ముస్లింల జోలికి వస్తే ఊరుకోం | ysrcp leader rehaman fire on tdp govt | Sakshi
Sakshi News home page

ముస్లింల జోలికి వస్తే ఊరుకోం

Published Wed, Jul 26 2017 1:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

ముస్లింల జోలికి వస్తే ఊరుకోం - Sakshi

ముస్లింల జోలికి వస్తే ఊరుకోం

నంద్యాలలో గూండా రాజకీయాలు చెల్లవు
టీడీపీపై వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ నేత రహిమాన్‌ ధ్వజం


నంద్యాల అర్బన్‌: టీడీపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడి ఓట్లను దండుకోవాలని చూస్తే ముస్లింలు గుణంపాఠం చెబుతారని వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ కార్యదర్శి రహిమాన్‌ హెచ్చరించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లిం మత పెద్దలను బెదిరించడం జాతిని అవమానించినట్లేనన్నారు. మంగళ వారం నంద్యాల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ముస్లింలు టీడీపీకి ఓటు వేయాలని చంద్రబాబు హుకుం జారీం చేయడం అన్యాయమన్నారు. బెదిరింపులకు భయపడటానికి ముస్లిం మైనార్టీలు అమాయకులు కాదని స్పష్టం చేశారు.

మూడేళ్ల కాలంలో ముస్లింల సంక్షేమానికి ఒక్క పథకమైనా అమలు చేయలేకపోవడం దారుణమన్నారు. మైనార్టీల విద్య, వైద్యం, ఆర్థిక సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు వచ్చేలా చేశారన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం భృహత్తర ప్రణాళికలతో తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement