వైఎస్సార్‌ సీపీలో వాసుపల్లి జోష్‌ | TDP MLA Vasupalli Ganesh Kumar Sons Joins YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో వాసుపల్లి జోష్‌

Published Sun, Sep 20 2020 8:35 AM | Last Updated on Sun, Sep 20 2020 10:18 AM

TDP MLA Vasupalli Ganesh Kumar Joins YSRCP - Sakshi

క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కుమారులు సూర్య, గోవింద్‌ సాకేత్‌

సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారన్న వాపుతో ఉనికి చాటాలని యతి్నస్తున్న తెలుగుదేశం పార్టీకి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. టీడీపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి శనివారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన నైతిక మద్దతు ప్రకటించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనకు సంఘీభావంగానే తాను రాష్ట్ర  ప్రభుత్వానికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తనయులు వాసుపల్లి సూర్య, వాసుపల్లి గోవింద్‌ సాకేత్‌లను సీఎం సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరి్పంచారు. 

ఏ పని చేసినా అంకితభావంతోనే.. 
వాసుపల్లి గణేష్‌కుమార్‌ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యావంతుడు. ఎయిర్‌ఫోర్స్‌లో 1988లో ఉన్నతాధికారిగా పనిచేసి 1994లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం విశాఖలోని 104 ఏరియాలో వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీని నెలకొల్పి వేలాది మంది విద్యార్థులను డిఫెన్స్‌ రంగంలోకి పంపారు. అకాడమీని తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలకు విస్తరింపజేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. విశాఖలో భారీ వినాయక విగ్రహాలను నెలకొల్పి అట్టహాసంగా చవితి సంబరాలు చేసేవారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన వాసుపల్లి ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంపై తన పట్టు నిరూపించుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఏ పనైనా అంకిత భావంతో చేసే వాసుపల్లి గణేష్‌ ఇప్పుడు ఆయన తనయులు వైఎస్సార్‌సీపీలోకి రావడంతో మరింత జోష్‌తో ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

వాసుపల్లికి అచ్చి వచ్చిన ‘19’ 
యాధృచ్ఛికమే కావొచ్చు కానీ 19వ తేదీ వాసుపల్లి గణేష్‌కి వ్యక్తిగత జీవితంలో అచ్చి వచ్చిన రోజుగా నిలిచిపోయింది. 1988 సెప్టెంబర్‌ 19వ తేదీన వాసుపల్లి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పైలట్‌ ఆఫీసర్‌గా చేరారు. 1994 సెప్టెంబర్‌ 19న ఎయిర్‌ఫోర్స్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 1994 అక్టోబర్‌ 19వ తేదీన వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీని ప్రారంభించారు.  2014 మార్చి 19న ఎమ్మెల్యే అభ్యరి్థగా నామినేషన్‌ వేశారు. 2014 మే 19న తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ఎన్నో మేలిమలుపులు చోటుచేసుకున్న 19వ తేదీనే ఆయన ఇద్దరు కుమారులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేర్పించడం గమనార్హం. 

విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను మొదటి నుంచి వాసుపల్లి గణేష్‌ స్వాగతిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నా.. తాను మాత్రం ఉత్తరాంధ్ర వాసిగా రాజధాని నిర్ణయాన్ని హర్షిస్తున్నానని ప్రకటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో విశాఖ రాజధాని ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పారీ్టకి కొన్నాళ్లుగా దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యకలాపాలకు సైతం గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని ఉందంటూ ప్రకటించి ఆ మేరకు శనివారం మధ్యాహ్నం తాడేపల్లిలో ఆయన కుమారులను పార్టీలో చేర్పించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సాదరంగా ఆహా్వనించి పార్టీ కండువాలు వేశారు. విశాఖతో దశాబ్దాల అనుబంధం కలిగిన వాసుపల్లి నిర్ణయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు స్వాగతించాయి. 

అధికార పార్టీలోకి టీడీపీ నగర, జిల్లా మాజీ సారథులు 
తెలుగుదేశం నేతలు వరుసగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతుండటంతో ప్రతిపక్ష పార్టీకి షాక్‌ మీద షాక్‌ తగులుతోంది. ఇప్పటికే టీడీపీ మాజీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్, రూరల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీకే చెందిన మరో ఎమ్మెల్యే, టీడీపీ అర్బన్‌ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌ కుమారులిద్దరూ చేరడంతో విశాఖ నగరంలో టీడీపీకి కోలుకోలేని షాక్‌ తగిలిందనే చెప్పాలి. అందులో హార్డ్‌కోర్‌ టీడీపీ నేతగా ముద్రపడ్డ వాసుపల్లి ఎవ్వరూ ఊహించని రీతిలో ఇలా షాక్‌ ఇవ్వడంతో నగర టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం కమ్ముకుంది. ఇదే సందర్భంలో నగరంలో మాస్‌ అప్పీల్‌ నేతగా చెలామణీ అయ్యే వాసుపల్లి రాకతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement