రాష్ట్రంలోని మైనారిటీ సోదరులందరూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి మద్దతిస్తున్నారని పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ రెహమాన్ అన్నారు.
అత్తాపూర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని మైనారిటీ సోదరులందరూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి మద్దతిస్తున్నారని పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ రెహమాన్ అన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ ఎంఎం పహాడీ, హిమాద్‌నగర్ ప్రాంతాలకు చెందిన 800 మంది మైనారిటీ సోదరులు రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో పార్టీలో చేరిన యువకులకు రెహమాన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ....ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అందించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో మైనారిటీ యువకులు పార్టీలో చేరడం ఆనందకరమని, ప్రతి మైనారిటీ కుటుంబానికి జగన్మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ....రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోజురోజుకు పార్టీ బలపడుతుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారమే ఎజెండాగా పార్టీని ముందుకు తీసుకువెళుతున్నామన్నారు.
కార్యక్రమంలో పార్టీ కార్వాన్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు దయానంద్, నాయకులు షేక్ నయీమొద్దీన్, ఇబ్రహీం, తయ్యబ్, సయ్యద్‌ఖదీర్, జుబేర్, ఇస్మాయిల్, సలీం, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సాయంత్రం అత్తాపూర్‌లోని రంగారెడ్డిజిల్లా పార్టీ కార్యాలయంనుంచి మైనారిటీ సోదరులు భారీ ర్యాలీగా సభాప్రాంగణానికి తరలివెళ్లారు.