
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ లేఖ కలకలం సృష్టించింది. అమరావతికి అనుకూలంగా వాసుపల్లి పేర్కొన్నట్టు టీడీపీ ఓ లేఖ విడుదల చేసింది. దాంతో తాను రాయని లేఖ ఎలా వచ్చిందని టీడీపీ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించారు. పార్టీ చర్యలపై వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడులో గతంలో మాట్లాడిన వాసుపల్లి వ్యాఖ్యల్ని తాజాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంపైన ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రపై విషం చిమ్మే క్రమంలో చంద్రబాబు అండ్‌కో ఈ పనిచేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు.
(చదవండి: అసలు అక్కడ ఉద్యమమే లేదు)
Comments
Please login to add a commentAdd a comment