‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’ | Rehman, Nadeem Ahmed speech in YSRCP Plenary | Sakshi

‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’

Published Sat, Jul 8 2017 5:23 PM | Last Updated on Tue, May 29 2018 3:36 PM

‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’ - Sakshi

‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’

నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ సంగతి చూస్తామని వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ నేత రెహ్మాన్‌ హెచ్చరించారు.

అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ నేత రెహ్మాన్‌ అన్నారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్లీనరీలో మైనారిటీ సంక్షేమంపై ఆయన మాట్లాడుతూ...  వైఎస్‌ జగన్‌ వ్యక్తి కాదు, ఓ శక్తి అన్నారు. ఎవరెన్ని చేసినా జగన్‌ సీఎం కావడం ఖాయమన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానే అని చంద్రబాబు గొప్పులు చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చార్మినార్‌ కూడా మీరే కట్టారా? అసెంబ్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, మక్కా మసీదు మీరే కట్టారా అని ప్రశ్నించారు. ఒక్క హైటెక్‌ సిటీ కట్టి తానే అంత కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేతలకుసిగ్గు లజ్జా లేదని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్‌ దొంగ, వాళ్ల తాత దొంగ, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా దొంగేనని పేర్కొన్నారు. ‘ముస్లింలకు నాలుగు శాతం ఎవరు ఇచ్చారు. సోనియా గాంధీ ఇవ్వలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారు. మైనారిటీల గుండెల్లో వైఎస్‌ఆర్‌ కొలువై ఉన్నారు. ఒక్క సైకిల్‌కు రెండు హ్యాండిల్స్‌ ఉన్నాయి. టీడీపీ మంత్రివర్గంలో ఒక్క మైనారిటికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. నంద్యాలలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమ’ని రెహ్మాన్‌ అన్నారు.

చంద్రబాబు పచ్చి మోసగాడు
రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు నదీం అహ్మద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement