ఎన్‌పీకుంట బహిరంగ సభకు హాజరైన జనం (ఇన్‌సెట్) ప్రసంగిస్తున్న నదీం అహ్మద్, చిత్రంలో డాక్టర్ సిద్దారెడ్డి, పూల శ్రీనివాసులరెడ్డి, జగదీశ్వరరెడ్డి
అనంతపురం, కదిరి: ‘ఏ గ్రామానికెళ్లినా చంద్రబాబు సర్కారుతో విసిగి వేసారిపోయామని ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడెళ్లిపోతుందయ్యా? అని మమ్మల్ని అడుగుతున్నారు. వారందరి కోరిక మేరకు మరో 3 నెలల్లో మనందరి ప్రభుత్వం వస్తుంది. అప్పుడు జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉండవచ్చు’ అని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్ అన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి గురువారం నియోజకవర్గంలో ప్రారంభించిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్‌పీకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నదీం అహ్మద్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇప్పటికి మూడుసార్లు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, వైఎస్సార్‌సీపీ అలాంటి మతతత్వ పార్టీలకు దూ రంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికీ చంద్రబాబు బీజేపీతో గుట్టుగా సంసారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలనగానే ఆయనకు భయం పట్టుకుందని, అందుకే సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయినా ఎన్నికలు నిర్వహించలేదని చెప్పారు.
రైతు వ్యతిరేక ప్రభుత్వమిది
కదిరి సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే గిట్టదు. వ్యవసాయమే దండగ అన్న వ్యక్తి ఆయ న. అందుకే సోలార్ బాధిత రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. వారికి ఇప్పటిదాకా పరిహారం ఇవ్వలేదు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీనీవాకు శ్రీకారం చుట్టి దాదాపుగా 80 శాతం పనులు పూర్తి చేస్తే చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు గేట్లు ఎత్తుతూ అది తన ఘనతగా చెప్పుకొంటున్నారు. కదిరి ప్రాంతంలోని చెరువులన్నింటినీ నింపిన తర్వా తే కుప్పంకు నీళ్లు తీసుకెళ్లేందుకు అనుమతిస్తాం. లేదంటే ప్రతిఘటిస్తాం. చంద్రబాబు పరిపాలనపై ప్రజలు ఇక నిన్ను నమ్మం బాబు అంటున్నారు’ అని పేర్కొన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రానున్నది జగనన్న పాలన అని విశ్వాసం వ్యక్తపరిచారు. సింగిల్‌విండో అధ్యక్షుడు జగదీశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో పార్టీ మండల కన్వీనర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment