
సాక్షి, అమరావతి: ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్‌గా నదీమ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉర్ధూ అకాడమీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
గతంలో ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఉర్ధూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని నదీమ్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment