కారణం ఎమ్మెల్యే అని దుయ్యబట్టారు. ఈ నిధులపై నిరక్షరాస్యులైన ముస్లింలకు అవగాహన కల్పించాల్సిన ఆయన నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడమే నిధులు వెనక్కివెళ్లడానికి కారణమన్నారు. చెప్పులరిగేలా ఎమ్మెల్యే చుట్టు ముస్లింలు ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్క పథకాన్ని అమలుచేయడం లేదని చెప్పారు. పాతనగరంలోని డీన్షాదీఖానాను అధికారం చేపట్టిన ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించని ఎమ్మెల్యే ఎన్నికలు సమీపిస్తుండడంతో షాదీఖానా పునరుద్ధరణకు నిధులు మం జూరు చేశానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్ల కాలంలో ముస్లింలను ఎమ్మెల్యే నట్టేటముంచాడని విమర్శించారు. ఎన్నికలకు ముందు ముస్లింలమీద ప్రేమాభినాలు ఉన్నట్టు నటిస్తున్న వాసుపల్లిని ముస్లింలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. -
వాసుపల్లిపై రణం
వాసుపల్లి లొల్లి అధికార టీడీపీలో పెను దుమారం రేపుతోంది..దక్షిణ ఎమ్మెల్యేగా, పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్న ఆయనపై సొంత పార్టీలోని దళితులే తిరుగుబాటు బావుటా ఎగరేసే పరిస్థితికి ఆయన వ్యవహారశైలే కారణమన్నది స్పష్టం.నోటి దురుసు, అనాలోచిత నిర్ణయాలతో ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్న ఎమ్మెల్యే.. ఈ సారి ఏకంగా దళిత బాణానికే టార్గెట్‌గా మారారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కోవలసిన దుస్థితిలో పడ్డారు.తమను కులం పేరుతో దూషించారన్న ఆరోపణతో సొంత పార్టీలోని పలువురు దళిత నేతలు నిప్పులు కక్కుతున్నారు. కేసు పెట్టడమే కాకుండా.. పార్టీ నాయకత్వానికి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు. వాసుపల్లికి వ్యతిరేకంగా మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో భారీ సభకూ సిద్ధమవుతున్నారు.ఎన్నికలు ఏడాది దూరంలోనే ఉన్న సమయంలో తలెత్తిన ఈ తిరుగుబాటు నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే ఇప్పుడు రాజీ మంత్రం జపిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై ఆ పార్టీ దళిత నేతల తిరుగుబాటు దుమారం రేపుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తిరుగుబాటు చేసిన నేతలను దారికి తెచ్చుకునేందుకు ఒక్కొక్కరికి రెండేసి హుద్‌హుద్ ఇళ్లతో పాటు రూ.30 వేల నగదు ఇస్తామని ఎర వేస్తున్నారు. దారికొచ్చిన వారితో స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అయితే వాసుపల్లి ఆగడాలతో విసిగివేసారిన పార్టీ సీనియర్ నేత రామారెడ్డితో సహా దళిత నేతలు మాత్రం రాజీకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఆయన తీరు వల్లే 23వ వార్డు సీనియర్ దళిత నేత సాలిగ్రామం కనకరాజు మనోవేదనతో మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ఫిర్యాదులు పార్టీలో మంత్రి గంటా తర్వాత నగర పార్టీలో ఇన్నాళ్లు చక్రం తిప్పిన వాసుపల్లికి సొంత పార్టీలోనే సెగ మొదలైంది. ప్రత్యేక హోదా ఉద్యమంతో పార్టీ గ్రాఫ్ ఒకవైపు పడిపోతుంటే.. మరోవైపు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో తలెత్తిన తిరుగుబాటు వాసుపల్లితోపాటు పార్టీకీ తలనొప్పిగా మారింది. 23వ వార్డు అధ్యక్షుడి మార్పు విషయంలో ఎదురు తిరిగిన పార్టీ నేతలను దారికి తెచ్చుకునేందుకు వాసుపల్లి నానాతంటాలు పడుతున్నారు. కులం పేరుతో దూషించారంటూ పార్టీ సీనియర్ నేత, కనకమహాలక్ష్మి దేవస్థానం ట్రస్టీ ఓదూరి శివయ్య, అర్బన్ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ రేజేటి చిట్టిబాబు, ఎమ్మార్పీఎస్ అర్బన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొత్తరమూడి శ్రీనివాస్‌లు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. జిల్లా మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడులతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళావెంకట్రావు, సీఎం చంద్రబాబుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రచార పోరాటం ఫిర్యాదులతో ఆగకుండా దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో సభలు, సమావేశాలు నిర్వహించి వాసుపల్లి అవినీతి, భూకబ్జాలు, దళితులపై దౌర్జన్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. అప్పటికి పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని న్యాయం చేయకపోతే పార్టీలోని దళిత నేతలను కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని భావిస్తున్నారు. బుధవారం నగరానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి మల్లవరపు నాగయ్య మాదిగ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దళితులను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే సాగించిన దాడులు, దౌర్జన్యాలను ఆయనకు వివరించారు. అంతేకాకుండా వచ్చే నెల రెండో తేదీన నగరానికి వస్తున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ దృష్టికి కూడా తీసుకెళ్లి ఆయనతో నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించనున్నట్టు తొత్తరమూడి శ్రీనివాస్ వెల్లడించారు. ఎదురు ఫిర్యాదు వాసుపల్లిపై నమోదైన కేసు విచారణలో భాగంగా త్రీటౌన్ సీఐ ఇమ్మా నియేలురాజు బు«ధవారం టీడీపీ కార్యాలయం, సంఘటన జరిగిన ప్రాంతాల్లో విచారణ జరిపారు. ఫిర్యాదు చేసిన వారితో పాటు ఆ సమయంలో ఉన్న వారి నుంచి వివరాలు సేకరించారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యేతో విబేధించిన పార్టీ సీనియర్ నేత రామారెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన తనను కులం పేరుతో దూషించారంటూ ప్రస్తుత వార్డు అధ్యక్షుడు బంగారు రవిశంకర్ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరినట్టయ్యింది. ‘కనకరాజు మృతికి ఎమ్మెల్యే వైఖరే కారణం’ ఎమ్మెల్యే వైఖరి కారణంగానే 23వ వార్డు దళిత నేత సాలిగ్రామం కనకరాజు చనిపోయాడని దళిత నేతలు ఆరోపిస్తున్నారు. చెంగలరావు పేట హైస్కూల్ పక్కనే సీట్ కవర్లు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న కనకరాజు బడ్డీని తన ఫ్లెక్సీకి అడ్డు వచ్చిందన్న అక్కసుతో ఎమ్మెల్యే బలవంతంగా తీయించేశారని.. తన పొట్టమీద కొడతారా? అని ప్రశ్నించిన పాపానికి ఎమ్మెల్యే ఆయన్ను నానాదుర్భాషలాడారని ఆరోపించారు. దాంతో తీవ్ర మనోవేదనతో కనకరాజు మృతి చెందాడని వివరించారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కుమార్తె పెళ్లికి ఆర్థిక సాయం చేస్తానని, అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారని.. అయితే కనీసం ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి గానీ, చివరకు చంద్రన్న బీమా నుంచి కానీ ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయలేదని వారు వివరించారు. ఇంతకంటే దళితుల పట్ల వాసుపల్లి వివక్ష మరొకటి ఏముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. -
ఇదేం అ'న్యాయం'!
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.. ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న సమయం.. సందర్భం.. పక్కనే కొనసాగుతున్న మత్స్యకారుల దీక్షలను పట్టించుకోకపోవడం ఇప్పుడు వివాదానికి తావిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి వారమైంది. ఇన్నాళ్లూ నోరుమెదపని వాసపల్లి ఈరోజే పనిగట్టుకొని కొంతమందిని వెంటేసుకొచ్చి నిరసన పేరుతో కాసేపు హడావుడి చేశారు.. ఆ పక్కనే తన సామాజికవర్గీయులే ఎస్టీ జాబితాలో చేర్చాలని 43 రోజులుగా చేస్తున్న దీక్షలను మాత్రం ఆయనగారు పట్టించుకోలేదు.. కనీసం శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు.. బడ్జెట్ కేంద్రం పరిధిలోనిది.. తనకు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఏదో చేశానన్న మెహర్బానీ కోసం నిరసన తెలిపిన ఎమ్మెల్యే.. రాష్ట్ర పరిధిలోని అంశమైన మత్స్యకారుల ఎస్టీ సాధన డిమాండ్‌ను పట్టించుకోకపోవడం.. సీఎంను ఒప్పించ లేకపోవడం.. దీక్షలను ఉపేక్షించడంపై నిరసన వ్యక్తమవుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గంలోనే మత్స్యకార జనాభా ఎక్కువగా ఉన్నా.. ఎమ్మెల్యే వాసుపల్లి అంటీముట్టనట్లు వ్యవహరించడం చర్చలకు తావిచ్చింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నగర అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా బుధవారం నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తనదైన శైలిలో నిరసన చేపట్టిన ఎమ్మెల్యే.. ఆ పక్కనే ఉన్న మత్స్యకారుల దీక్షా శిబిరం వైపు తొంగిచూడకపోవడం విమర్శలపాలవుతోంది. తమను ఎస్టీ జాబితాలో చేర్పించాలంటూ పార్టీలకతీతంగా మత్స్యకారులు గత డిసెంబర్ 27 నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో దీక్షాశిబిరం జోలికి వెళ్లని వాసుపల్లి.. సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడు మాత్రం ఏదో చేశానని చెప్పుకోవడానికి మత్స్యకార నాయకులను ఆయన వద్దకు తీసుకుని వెళ్లారు. కానీ సీఎం అందరి ముందు వాసుపల్లిని చెడామడా తిట్టేశారు. ఆయనతోపాటు మత్స్యకార నేతలపైనా బాబు విరుచుకుపడ్డారు. కనీసం వినతిపత్రం కూడా తీసుకోకుండా ‘తొక్క తీస్తా.. బ్లాక్మెయిల్ రాజకీయాలు నా వద్ద చేస్తున్నారా’.. అంటూ వాసుపల్లి ముందే మత్స్యకారులపై మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌తో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మత్స్యకారులపై సీఎం అలా మాట్లాడినా వాసుపల్లి ఏమీ స్పందించలేని పరిస్థితిలో మిన్నకుండిపోయారు. ఆ ఘటన దరిమిలా వాసుపల్లి మత్స్యకారుల దీక్షాశిబిరం జోలికి వెళ్లలేదు. పోలీసులు వేధిస్తున్నా.. పట్టించుకోని ఎమ్మెల్యే మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత దీక్షలతో నిరశన తెలియజేస్తున్న మత్స్యకారులపైకి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీక్షలకు అనుమతి లేదంటూ శిబిరాన్ని ఎత్తివేయాలని గత రెండు రోజులుగా నేతలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకారుల దీక్షలు భగ్నం చేసేందుకు కొంతమంది ప్రభుత్వ అనుకూల కుట్రదారులు దీక్షా శిబిరానికి నిప్పు పెట్టారు. అటువంటి ఘటనలు ఇక్కడా చోటుచేసుకోవచ్చన్న నెపంతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వాస్తవానికి అటువంటి పరిస్థితి విశాఖలో లేదు. గత 43రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రశాంతంగానే దీక్షలు కొనసాగుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఓ విధంగా మత్స్యకార నేతలను వేధిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులకు అండగా నిలవాల్సిన వాసుపల్లి అస్సలు పత్తా లేకుండా పోయారు. బుధవారం బడ్జెట్‌పై నిరసన చేపట్టిన సందర్భంగానైనా పక్కనే ఉన్న మత్స్యకారుల శిబిరం వద్దకు వస్తారని అందరూ భావించారు. కానీ ఎమ్మెల్యే అటు వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలపాలవుతోంది. వాసుపల్లి తీరు గర్హనీయం ఓ వైపు పగపట్టిన విధంగా ప్రభుత్వ తీరు.. పోలీసుల ఆంక్షలతో నిరసనకారులు అల్లాడిపోతుంటే కనీసం దీక్షా శిబిరం వద్దకు రావాలన్న కనీస స్పృహ కూడా ఎమ్మెల్యే వాసుపల్లికి లేకపోయిందని వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు విమర్శించారు. న్యాయమైన డిమాండ్‌తో గంగపుత్రులు 43 రోజులుగా దీక్షలు చేస్తుంటే ఎమ్మెల్యేగా, మత్స్యకార వర్గీయునిగా ఉన్న వాసుపల్లి ఏమాత్రం పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. తీరిక లేదేమో దీక్షా శిబిరం వైపు తొంగిచూడని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరుపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మత్స్యకార సంఘం నేత నీలకంఠం వ్యాఖ్యానించారు. బహుశా ఆయనకు తీరిక లేదేమో.. అందువల్లనే వచ్చి ఉండరు.. అని వ్యంగాస్త్రం సంధించారు. -
నగర పదవి ఖరారు:జిల్లా పదవిపై ప్రతిష్టంభన
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ కుమార్ పేరు దాదాపు ఖరారైంది. అయితే జిల్లా టీడీపీ అధ్యక్షుని ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. గవిరెడ్డి రామానాయుడు, ఆనంద్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక తలనొప్పిగా మారిన నేపధ్యంలో నేతలు అధిష్టానానికి వదిలివేశారు. ఇదిలా ఉండగా, విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా బుడ్డా వెంకన్న ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల అర్జునుడు ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా గౌతు శిరీష పేరును ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీత అధిష్టానానికి సూచించారు. -
టీడీపీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి
పోలీసులనుఆశ్రయించిన వైద్యుడు సీతంపేట : దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చెప్పిన విధంగా ఆయన మనుషులకు డబ్బులు ఇవ్వకుంటే ఆసుపత్రి లేపేస్తానని బెదిరించారని కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి.వి.రమణమూర్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సమీపంలో జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన అక్రమ కట్టడానికి పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని ఆయన తెలిపారు. అందుకు ఆక్రమణదారులకు తాను రూ.9 లక్షలు చెల్లిం చాలని లేకపోతే అంతు చూస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 15వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్త టాక్సీ రాజు మరో కొంతమంది అనుచరులతో ఎమ్మెల్యే గణేష్‌కుమార్ ద్వారకానగర్‌లోని తన ఆసుపత్రికి వచ్చి ఆందోళన చేశారన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటారని గురువారం వరకు వేచిచూశానన్నారు. తనకు, తన ఆసుపత్రి సిబ్బందికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు వాపసు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమణమూర్తి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. తన నియోజకవర్గం ఎమ్మెల్యేపై అభిమానం, గౌరవించాలనే ఫిర్యాదును వాపసు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ద్వారకాజోన్ సీఐ పి.వి.వి నరసింహారావును సంప్రదించగా ఎమ్మెల్యే బెదిరించారని రక్షణ కల్పించాలని గురువారం ఫిర్యాదు చేసిన డాక్టర్ రమణమూర్తి అదే రోజు రాత్రి ఫిర్యాదును వాపసు తీసుకున్నట్లు తెలిపారు.