seshubabu
-
జబర్దస్త్ మా కన్నతల్లి
హాస్య రసామృతంలో తేలియాడిస్తారు. అలసిన మనసులను సేదదీరుస్తారు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ ఇద్దరు జబర్దస్త్ రాపేటి అప్పారావు, అద్దంకి శేషు. వీరిద్దరు సహా పలువురు జబర్దస్త్ నటులు సీఎంఆర్ వద్ద జరిగిన ప్రైవేటు కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షితో వారు పంచుకున్న ముచ్చట్లివి. షకలక శంకర్ నా దేవుడు విజయనగరం టౌన్ : నేనీ స్థాయిలో ఉన్నానంటే అది షకలక శంకర్ పుణ్యమే. విశాఖ అక్కయ్యపాలెంలో ఆటోమెబైల్స్ వ్యాపారం చేసుకునేవాడిని. లెంక సత్యానందం మా గురువు. థియేటర్ ఆర్ట్స్ చదివేటప్పుడు ఆయన మాకు తరగతులు చెప్పేవారు. ఆయన చెప్పే ప్రతి మాట నా జీవితంలో పాతుకుపోయాయి. రోజా, నాగబాబులు ఎంతో అభిమానంతో మమ్మల్ని చూస్తారు. జబర్దస్త్‌కి ముందు 50.. ఆ ర్వాత 150కి పైగా సినిమాలు చేశాను. శ్రీ ఆంజనేయం, చందమామ, మహాత్మ, గోవిందుడు అందరివాడేలే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనింతే తదితర చిత్రాలకు ఆడిషన్స్ ద్వారా ఎంపికయ్యాను. చిన్నికృష్ణ దర్శకత్వంలో వీడుతేడా సినిమాలో అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సీనియర్ ఆర్టిస్ట్ బొమ్మలాట చిట్టి సారిక నన్ను అయిదేళ్ల పాటు ఆదరించారు. సినీరంగంలోకి రావాలనుకున్నవారు డిగ్రీ చేసి, కళను పూర్తిగా నేర్చుకోవాలి. కుటుంబ సభ్యుల ఆమోదం పొందాలి. అంకితభావంతో కష్టపడాలి. నటి శ్రీరెడ్డి ఆశయం చాలా గొప్పది. కానీ ఆమె ఎంచుకున్న మార్గం సరైంది కాదనేది నా అభిప్రాయం. చిన్న సినిమాలు విడుదల కాకుండా ఉండిపోతున్నాయి. కనీసం రోజుకు రెండైనా ప్రదర్శించాలి. – రాపేటి అప్పారావు గ్లిజరిన్ లేకుండా నటించా జబర్దస్త్ కార్యక్రమంతో సినీ పరిశ్రమలో ప్రవేశించాను. సీక్రెట్ కెమెరా.. ముందుగా వెళ్తున్న వారిని బకరా చేస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కార్యక్రమాల ద్వారా మంచి పేరు వచ్చింది. సుప్రీం సినిమాతో నా జీవితం మారిపోయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశాను. వరుణ్ తేజ్ సినిమా మిస్టర్‌లో నా ప్రతి డైలాగ్ పేలింది. కుమారి 21 ఎఫ్కి సూర్యప్రతాప్ అనే దర్శకుడు నా గురించి రిఫరెన్స్ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ నిర్వహించిన ఆడిషన్స్‌లో గ్లిజరిన్ పెట్టుకుని ఏడుపు సీన్ చేయాల్సి ఉంది. అందుకు గ్లిజరిన్ వాడకుండానే చేసిన సీన్‌కి కెమెరామన్, కో–డైరెక్టర్ ఏడ్చారు. అంత అద్భుతంగా ఆ సీన్ వచ్చింది. రంగస్థలం సినిమాకు ఆ విధంగానే నాకు అవకాశం వచ్చింది. నా అదృష్టం ఏమిటంటే ఒకదానికొకటి అద్భుతమైన పాత్రలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ 40కి పైగా సినిమాలు చేశాను. బెల్లంకొండ శ్రీనివాస్, హీరో గోపీచంద్ సినిమాలతో పాటు బృందావనమిది అందరిదీ వంటి చిత్రాలలో నటిస్తున్నాను. విజయనగరంతో చాలా పరిచయం ఉంది. ఆర్కెస్ట్రా ద్వారా పరిసర ప్రాంతాల్లో పనిచేశాను. – అద్దంకి శేషు కుమార్ -
అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులకు దిగారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో పలు అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఓ ప్రభుత్వాద్యోగి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నాయి. నంద్యాల ఎస్ఆర్బీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషుబాబు ఇంటిపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. విశాఖపట్నం: కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) టౌన్ ప్లానింగ్ అధికారి రెహ్మాన్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులుకు దిగారు. విశాఖలోని ఆయన ఇంటితో పాటు విజయవాడ, కర్నూలులోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంతో ఏసీబీ దాడులు చేసింది. గతంలో రెహ్మాన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పని చేశాడు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. కోట్లలో ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. -
సంప్రదాయాన్ని ధిక్కరించాడని..
పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్‌తో సహా మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం పెద్దవూర మండలం బాసోనిబావి తండాలో జరిగింది. పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బాసోనిబావితండాలో గిరిజనులు పవిత్రంగా భావించే హోలీమాత (కాముడి) పండగను వారం రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ. గతంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ పండగను ఈ సారి పది సంవత్సరాలకు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రంతా తండావాసులు నిద్రాహారాలు మాని గిరిజన సంప్రదాయం ప్రకారం నృత్యాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి వేకువజామున కాముడిని దహనం చేశారు. దీనిని చూడటానికి పరిసర తండాలైన కోమటికుంటతండా, నంభాపురంల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాముడిని దహనం చేస్తున్న సమయంలో కోమటికుంట తండాకు చెందిన బాణావత్ బాలు కూడా వచ్చాడు. ఎవరైనా కాముడి దహనాన్ని చూడొచ్చు కానీ బూడిదను ముట్టుకోవడం, నోట్లో వేసుకోవడం గానీ చేయరాదనేది సంప్రదాయం. కాముడిని కాల్చిన తర్వాత వచ్చే బూడిదను గ్రామ పెద్ద అయిన మదిగేరియా మొదటగా తీసుకుని బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్న తరువాత గ్రామ పెద్దలు, అనంతరం తండావాసులు దానిని తీసుకుంటారు. కేకే తండాకు చెందిన బాలు పవిత్రమైన కాముడి బూడిదను ఎవరూ తీసుకోకముందే దానితో బొట్టు పెట్టుకుని నోట్లో వేసుకున్నాడు. గిరిజనుల సంప్రదాయం ప్రకారం ఇది తండాకు అరిష్టం. దీంతో బాలును తండాకు చెందిన గిరిజనులు పట్టుకుని చితక బాదారు. కోపంలో అతనిని ఏమైనా చేసారేమోనని తండాకు చెందిన గ్రామపెద్ద ఒకరు అతన్ని తీసుకుని వెళ్లి ఇంట్లో తాళం వేసి నిర్బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి హాలియా సీఐ శివశంకర్, పెద్దవూర, హాలియా, సాగర్ ఎస్ఐలు ఇండ్ల వెంకటయ్య, బోజ్యానాయక్, రజినీకర్లు తమ సిబ్బందితో చేరుకున్నారు. ఇంటిలో బంధించిన బాలును స్టేషన్‌కు తరలించే క్రమంలో తండావాసులు అతన్ని తీసుకుపోవద్దని, తమకు అప్పగించాలని అతడిని అంతం చేస్తామని పోలీసులను అడ్డుకుని రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. ఈ క్రమంలో పెద్దవూర ఏఎస్ఐ తాడిపర్తి శేషుబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్యాంసుందర్‌రెడ్డి, మరో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో ఏఎస్ఐకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సాగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంప్రదాయానికి భంగం కలిగించిన బాలుపై కేసు నమోదు చేశామని, అదేవిధంగా అక్కడికి వెళ్లిన పోలీసులపై దాడి చేసి విధులకు ఆటంకం కల్గించినందుకు తండావాసులపై కూడా కేసులు పెట్టి రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ తెలిపారు.