కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులకు దిగారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో పలు అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
కర్నూలు జిల్లాలో ఓ ప్రభుత్వాద్యోగి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నాయి. నంద్యాల ఎస్ఆర్బీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషుబాబు ఇంటిపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది.
విశాఖపట్నం: కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) టౌన్ ప్లానింగ్ అధికారి రెహ్మాన్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులుకు దిగారు. విశాఖలోని ఆయన ఇంటితో పాటు విజయవాడ, కర్నూలులోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంతో ఏసీబీ దాడులు చేసింది. గతంలో రెహ్మాన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్గా పని చేశాడు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. కోట్లలో ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది.