Nadeem Ahmed
-
ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్ గా నదీమ్ అహ్మద్ ప్రమాణ శ్వీకారం
సాక్షి, అమరావతి: ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్‌గా నదీమ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉర్ధూ అకాడమీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గతంలో ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఉర్ధూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని నదీమ్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ హాజరయ్యారు. -
మరో మూడు నెలల్లో జగనన్న పాలన
అనంతపురం, కదిరి: ‘ఏ గ్రామానికెళ్లినా చంద్రబాబు సర్కారుతో విసిగి వేసారిపోయామని ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడెళ్లిపోతుందయ్యా? అని మమ్మల్ని అడుగుతున్నారు. వారందరి కోరిక మేరకు మరో 3 నెలల్లో మనందరి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉండవచ్చు’ అని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి గురువారం నియోజకవర్గంలో ప్రారంభించిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్పీకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నదీం అహ్మద్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇప్పటికి మూడుసార్లు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, వైఎస్సార్సీపీ అలాంటి మతతత్వ పార్టీలకు దూ రంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికీ చంద్రబాబు బీజేపీతో గుట్టుగా సంసారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలనగానే ఆయనకు భయం పట్టుకుందని, అందుకే సర్పంచ్ల పదవీకాలం పూర్తయినా ఎన్నికలు నిర్వహించలేదని చెప్పారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమిది కదిరి సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే గిట్టదు. వ్యవసాయమే దండగ అన్న వ్యక్తి ఆయ న. అందుకే సోలార్ బాధిత రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. వారికి ఇప్పటిదాకా పరిహారం ఇవ్వలేదు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీనీవాకు శ్రీకారం చుట్టి దాదాపుగా 80 శాతం పనులు పూర్తి చేస్తే చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు గేట్లు ఎత్తుతూ అది తన ఘనతగా చెప్పుకొంటున్నారు. కదిరి ప్రాంతంలోని చెరువులన్నింటినీ నింపిన తర్వా తే కుప్పంకు నీళ్లు తీసుకెళ్లేందుకు అనుమతిస్తాం. లేదంటే ప్రతిఘటిస్తాం. చంద్రబాబు పరిపాలనపై ప్రజలు ఇక నిన్ను నమ్మం బాబు అంటున్నారు’ అని పేర్కొన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రానున్నది జగనన్న పాలన అని విశ్వాసం వ్యక్తపరిచారు. సింగిల్‌విండో అధ్యక్షుడు జగదీశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో పార్టీ మండల కన్వీనర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. -
‘నంద్యాలలో టీడీపీ సంగతి చూస్తాం’
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ మైనారిటీ నేత రెహ్మాన్ అన్నారు. నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల్లో టీడీపీ సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీలో మైనారిటీ సంక్షేమంపై ఆయన మాట్లాడుతూ... వైఎస్ జగన్ వ్యక్తి కాదు, ఓ శక్తి అన్నారు. ఎవరెన్ని చేసినా జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానే అని చంద్రబాబు గొప్పులు చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చార్మినార్ కూడా మీరే కట్టారా? అసెంబ్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, మక్కా మసీదు మీరే కట్టారా అని ప్రశ్నించారు. ఒక్క హైటెక్ సిటీ కట్టి తానే అంత కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నేతలకుసిగ్గు లజ్జా లేదని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్ దొంగ, వాళ్ల తాత దొంగ, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా దొంగేనని పేర్కొన్నారు. ‘ముస్లింలకు నాలుగు శాతం ఎవరు ఇచ్చారు. సోనియా గాంధీ ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించారు. మైనారిటీల గుండెల్లో వైఎస్ఆర్ కొలువై ఉన్నారు. ఒక్క సైకిల్‌కు రెండు హ్యాండిల్స్ ఉన్నాయి. టీడీపీ మంత్రివర్గంలో ఒక్క మైనారిటికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమ’ని రెహ్మాన్ అన్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు నదీం అహ్మద్ రాబోయే రోజుల్లో దుర్మార్గపు, మోసపూరిత చంద్రబాబు పాలనను సాగనంపుదామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు నదీం అహ్మద్ పిలుపునిచ్చారు. భారతదేశంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని మోసగాడు చంద్రబాబు ఒక్కరేనని దుయ్యబట్టారు. అమరావతికి ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తూ తెలుగుజాతిని మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దని కొనియాడారు. మనమందరం కష్టపడి సైనికులుగా పనిచేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని అహ్మద్ పిలుపునిచ్చారు. మైనారిటీలకు ఒక్క సీటు కూడా కేటాయించిన ఘనుడు చంద్రబాబని దుయ్యబట్టారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొని మంత్రిపదవులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. సంబంధిత కథనాలు: ‘ఫ్యాక్షనిస్టు అంటే చంద్రబాబే’ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు: ధర్మాన అవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎన్టీఆర్ సినిమాలో విలన్ ఆయనే! వైఎస్ జగన్ సీఎం కాకూడదనే.. -
15 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సేవలు
► రిజిస్ట్రేషన్ల శాఖకు టీసీఎస్ స్పష్టీకరణ ► 100 మందికిపైగా ► ఇంజనీర్ల ఉపసంహరణ ఆన్లైన్ సేవలపై ప్రభావం సాక్షి, హైదరాబాద్: తమకు రావాల్సిన రూ. 15 కోట్ల బకాయిలను చెల్లించే వరకు రిజిస్ట్రేషన్ల శాఖలో సాంకేతిక సేవలను కొనసాగించే ప్రసక్తే లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్ (ఎఫ్ఎం)గా కుదిరిన కాంట్రాక్టు ఆగస్టు 18నే ముగియడంతో అప్పటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 100 మందికిపైగా సర్వీస్ ఇంజనీర్లను వెనక్కి తీసుకుంది. ఫలితంగా రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌లోని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలోనూ ఆన్లైన్ సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ టీసీఎస్ అధికారులను పిలిచి మాట్లాడినా బకాయిలు చెల్లించే వరకు సేవలను పునరుద్ధరించేది లేదని ఆ సంస్థ పేర్కొన్నట్లు తెలిసింది. ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ల శాఖలో రూ. 15 కోట్ల బకాయిలను చెల్లించలేని దుస్థితి నెలకొనడంపై ఆ శాఖ సిబ్బంది కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఎం నియామకంలో ఐటీశాఖ జాప్యం! ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల కాలానికి 2011లో అప్పటి ప్రభుత్వం టీసీఎస్‌ను రిజిస్ట్రేషన్ల శాఖకు ఫెసిలిటీ మేనేజర్ (టెక్నికల్)గా నియమించింది. గడువుకు మూడు నెలల ముందుగానే కొత్త ఎఫ్ఎం నియామక ప్రక్రియను ఉన్నతాధికారులు పూర్తి చేయాల్సి ఉండగా ఆ మేరకు ప్రయత్నాలేమీ జరిగినట్లు కనిపించడం లేదు. కొత్త ఎఫ్ఎం నియామకం కోసం టెండర్లు పిలవాలని ఐటీశాఖను రిజిస్ట్రేషన్ల శాఖ విన్నవించినా ఆ ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని సమాచారం. సర్వర్ సమస్యలతో సతమతం ఎఫ్ఎం సాంకేతిక సేవలు నిలిచిపోవడంతో నెలరోజులుగా క్షేత్రస్థాయిలో నిరంతరం సర్వర్ డౌన్ కావడం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి సమస్యలు రిజిస్ట్రేషన్ల శాఖను పట్టిపీడిస్తున్నాయి. పది నిమిషాల్లో పూర్తి కావాల్సిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ... సాంకేతిక సమస్యల కారణంగా గంటలకొద్దీ సమయం తీసుకుంటోంది. సాధారణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 30 నుంచి 50 డాక్యుమెంట్లు, నగరాల్లోనైతే రోజుకు 100 నుంచి 150 డాక్యుమెంట్ల దాకా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయని... సాంకేతిక సమస్యలతో పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని సబ్ రిజిస్ట్రార్లు వాపోతున్నారు. -
కొత్త పాలసీ ఏంటో..?
ఖమ్మం క్రైం: ఎక్సైజ్ కొత్త పాలసీ విధానం ఇంకా ప్రకటించక పోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. వైన్‌షాపుల లెసైన్స్ గడువు జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త షాపులకు లెసైన్స్ ఇచ్చేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఎక్సైజ్ అధికారులకు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ కారణంగా గడువు ముగిసేలోపు చేయాల్సిన పనులు ఏ విధంగా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. అలాగే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపారు. షాపుల లెసైన్స్‌లు రెన్యువల్ చేసే సమయంలో ఆ షాపులను పరిగణలోకి తీసుకోవాలా..? వద్దా..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జిల్లా ఉన్నతాధికారులు మాత్రం కిందిస్థాయి సిబ్బందిని పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత అమ్మకాలు జరుగుతున్నాయనే పూర్తి వివరాలను కమిషనర్ కోరినట్లు తెలిసింది. సీమాంధ్రలో కలుస్తున్న తొమ్మిది వైన్‌షాపులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ షాపులను తెలంగాణ రాష్ట్రంలో కలపాలా... ఆంధ్రా రాష్ట్రంలో ఉంచాలా అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించకపోవడంతో అధికారులు దానికి సంబంధించి ప్రత్యేక నివేదికను తయారు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 153 వైన్‌షాపులు, 44 బార్ అండ్ రెస్టారెంట్లు, మూడు క్లబ్‌లకు సంబంధించి లెసైన్స్‌లను పాత విధానంతోనే అమలు చేస్తారా... లేక కొత్త రాష్ట్రంలో కొత్త విధానాలు రూపొందిస్తారో... వేచి చూడాల్సి ఉంది. నేడు వైన్‌షాపుల యజమానులతో కమిషనర్ సమావేశం రాష్ట్రంలో లెసైన్స్ విధానంపై శనివారం హైదరాబాద్‌లో జిల్లా వైన్‌షాపుల యజమానులతో కమిషనర్ నదీం అహ్మద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మద్యం పాలసీ విధానం అమలు తీరు గురించి చర్చించనున్నట్లు తెలిసింది. వరుస ఎన్నికల నేపథ్యంలో షాపు యజమానులకు కొంత నష్టం జరగడంతో.. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి షాపు యజ మానులతో మాట్లాడేందుకు హైదరాబాద్‌కు పిలిపించినట్లు వైన్‌షాపు యజమానులు తెలిపారు.